Trending: పాకిస్తాన్ నుంచి భారత్ కు రైలు ప్రయాణం.. ఛార్జీ కేవలం రూ.4 మాత్రమే.. కానీ..
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఈ మాట అక్షర సత్యం. పాతది ఎప్పుడైనా సరే మురిపెంగానే ఉంటుంది. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రూపాయి కి వ్యాల్యూ లేకుండా పోతోంది. దీంతో ప్రజలు ముఖ్యంగా పేదలు..
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఈ మాట అక్షర సత్యం. పాతది ఎప్పుడైనా సరే మురిపెంగానే ఉంటుంది. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రూపాయి కి వ్యాల్యూ లేకుండా పోతోంది. దీంతో ప్రజలు ముఖ్యంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు పూటలా కడుపు నిండా తినేందుకూ అష్ట కష్టాలు పడుతున్నారు. దీంతో పాత రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుండు అని అనుకుంటుంటారు చాలా మంది. నిజానికి కొన్నేళ్ల క్రితం ధరలు చాలా తక్కువగా ఉండేవి. అప్పటి పరిస్థితులను బట్టి ధరలు ఉన్నా.. అవి ఇప్పుడు మనకు చాలా తక్కువ అనిపిస్తాయి. పది రూపాయలతో నెలకు సరిపడా సరకులు కొనుక్కునే వాళ్లంటే అతిశయోక్తి లేదు. అదే.. ఇప్పుడు పది రూపాయలకు కనీసం సింగిల్ టీ కూడా రాదు. దీంతో చాలా మంది అప్పటి ధరలు.. ఇప్పటి ధరలను పోలుస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. అవి క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ట్రెండింగ్ లో ఉన్న పోస్ట్ లో.. 76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్ ఉంది. పాకిస్తాన్ నుంచి భారత్‌కు వెళ్లే ఓ పాత టిక్కెట్ అది.1947 లో ఈ టిక్కెట్ తీసుకున్నారు. ఓ కుటుంబం పాకిస్తాన్‌లోని రావల్పిండి నుంచి భారత్ లోని అమృత్‌సర్ ప్రయాణించడానికి కేవలం 36 రూపాయాల తొమ్మిది అణాలు చెల్లించి టిక్కెట్ కొనుగోలు చేశారు. అంటే.. ఒక్కొక్కరికి టిక్కెట్ ధర రూ.4. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ నుంచి భారత్ కు ప్రయాణం చేసేందుకు కేవలం రూ.4 సరిపోతుందన్న విషయం తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
A train ticket from #Rawalpindi to #Amritsar for a family of 9 people travelling on 17th September 1947. This is post independence of both #India and #Pakistan costing 36rs and 9annas. ( pic from internet) pic.twitter.com/lKUwPSLxaS
— Varun (@Ambarseriya) January 19, 2023
అయితే.. రూ.4 అనేది 1947లో చాలా ఎక్కువ డబ్బు. ఆ సమయంలో టిక్కెట్ ధర ఖరీదైనదేనదే. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే చాలా తక్కువే కదా. దీంతో అది నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..