AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drones: మృతి చెందిన పక్షులతో డ్రోన్ల తయారీపై పరిశోధనలు..ఎందుకు చేస్తున్నారంటే

మరణించిన పక్షులతో కూడా అమెరికాలో విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు. వాటిని డ్రోన్ లుగా మార్చే ప్రకియపై కృషి చేస్తు్న్నారు. సాధారణ డ్రోన్‌లకు హెలికాప్టర్ తరహాలో అమర్చిన రెక్కలు తిరగడం మనం చూసే ఉంటాం.

Drones: మృతి చెందిన పక్షులతో డ్రోన్ల తయారీపై పరిశోధనలు..ఎందుకు చేస్తున్నారంటే
Dead Bird
Aravind B
|

Updated on: Apr 23, 2023 | 7:11 AM

Share

మరణించిన పక్షులతో కూడా అమెరికాలో విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు. వాటిని డ్రోన్ లుగా మార్చే ప్రకియపై కృషి చేస్తు్న్నారు. సాధారణ డ్రోన్‌లకు హెలికాప్టర్ తరహాలో అమర్చిన రెక్కలు తిరగడం మనం చూసే ఉంటాం. కానీ తాజాగా పరిశోధకులు తయారుచేస్తున్న డ్రోన్ లకు పక్షి రెక్కలుంటాయి. వాటిని అల్లార్చుతూనే ఈ డ్రోన్ ఎగరాల్సి ఉంటుంది. వాస్తవానికి సజీవంగా ఉన్న ఓ పక్షి తన రెక్కల సహాయంతో సులభంగా గాల్లో ఎగురుతుంది. కానీ అదే విధానంలో డ్రోన్‌ను ఎగరేయడం అసాధ్యం. అయితే అమెరికాలోని ‘న్యూ మెక్సికో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ టెక్నాలజీ’లో కొందరు పరిశోధకులు ఇందుకోసం నిరంతరం శ్రమిస్తున్నారు. చనిపోయిన పక్షులను డ్రోన్‌లుగా మారిస్తే అది విమానాల అధ్యయనానికీ సహాయపడుతుందని వారు చెబుతున్నారు. అలాగే దీనివల్ల ఎంతో శక్తిని, ఇంధనాన్ని ఆదా చేయవచ్చని భావిస్తున్నారు.

మొదటగా వీళ్లు కృత్రిమ, యాంత్రికంగా తయారు చేసిన పక్షులతో పరిశోధన చేశారు. అవి ఫలించకపోవడంతో నిజమైన పక్షుల శరీరాలపై దృష్టిపెట్టారు. ఈ ఆలోచన ఫలిస్తుందని వారు ధీమాగా ఉన్నారు. టాక్సిడెర్మీ పక్షులను శాస్త్రవేత్తలు పంజరంలో ఉంచారు. పక్షి రెక్కలు కొట్టుకునే తీరు, ఎగిరే ఎత్తు, వేగం అన్నింటినీ అక్కడ రికార్డు చేస్తున్నారు. అలాగే పక్షి డ్రోన్‌ రంగులు, ఎగిరే సామర్థ్యంపై కూడా పరిశోధనలు చేస్తున్నారు. అయితే పక్షుల రంగులు వాటి సహచరులను ఆకర్షించడానికి, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడతాయనే అభిప్రాయం ఉంది. డ్రోన్ ఎగిరే సామర్థ్యంలో రంగుల పాత్ర ఎంత వరకు ఉంటుందనే విషయంపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇప్పుడు టాక్సిడెర్మీ అనే నమూనా పక్షులు సుమారు 20 నిమిషాలు ఎగరగలుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..