వైన్ తయారీలో ఏయే పండ్లు ఉపయోగిస్తారో తెలుసా..? మద్యం రంగు వెనుక కారణం ఇదేనట..!
ద్రాక్ష నుండి వైన్ తయారవుతుందని దాదాపు అందరికీ తెలుసు. ద్రాక్ష రసంలో ఉండే సహజ ఈస్ట్‌లను ఉపయోగించి జరిగే ప్రక్రియలో, పిండిచేసిన ద్రాక్షను కిణ్వ ప్రక్రియ ద్వారా వైన్ తయారు చేస్తారు. గొప్ప రుచిగల వైన్లను ఉత్పత్తి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల ద్రాక్షలను ఉపయోగిస్తారు. అయితే, వైన్ ద్రాక్ష నుండి మాత్రమే కాకుండా అనేక ఇతర పదార్థాల నుండి కూడా తయారవుతుందని మీకు తెలుసా..? ద్రాక్ష కాకుండా మరే ఇతర పదార్థాల నుండి వైన్ తయారు చేస్తారో తెలుసుకుందాం.

వైన్‌ను తయారుచేసే ప్రక్రియలో ద్రాక్ష పండ్లను ఫెర్మెంటేషన్ చేస్తారు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఈస్ట్‌ను ఉపయోగిస్తారు. ఆ ప్రక్రియ వలన పంచదార మొత్తం ఆల్కహాల్ కింద మారిపోతుంది. దానితో డ్రై వైన్‌గా తయారవుతుంది. అయితే ఫెర్మెంటేషన్ ప్రక్రియలో కొన్ని సార్లు పంచదార మొత్తం ఆల్కహాల్ కింద మారదు. దాంతో కొంత వరకు తీయదనం ఉంటుంది. అందుకే కొన్ని సార్లు వైన్ తాగినప్పుడు తీయగా అనిపిస్తుందని చెబుతున్నారు. అయితే,
ద్రాక్షతో పాటు, ఆపిల్, స్ట్రాబెర్రీ, చెర్రీస్ వంటి పండ్ల నుండి కూడా వైన్ తయారు చేస్తారు. సాధారణంగా, ఆపిల్, స్ట్రాబెర్రీ, చెర్రీ వంటి పండ్ల నుండి వైన్ తయారు చేయడానికి అదనపు చక్కెరను యాడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాటిలో సహజ చక్కెర తక్కువగా ఉంటుంది. దీనితో పాటు, వైన్‌ను బేరి, బ్లూబెర్రీస్, ప్లమ్స్ నుండి కూడా తయారు చేస్తారు. ఈ పండ్లలో టానిన్ కూడా తక్కువగా ఉంటుంది. ఇది రుచిని చప్పగా చేస్తుంది.
అలాగే, విస్కీ, వైన్, రమ్ రంగులు వేర్వేరుగా ఉంటాయి. ఎందుకంటే అవి ఉత్పత్తి చేసే ప్రక్రియ బట్టి వాటి రంగు ఉంటుంది. ఉత్పత్తి ప్రక్రియతో పాటు ఈ మూడు ఆల్కహాల్ ఉత్పత్తి చేయడానికి భిన్నమైన పదార్థాలు ఉపయోగిస్తారు. విస్కీని సాధారణంగా ఓక్ బారెల్స్ లో తయారుచేస్తారు. విస్కీ ముదురు రంగులో ఉంటుంది. వైన్ రంగు ద్రాక్ష పండ్ల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. రమ్ ను సాధారణంగా మొలాసిస్ నుంచి తయారు చేస్తారు, దాంతో ఇది కూడా కాస్త ముదురు రంగులో ఉంటుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..