Sea Ghost: హఠాత్తుగా సముద్రం మధ్యలో వింత ఆకారాలు.. భయంతో జనం పరుగు.. అసలు విషయం తెలిసి నవ్వులు

Sea Ghost: సముద్రం తీరంలో  ఎంజాయ్ చేయడాన్ని వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడతారు. కాలంతో పనిలేకుండా సముద్ర బీచ్ వద్దకు..

Sea Ghost: హఠాత్తుగా సముద్రం మధ్యలో వింత ఆకారాలు.. భయంతో జనం పరుగు.. అసలు విషయం తెలిసి నవ్వులు
Sea Ghost
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2021 | 12:58 PM

Sea Ghost: సముద్రం తీరంలో  ఎంజాయ్ చేయడాన్ని వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడతారు. కాలంతో పనిలేకుండా సముద్ర బీచ్ వద్దకు వెళ్లి సేదదీరే ప్రకృతి ప్రేమికులు కూడా ఉన్నారు. పిల్లలు, పెద్దలు, ఎగసి పడే కెరటాలతో పోటీపడుతూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అలా సంతోషముగా గడిపే సమయంలో సముద్రం మధ్యలో నుంచి మనుషుల్లా కనిపించే “సముద్ర దెయ్యాలు పైకి వస్తే.. అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది.. ఊహించండి.. ఒక్కసారిగా ఆలా సముద్రం మధ్యలో దెయ్యాల రూపం కనిపించగానే భయపడి అక్కడనుంచి గుండెలను అరచేతిలో పట్టుకుని పారిపోతాడు.. తాజాగా అటువంటి ఓ సంఘటన వేల్స్‌లో హోలీ హెడ్ న్యూయారీ బీచ్ లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే..

లోతైన సముద్రం నుంచి పైకి లేచిన దెయ్యాలు ఆంగ్లేసీ ఉత్తర తీరంలో పర్యాటకులకు అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఇవి ఎక్కువ కాలం ఐరిష్ సముద్రం క్రింద మునిగి ఉంటాయని స్తానిక సిబ్బంది చెప్పారు, అయితే ఇప్పుడూ హాలోవీన్ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో వేల్స్‌లో హోలీ హెడ్ న్యూయారీ బీచ్  లోని వింత ఆకారాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బీచ్ నిత్యం వేల మంది ప‌ర్యాట‌కులతో రద్దీగా ఉంటుంది. వ‌చ్చిన ప‌ర్యాట‌కుల‌కు ఎదురుగా స‌ముద్రంలో వింత ఆకారాలు క‌నిపించాయి. ఆ దృశ్యాలను చూసిన జనం భయంతో ఒక్కసారిగా అక్కడ నుంచి పరుగులు పెట్టారు.

సముద్రంలో దెయ్యాలు , ముసుగు ధ‌రించిన వింత ఆకారాలు బయటకు వచ్చాయంటూ పుకారు షికారు చేసింది. దీంతో అధికారులు అసలు విషయం తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు. వెంట‌నే స‌ముద్రంలోకి వెళ్లి చూశారు. అసలు విషయం తెలుసుకుని నవ్వుల్లో మునిగితేలారు. ఎందులకంటే అవి సముద్ర దెయ్యాలు, వింత ఆకారాలు కాదు.. పాత లైఫ్ బోట్ ర్యాంప్‌కు చెందిన చెక్కల‌ని గుర్తించారు. ఆ చెక్కలు ఎప్పటి నుంచో స‌ముద్రంలో ఉండిపోవ‌డంతో నాచు, చెత్త వంటివి పేరుకుపోవ‌డంతో వింత ఆకారాల్లా క‌నిపిస్తున్నాయ‌ని అధికారులు తెలిపారు. 1828 నుండి హోలీహెడ్‌లో పనిచేస్తున్న లైఫ్‌బోట్ సిబ్బంది ధైర్యానికి ఇప్పుడు నిదర్శనం ఈ చెక్కలు.. వీటిని ప్రకృతి మానవ ఆకారాలుగా   రూపొందించింది.

Also Read:   కేసీఆర్ బయోపిక్.. ‘తెలంగాణ దేవుడు’ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!