AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zombie Virus: మంచుమాటున జాంబి వైరస్‌.. అత్యంత ప్రమాదమంటున్న శాస్త్రవేత్తలు.. అలర్ట్ గా ఉండాలని వార్నింగ్..

కరోనా మహమ్మారి బారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే రకరకాల కొత్త వైరస్‌లు మానవాళికి సవాల్ విసురుతున్నాయి. మంకీపాక్స్, వేరియంట్లు ప్రపంచాన్ని వణికించాయి. తాజాగా 48,500 ఏళ్లనాటి అత్యంత...

Zombie Virus: మంచుమాటున జాంబి వైరస్‌.. అత్యంత ప్రమాదమంటున్న శాస్త్రవేత్తలు.. అలర్ట్ గా ఉండాలని వార్నింగ్..
Viruses
Ganesh Mudavath
|

Updated on: Nov 30, 2022 | 10:47 AM

Share

కరోనా మహమ్మారి బారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే రకరకాల కొత్త వైరస్‌లు మానవాళికి సవాల్ విసురుతున్నాయి. మంకీపాక్స్, వేరియంట్లు ప్రపంచాన్ని వణికించాయి. తాజాగా 48,500 ఏళ్లనాటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక మంచు ప్రాంతంలో ఈ ‘జాంబీ వైరస్’ను గుర్తించారు. అదొక్కటే కాదు దీంతోపాటు మరో రెండు డజన్ల కొత్త వైరస్‌లను కూడా వెలికితీశారు. సాధారణంగా మంచు ప్రాంతాల్లో ఎన్నో రకాల డేంజరస్ వైరస్‌లు ఉంటాయి. మానవాళికి వాటి వల్ల ఏమైనా ముప్పు ఉందా? అనే విషయంపై శాస్త్రవేత్తలు ఎప్పుడూ పరిశోధనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజా పరిశోధనలో ఈ జాంబీ వైరస్ బయటపడింది. రష్యాలోని సైబీరియా ప్రాంతం సంవత్సరంలో అత్యధిక భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి మంచు పొరల కింద సేకరించిన నమూనాలను యూరప్ పరిశోధకులు పరీక్షించారు. వాటిలో 13 రకాల హానికరమైన సూక్ష్మజీవ జాతులను గుర్తించి, వాటిని వర్గీకరించారు. వీటిని పరిశోధకులు జాంబీ వైరస్ లు గా భావిస్తున్నారు.

వేల సంవత్సరాలుగా అవి నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ, వ్యాధి కారక శక్తిని మాత్రం కోల్పోలేదని తెలుసుకున్నారు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల శాస్త్రవేత్తలు సంయుక్త పరిశోధనలో ఈ వైరస్‌ను గుర్తించారు. అత్యంత ఘనీభవించిన ఈ మంచు కరిగిపోతే బయటి వాతావరణంలోకి విడుదలయ్యే ఈ రాకాసి వైరస్ లు జంతువులకు, మానవాళికి పెను సమస్యగా పరిణమిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బాహ్య వాతావరణంలోకి ప్రవేశించాక ఎంతకాలం వ్యాధికారకంగా ఉంటాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో… ఈ వైరస్ లకు, మానవాళికి మధ్య వాహకాలు ఏమిటో అంచనా వేయడం ఇప్పటికీ అసాధ్యంగానే ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఇవి కలిగించే ముప్పును అంచనా వేయలేమని పేర్కొన్నారు.

మరోవైపు.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న మంకీపాక్స్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొత్త పేరు పెట్టింది. మంకీపాక్స్‌ను ఇక నుంచి ‘ఎంపాక్స్‌’ అని పిలవాలని సూచించింది. అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు చేసిన అనంతరం ఈ పేరును ఖరారు చేసింది. ఏడాది పాటు ఈ వ్యాధిని మంకీపాక్స్, ఎంపాక్స్ అని రెండు పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత పాత పేరును తొలగించి కొత్త పేరును మాత్రమే ఉపయోగిస్తారు. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం