Russian Plane Crash Video: రష్యాలో కుప్పకూలిన విమానం… విమానంలో 50 మంది ప్రయాణికులు
వరుస విమాన ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడ సడెన్‌గా దిగుతుందో, ఏది ఎప్పుడు కూలుతుంతో అర్థం కావడంం లేదు. తాజాగా రష్యాలో ఘోర విమానం ప్రమాదం సంభవించింది. అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన An-24 ప్యాసింజర్ విమానం కూలిపోయింది. ఉదయం అదృశ్యం...

వరుస విమాన ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడ సడెన్‌గా దిగుతుందో, ఏది ఎప్పుడు కూలుతుంతో అర్థం కావడంం లేదు. తాజాగా రష్యాలో ఘోర విమానం ప్రమాదం సంభవించింది. అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన An-24 ప్యాసింజర్ విమానం కూలిపోయింది. ఉదయం అదృశ్యం అయిన విమానం టెండా సమీపంలో కూలిపోయినట్లు గుర్తించారు అధికారులు. విమానంలో సిబ్బందితో సహా దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులందరూ చనిపోయినట్లు తెలుస్తోంది.
అంగారా ఎయిర్‌లైన్స్ రష్యా నుంచి చైనా సరిహద్దులోని అముర్ ప్రాంతంలోని టిండా పట్టణానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం దాని గమ్యస్థానానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు సంబంధాలు తెగిపోయాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు విమానం కూలిపోయినట్లు గుర్తించారు. ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది విమానం. టైండా ఎయిర్‌పోర్ట్‌కు 15 కి.మీ. దూరంలో ఈ దుర్ఘటన జరిగింది.
వీడియో చూడండి:
View this post on Instagram
