జవాన్ ఛాతిలో లైవ్ గ్రెనేడ్.. వైద్యుల ధైర్యానికి హాట్సాఫ్ !!
ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం జరుగుతున్న తరుణంలో ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. సైనికుడి ఛాతిలో ఇరుక్కున్న లైవ్ గ్రెనేడ్‌ను తొలగించారు వైద్యులు ముందుకు వచ్చారు.
ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం జరుగుతున్న తరుణంలో ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. సైనికుడి ఛాతిలో ఇరుక్కున్న లైవ్ గ్రెనేడ్‌ను తొలగించారు వైద్యులు ముందుకు వచ్చారు. యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డ ఓ సైనికుడి ఛాతి నుంచి లైవ్ గ్రెనేడ్‌ను సురక్షితంగా బయటకు తీశారు వైద్యులు. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన జవాను ఛాతిలో ఓ గ్రెనేడ్ ఇరుక్కుంది. ఏ క్షణంలో అయినా పేలే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఆండ్రీ వెర్బా అనే ఆర్మీ డాక్టర్ అతడికి వైద్యం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎలెక్ట్రోకోగ్యులేషన్ లేకుండా అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు ఆండ్రీ వెర్బా ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. సర్జరీ చేసి అతడి ఛాతిలో ఉన్న లైవ్ గ్రెనేడ్‌ను తొలగించారు. శస్త్ర చికిత్స సమయంలో ఆ బాంబు పేలకుండా ఉండేందుకు నిపుణులైన ఇద్దరు సైనికుల సహాయం కూడా తీసుకున్నారు. అసాల్ట్ రైఫిల్‌కు జతచేసిన ఓ గ్రెనేడ్ లాంఛర్ ద్వారా ఈ బాంబును ప్రత్యర్థులు ప్రయోగించినట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎమ్మెల్యే గారూ.. నాకొక అమ్మాయి కావాలి.. యువకుడు లేఖ..
ఇది మహా ఉంగరం !! ఇందులో ఎన్ని వజ్రాలున్నాయో తెలుసా ??
క్యారమ్స్‌లో రఫ్ఫాడించిన 83 ఏళ్ల బామ్మ !! మాకు ప్రేరణ అంటున్న నెటిజన్లు