AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guava Leaves: టీ, కాఫీలకు గుడ్ బై చెప్పండి.. జామాకుల టీని డైట్ లో చేర్చుకోండి.. షుగర్ సహా ఎన్ని వ్యాధులకు ఉపశమనమో తెలుసా..

జామ పండు మాత్రమే కాదు జామ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవును శరీరంలోని అనేక సమస్యలను నయం చేయడంలో సహాయపడే అనేక లక్షణాలు జామ ఆకులలో ఉన్నాయి. అందుకనే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల లేదా జామాకుల టీని తాగడం వలన అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం.

Guava Leaves: టీ, కాఫీలకు గుడ్ బై చెప్పండి.. జామాకుల టీని డైట్ లో చేర్చుకోండి.. షుగర్ సహా ఎన్ని వ్యాధులకు ఉపశమనమో తెలుసా..
Guava Leaves
Surya Kala
|

Updated on: Jul 24, 2025 | 12:59 PM

Share

జామకాయ పేదవారి యాపిల్. రుచికరమైన జామకాయని తినడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే జామ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని మీకు తెలుసా.. అవును ఎవరైనా సరే రోజూ ఉదయం కొన్ని జామ ఆకులను నమిలి తింటే..ఆరోగ్యానికి చాలా ఉపయోగం. ఇంకా చెప్పాలంటే టీ కాఫీ అలవాటుకి గుడ్ బై చెప్పేసి ఈ జామ ఆకులతో చేసిన టీ తాగడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం

జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది జామ ఆకులు కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిలో ఉండే ఫైబర్ , యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం సమస్యను తొలగిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలడం వల్ల లేదా జామ ఆకుల టీని తాగడం వలన జీర్ణ ఎంజైమ్‌లు సక్రియం అవుతాయి. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

మధుమేహ నియంత్రణ జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకుల కషాయం తాగడం వల్ల డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడంలో సహాయం జామ ఆకులు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. జీవక్రియను పెంచుతాయి. అదనంగా అవి కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గించడం ద్వారా బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి జామ ఆకులలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. జామ ఆకులు తినడం వల్ల లేదా జామకుల టీని తాగడం వలన జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యానికి మేలు జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతాయి. ఇది గుండె జబ్బులు, అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చర్మం, జుట్టుకు ప్రయోజనకరం జామ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. తద్వారా చర్మం ముడతలు, మొటిమలు తగ్గుతాయి. అలాగే జామ ఆకుల పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం సమస్య తొలగిపోతుంది .

దంతాలు, చిగుళ్ళకు ప్రయోజనం జామ ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తాయి. జామాకులను నమలడం వల్ల వాపు చిగుళ్ళు , పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

జామ ఆకులను ఎలా, ఏ విధంగా తీసుకోవచ్చంటే

పచ్చి ఆకులను నమలడం ద్వారా – 2-3 లేత ఆకులను బాగా కడిగి ఉదయం ఖాళీ కడుపుతో నమలండి.

జామ ఆకుల కషాయం లేదా టీ: ఆకులను నీటిలో మరిగించి, వడకట్టి గోరువెచ్చగా త్రాగాలి. లేదా తాజా జామ ఆకులను నీటిలో మరిగించి తేనె లేదా నిమ్మరసం కలిసి తాగాలి.

జామాకుల పొడి రూపంలో: ఎండిన ఆకులను పొడిగా చేసి గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)