AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఇదేం బల్బ్‌రా సామీ.. 125 ఏళ్ల నుంచి ఆగకుండా వెలుగుతూనే ఉందట..!

ఈ ప్రపంచంలో చాలా ప్రత్యేకమైన, విచిత్రమైన, వింత దృగ్విషయాలు అనేకం ఉన్నాయి. వాటి గురించి తెలుసుకున్న తర్వాత కొన్నిసార్లు నమ్మడం కష్టంగా మారుతుంది. అవును, చాలా సార్లు ప్రజలు ఆలోచించలేని ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తాయి. ఇది కూడా అలాంటి విషయమే.. ఈ రోజు మనం ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన బల్బు గురించి తెలుసుకోబోతున్నాం. దాని ప్రత్యేకతలేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

వామ్మో.. ఇదేం బల్బ్‌రా సామీ.. 125 ఏళ్ల నుంచి ఆగకుండా వెలుగుతూనే ఉందట..!
Bulb
Jyothi Gadda
|

Updated on: Jul 24, 2025 | 12:47 PM

Share

విద్యుత్ లేని జీవితాన్ని నేడు ఊహించలేము. కానీ ఒకప్పుడు అందరికీ విద్యుత్ అందుబాటులో ఉండేది కాదు. ప్రసత్తుం మనమందరం మన ఇళ్లలో కరెంట్‌ బల్బులను ఉపయోగిస్తాము. అయితే, కొంత సమయం తర్వాత బల్బులో కొంత సమస్య ఏర్పడుతుంది. లేదా పాడైపోతుంది. కాబట్టి మనం దానిని మార్చాల్సి వస్తుంది. కానీ, ఈ ప్రపంచంలో 125 సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలుగుతున్న ఒక బల్బు ఉంది. అయితే, ఆ సమయంలో ఒక బల్బ్ వెలుగుతూ నేటికీ నిరంతరం వెలుగుతూనే ఉంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లివర్‌మోర్ నగరంలో ఏర్పాటు చేసిన ఈ బల్బ్ నేడు ప్రపంచం మొత్తానికి ఆసక్తిని కలిగించే అంశంగా మారింది. చాలా సంవత్సరాలుగా వందల ఏళ్లుగా వెలుగుతున్న ఈ బల్బ్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేర్చబడింది.

ఈ బల్బును కాలిఫోర్నియాలోని లివర్మోర్ నగరంలోని అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమస్య తలెత్తకుండా ఆ బల్బ్‌ వెలుగుతూనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ బల్బు మొదటిసారిగా 1901 లో వెలిగించారు. ఈ అద్భుతమైన బల్బును సెంటెనియల్ అని పిలుస్తారు. ఈ బల్బును షెల్బీ ఎలక్ట్రానిక్ కంపెనీ తయారు చేసింది. ఈ బల్బు వెలిగినప్పుడు, దాని శక్తి 60 వాట్స్. ఈ బల్బును ఒహియోలోని షెల్బీలో ఉన్న షెల్బీ ఎలక్ట్రానిక్స్ అనే సంస్థ తయారు చేసింది.

ఈ బల్బును 1890 చివరిలో తయారు చేశారని చెబుతారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లివర్మోర్ నగరంలోని అగ్నిమాపక విభాగంలో ఏర్పాటు చేసిన ఈ బల్బును డేనియల్ బర్నెల్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. బర్నెల్ లివర్మోర్ పవర్ అండ్ వాటర్ కంపెనీ యజమాని అని, ఈ బల్బును కొనుగోలు చేసిన తర్వాత, దానిని నగరంలోని అగ్నిమాపక కేంద్రానికి విరాళంగా ఇచ్చాడని చెబుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..