AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poo For Tea: పాండా పేడతో ‘టీ’.. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టీగా ఖ్యాతి.. ఎక్కడంటే..

World Costly Tea Poo For Tea:  తేనీరు ప్రపంచ ప్రేమికులకు ఇష్టమైన పానీయం. మంచి నీరు తర్వాత ప్రపంచంలో అత్యధికముగా తాగేది టీ. ధనవంతుల నుంచి..

Poo For Tea: పాండా పేడతో 'టీ'.. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టీగా ఖ్యాతి.. ఎక్కడంటే..
Panda Poo Tea
Surya Kala
|

Updated on: Oct 31, 2021 | 1:22 PM

Share

World Costly Tea Poo For Tea:  తేనీరు ప్రపంచ ప్రేమికులకు ఇష్టమైన పానీయం. మంచి నీరు తర్వాత ప్రపంచంలో అత్యధికముగా తాగేది టీ. ధనవంతుల నుంచి సామాన్యులవరకూ ఇష్టంగా తాగే ఈ టీ లో అనేక రకాలు ఉన్నాయి. బ్లాక్ టీ , గ్రీన్ టీ , లెమన్ టీ , చిల్లి టీ, యాపిల్ టీ ఇలా అనేక రకాల టీలు ఉన్నాయి.. వాటిని టీ ప్రేమికులు ఇష్టంగా కూడా తాగుతారు. అయితే ఇప్పుడు మనం ఓ కొత్త టీ గురించి తేలుకుందాం.. అది పాండా మల విసర్జనతో తయారు చేస్తారట.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అరుదైన టీ ఎక్కడ దొరుకుంటుందో తెలుసా..

చైనాలో పాండా విసర్జనలతో కూడా టీ తయారు చేస్తారు. డ్రాగన్ కంట్రీలో ఓ వ్యాపారవేత్త పాండా పేడను ఉపయోగించి ఆర్గానిక్ గ్రీన్ టీని విక్రయిస్తున్నాడు. చైనాలో అధికంగా కనిపించే పాండాలు శాఖాహారులు.. ముఖ్యంగా ఇవి వెదురు మొక్కలను తింటాయి.  నైరుతి చైనాలో యాన్షి వ్యాపారవేత్త పాండాల నుంచి టన్నుల కొద్దీ మలవిసర్జనను సేకరించి..  సిచువాన్ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంత యాన్‌లో టీ తోటలను పెంచుతున్నాడు.

ఇక పాండాలు విసర్జించే పేడలో అధికంగా పోషకాలు, విటమిన్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉన్నాయట. అందుకే ఈ పాండా టీ ప్యాకెట్ 22,000 యువాన్లు ($3,500) మన కరెన్సీలో సుమారు రూ.2.4 లక్షలకు విక్రయిస్తున్నారు. అంటే ఒక కప్పు టీ కావాలంటే రూ. 200 పైనే చెల్లించాల్సి ఉంటుంది.  ఈ టీ అనేక వ్యాధులను నివారిస్తుందని చెనీయుల నమ్మకం. ముఖ్యంగా రక్తపోటు, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు ఈ టీ తాగితే చాలా మంచిదట. అందుకే చైనీయులు ఈ పాండా టీ ప్యాకెట్స్ ను గిఫ్ట్స్ గా ఇస్తుంటారు. ఈ టీ లో అనేక రకరకాల ఫ్లేవర్స్‌ ఉన్నాయట.  ఇక చైనీయుల తిండి గురించి ప్రపంచంలో అందరికీ తెలిసిందే.. ఒట్టి పాండాలే కాదు సేంద్రియ తేయాకులను తినే పురుగుల విసర్జనతో కూడా చైనీయులు చాయ్‌ తయారుచేస్తారన్న సంగతి తెలిసిందే..

Also Read:

హఠాత్తుగా సముద్రం మధ్యలో వింత ఆకారాలు.. భయంతో జనం పరుగు.. అసలు విషయం తెలిసి నవ్వులు

 కేసీఆర్ బయోపిక్.. ‘తెలంగాణ దేవుడు’ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్..