SpiceJet: విమానంలో మహిళ సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. ఇద్దరు ప్రయాణికులను దింపేసిన స్పైస్‌జెట్‌..!

ఇతర ప్రయాణికులు చిత్రీకరించిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. మొదట, క్యాబిన్ సిబ్బంది ప్రయాణీకులలో ఒకరితో వాగ్వాదానికి దిగడం కనిపించింది. ఆ తర్వాత

SpiceJet: విమానంలో మహిళ సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. ఇద్దరు ప్రయాణికులను దింపేసిన స్పైస్‌జెట్‌..!
Misbehaving
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 24, 2023 | 7:38 AM

గత కొద్ది రోజులుగా విమాన ప్రయాణంలో కలుగుతున్న అసౌకర్యాలు, ఫ్లైట్‌లో జరుగుతున్న చిత్ర విచిత్ర సంఘటనలకు సంబంధించిన వార్తలే హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఇన్సిడెంట్‌ జరిగింది. జనవరి 23 సోమవారం రోజున స్పైస్‌ జెట్‌ విమానంలో సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను విమానం నుంచి దించేసి సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికులు, స్పైస్‌జెట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే స్పైస్‌జెట్‌ విమానంలో కేబిన్‌ సిబ్బందితో ఒక ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే వివాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే స్పైస్‌జెట్‌ విమానంలో కేబిన్‌ సిబ్బందితో ఒక ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. సిబ్బందిలోని ఒక మహిళను అతడు అనుచితంగా తాకినట్టు ఆరోపించింది స్పైస్‌జెట్‌. దీంతో ఆ ప్రయాణికుడిని, అతడితోనే వస్తున్న మరో వ్యక్తిని ఢిల్లీలోనే విమానం నుంచి దింపేసి పోలీసులకు అప్పగించినట్టు స్పైస్‌జెట్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఇతర ప్రయాణికులు చిత్రీకరించిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. మొదట, క్యాబిన్ సిబ్బంది ప్రయాణీకులలో ఒకరితో వాగ్వాదానికి దిగడం కనిపించింది. ఆ తర్వాత మరొక ప్రయాణికుడు వాదనకు దిగాడు. ఈ ఘటన వల్ల 1.5 గంటల ఆలస్యమైందని ట్విట్టర్ యూజర్ ఒకరు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..