AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudan Conflict: భారత్‌కు సౌదీ భారీ బహుమతి.. సుడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలింపు

విదేశీ దౌత్యవేత్తలు, అధికారులతో సహా అనేక మంది కూడా ఇందులో ఉన్నారు. సుడాన్ నుండి సురక్షితంగా తరలించబడిన వారిలో 91 మంది సౌదీ అరేబియా పౌరులు అని మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. అంతేకాదు సురక్షితంగా సౌదీకి చేరుకున్న వారిలో 66 మంది భారతీయులు సహా 12 ఇతర దేశాలకు చెందినవారున్నారు. వీరందరినీ జెడ్డాకు తరలించారు

Sudan Conflict: భారత్‌కు సౌదీ భారీ బహుమతి.. సుడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలింపు
Sudan Crisis
Surya Kala
|

Updated on: Apr 23, 2023 | 7:08 AM

Share

ప్రస్తుతం సూడాన్‌లో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య పోరుతో  అంతర్యుద్ధం ఏర్పడింది. గత వారం రోజులుగా సూడాన్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన సౌదీ అరేబియా సుడాన్ లో పరిస్థితులు చక్కదిద్దెందుకు ప్రయత్నం చేస్తూనే.. సుడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. సూడాన్ నుంచి 150 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

విదేశీ దౌత్యవేత్తలు, అధికారులతో సహా అనేక మంది కూడా ఇందులో ఉన్నారు. సుడాన్ నుండి సురక్షితంగా తరలించబడిన వారిలో 91 మంది సౌదీ అరేబియా పౌరులు అని మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. అంతేకాదు సురక్షితంగా సౌదీకి చేరుకున్న వారిలో 66 మంది భారతీయులు సహా 12 ఇతర దేశాలకు చెందినవారున్నారు. వీరందరినీ జెడ్డాకు తరలించారు.

ఇవి కూడా చదవండి

కువైట్, ఖతార్, ఈజిప్ట్, ట్యునీషియా, పాకిస్తాన్, భారత్, బల్గేరియా, యుఎఇ, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ , కెనడా వంటి దేశాల పౌరులను సౌదీ అరేబియా సుడాన్ నుండి సురక్షితంగా తరలించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

హింసాకాండ చెలరేగడంతో సూడాన్‌లో ప్రస్తుతం దారుణ పరిస్థితులున్నాయి.  దాదాపు 4000 మంది భారతీయులు చిక్కుకుపోయారు. దేశ సైన్యం, ఆర్‌ఎస్‌ఎఫ్ మధ్య ఆధిపత్య పోరులో వేల మంది ప్రాణాలు పణంగా పెట్టారు. పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. రెండు రోజుల క్రితం సూడాన్ సంక్షోభంపై ప్రధాని మోడీ  ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను కోరారు.

సూడాన్‌లో ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించారు గత వారం రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించగా, 3000 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గతంలో సూడాన్ సంక్షోభంపై మాట్లాడారు. సూడాన్‌లో ముందస్తు కాల్పుల విరమణ గురించి ఆయన మాట్లాడారు.

15000 మందికి పైగా అమెరికన్ పౌరులు   భారతీయులు మాత్రమే కాదు.. సుడాన్ లో అనేక ఇతర దేశాలకు చెందిన వేలాది మంది ప్రజలు  చిక్కుకుపోయారు. 15,000 మందికి పైగా అమెరికన్ పౌరులు సూడాన్‌లో చిక్కుకున్నారని శుక్రవారం వైట్‌హౌస్ తెలిపింది. సైన్యం , పారామిలిటరీ బలగాల మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య సూడాన్‌లో యుఎస్ ఎంబసీ వాహనాలపై దాడి జరిగింది. సూడాన్ పారామిలటరీ ఫోర్స్ ఈ దాడి చేసింది. అనంతరం  అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సూడాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. బ్లింకెన్ సూడాన్ RSF నాయకుడు దగాలోతో మాట్లాడారు. సూడాన్ ఆర్మీ జనరల్ అల్ బుర్హాన్‌తో కూడా అమెరికా మాట్లాడింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..