AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jack Ma In Japan: డ్రాగన్ కంట్రీని విడిన బిజినెస్‌ టైకూన్‌.. కుటుంబ సమేతంగా జపాన్‌లోకి చైనా బిలియనీర్ జాక్‌ మా..

మనదేశంలో పేపర్లు చదివేవారికి, టీవీలు చూసేవారికి, మొబైల్స్‌ వాడే వారందరికీ తెలిసినపేరు జాక్‌మా. చైనా బిలియనీర్, దిగ్గజం ఈ-కామర్స్ కంపెనీ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఇప్పుడు ఆ దేశానికి బై.. బై.. చెప్పాడు..

Jack Ma In Japan: డ్రాగన్ కంట్రీని విడిన బిజినెస్‌ టైకూన్‌.. కుటుంబ సమేతంగా జపాన్‌లోకి చైనా బిలియనీర్ జాక్‌ మా..
Jack Ma
Sanjay Kasula
|

Updated on: Nov 30, 2022 | 7:05 AM

Share

ప్రపంచ నెంబర్‌వన్‌ దేశం అమెరికాలో ఉన్న బిజినెస్‌ టైకూన్‌లు ఎవరో మీకు తెలుసా..? ఈ ప్రశ్నలకు టకటకా జవాబులు వస్తాయి. కానీ చైనాలో ఉన్న ప్రఖ్యాత బిజినెస్‌ మేగ్నెట్‌లు ఎవరో మీకు తెలుసా అంటే మాత్రం చాలామంది చెప్పే సమాధానం జాక్‌ మా. మనదేశంలో పేపర్లు చదివేవారికి, టీవీలు చూసేవారికి, మొబైల్స్‌ వాడే వారందరికీ తెలిసినపేరు జాక్‌మా. చైనా బిలియనీర్, దిగ్గజం ఈ-కామర్స్ కంపెనీ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా దాదాపు 6 నెలలుగా జపాన్ రాజధాని టోక్యోలో నివసిస్తున్నారు. జాక్ మా 2020 నుంచి లో ప్రొఫైల్ జీవితాన్ని గడుపుతున్నారు. గుత్తాధిపత్య వ్యతిరేక నిబంధనలను ఉల్లంఘించినందుకు చైనా ప్రభుత్వంతో జాక్ మా పై కత్తి కట్టింది.

చైనాకు బై.. బైై చెప్పిన జాక్ మా తన కుటుంబంతో సహా జపాన్‌లో నివసిస్తున్నారు. వారంతా టోక్యో వెలుపల గ్రామీణ ప్రాంతాల్లోని స్కీ రిసార్ట్‌లలో కనిపిస్తారు. జాక్ మా ఇటీవలి నెలల్లో అమెరికా, ఇజ్రాయెల్‌లను కూడా చాలాసార్లు సందర్శించారు.

జాక్ మా ఎందుకు కనుమరుగవుతున్నారు..

జాక్ మా వయసు 58 ఏళ్లు.  ఆయన ఇంతకాలం ప్రజా జీవితానికి చాలా దూరంగా ఉన్నారు. 2020లో చైనా విధానాలను ఆయన విమర్శించారు. చైనా ఆర్థిక నియంత్రణ వ్యవస్థను విమర్శిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకులను వడ్డీ వ్యాపారులతో పోల్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు పాన్ షాప్ మనస్తత్వం ఉందని ఆరోపించారు. అంతర్జాతీయ ఆర్థిక నియంత్రణ ఒప్పందం (బాసెల్ ఒప్పందాలు)పై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. అప్పటి నుంచి అతను స్థాపించిన యాంట్,  అలీబాబా రెండూ చైనా పరిపాలన వ్యవస్థ అతనిపై గొడ్డలి వేటు వేసింది. గత సంవత్సరం, యాంట్ కంపెనీ బ్లాక్‌బస్టర్ $37 బిలియన్ల IPOని చైనా ప్రభుత్వం నిషేధించింది. నమ్మకాన్ని దుర్వినియోగం పేరుతో అలీబాబా కంపెనీపై రికార్డు స్థాయిలో $2.8 బిలియన్ జరిమానా విధించింది.

ఉద్రిక్తతలకు ముందు భారత్‌లోకి..

చైనా ప్రభుత్వంతో ఉద్రిక్తతలు పెరగడానికి ముందు జాక్ మా 2015లో భారత్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు. ఈ పర్యటనలో జాక్ మా కంపెనీ అలీబాబా కూడా భారతదేశంలో తన వ్యాపార భాగస్వాములను చేసింది. షాంఘై సమీపంలోని హాంగ్‌జౌ నగరంలో జాక్‌మాకు ఇల్లు ఉంది. అలీబాబా కంపెనీకి ఈ నగరంలో ప్రధాన కార్యాలయం ఉంది. చైనా అధికారులతో ఉద్రిక్తతల తర్వాత, జాక్ మా స్పెయిన్, నెదర్లాండ్స్‌తో సహా అనేక దేశాలలో పర్యటిస్తున్నారు.

చైనా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు

నిరు పేద కుటుంబంలో జన్మించిన జాక్ మా చైనాలో అత్యంత కుబేరులలో ఒకరిగా ఎదిగారు. జాక్ మా తన 55వ పుట్టినరోజున 2019లో ఇ-కామర్స్ కంపెనీ అలీబాబా ఛైర్మన్‌గా హఠాత్తుగా పదవీ విరమణ చేశారు. అతను తీసుకున్న నిర్ణయం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ, వర్క్ టేబుల్‌పై చనిపోవడం కంటే బీచ్‌లో చనిపోతానని సంచలన ప్రకటన చేశారు.

పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC) తన పనిలో జోక్యం చేసుకుంటోందని అతని ప్రకటనతో చెప్పకనే చెప్పారు. జాక్ మా రిటైర్మెంట్ , ఆ తర్వాత జాక్ మా కంపెనీలతో పాటు చైనాలోని పాలక కమ్యూనిస్ట్ పార్టీ అనేక కంపెనీలపై అణిచివేతకు దిగింది.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశంలోని ధనిక వ్యాపారవేత్తల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని ఆ తర్వాత జరిగిన పరిణామాలు నిరూపితమయ్యాయి.

చైనాను విడిచిపెట్టిన చాలా మంది ధనికులు..

గత నెలలో జరిగిన CPC సమావేశం జీ జిన్‌పింగ్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా మంది సంపన్నులు చైనా నుంచి పారిపోవడానికి దారులు వెతుక్కోవడం మొదలు పెట్టారు. “దేశం విడిచి పారిపోతున్న సంపన్నులు” పేరుతో  హాంకాంగ్ కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఇటీవల ఓ నివేదికను ప్రచూచించింది. తమపై చర్యలకు భయపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం