అమ్మో బాబోయ్.. చిన్న పిల్లల్ని ఏడిపించే వింత ఆచారం.. ఎక్కడంటే
ప్రపంచంలో వివిధ ప్రాంతాలను బట్టి ఎన్నో ఆచారాలను ప్రజలు పాటిస్తుంటారు. అయితే కొన్ని ఆచారాలు చాలా విడ్డూరంగా, వింతగా కూడా అనిపిస్తుంటాయి. ఇప్పుడు తాజాగా జపాన్‌లోని అలాంటి ఆచారాన్ని జపాన్ ప్రజలు పాటించడం తాజాగా నెట్టింటా వైరల్ అవుతోంది.
ప్రపంచంలో వివిధ ప్రాంతాలను బట్టి ఎన్నో ఆచారాలను ప్రజలు పాటిస్తుంటారు. అయితే కొన్ని ఆచారాలు చాలా విడ్డూరంగా, వింతగా కూడా అనిపిస్తుంటాయి. ఇప్పుడు తాజాగా జపాన్‌లోని అలాంటి ఆచారాన్ని జపాన్ ప్రజలు పాటించడం నెట్టింటా వైరల్ అవుతోంది. శనివారం రోజున క్రైయింగ్ సుమో అనే ఆచారాన్ని జపానీయులు పాటించారు. అయితే ఈ సంప్రదాయం ప్రత్యేకత ఏంటంటే చిన్న పిల్లల్ని ఏడిపించడం. వింతగా అనిపిస్తోంది కదూ. తరతరాల నుంచి అక్కడి ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తూనే ఉన్నారు. కరోనా వల్ల దీనికి బ్రేక్ పడటంతో సుమారు నాలుగేళ్ల తర్వాత ఈ ఆచారాన్ని జపాన్ వ్యాప్తంగా నిర్వహించారు.
అయితే ఇది ఎలా జరుగుతుందంటే చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలకు సుమో అప్రాన్ లను తొడుగుతారు. వారిని ఎత్తుకొని సుమో రింగులోకి తీసుకొస్తారు. ఒకవైపు ఓ తల్లి లేదా తండ్రి మరోవైపు మరో తల్లి లేదా తండ్రి తమ పిల్లల్ని చేతులతో పట్టుకుంటారు. ఆ పిల్లలకు తొడిగించిన సుమో అప్రాన్‌లను చూసి, అలాగే ఆ రింగులో భయపెట్టే దూస్తులను ధరించి ఉన్న మరో వ్యక్తిని చూసి ఆ పిల్లలు ఏడుస్తారు. అయితే ఎవరైతే మొదటగా ఏడుస్తారో వారే గెలిచినట్లు. తల్లిదండ్రులే కాకుండా ఆ రింగులో ఇద్దరు సుమోలు కూడా ఎత్తుకుని ఆ పిల్లల్ని ఏడిపిస్తారు.
అయితే ఈ ఆచారం పాటించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఉంటే ఇలా చేస్తే తమ పిల్లలకు మంచి ఆరోగ్య ఉంటుందని అక్కడి తల్లిదండ్రులు నమ్ముతారు. పిల్లలు ఏడ్చే విధానాన్ని బట్టి వారి ఆరోగ్య పరిస్థితిని చెప్పగలమని ఓ తల్లి తెలిపారు. అయితే పిల్లల్ని ఏడిపించడం భయంకరం అని కొంతమంది అనుకుంటారని అసకుసా టూరిజం ఫెడరేషన్ ఛైర్న్ షెగెమీ ఫుజీ తెలిపారు. అయితే ఎవరైతే గట్టిగా ఏడుస్తారో ఆ పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారని తాము నమ్ముతామని పేర్కొన్నారు.
ఈ ఆచారాన్ని జపాన్ లో చాలా ప్రాంతాల్లో పాటిస్తారు. అలాగే ప్రాంతాన్ని బట్టి ఆ ఆచారం నియమాలు మారుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఏ పిల్లలైతే ముందుగా ఏడుస్తారో వారు గెలిచినట్టు. మరికొన్ని చోట్ల ఎవరైతే ముందు ఏడుస్తారో వారే ఓడిపోయినట్లు. అయితే జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఈ వేడుకలో దాదాపు 64 మంది చిన్నారులు పాల్గొన్నట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..