AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain disorder: శరీరం 5 సంకేతాలిస్తుంటే నిర్లక్షం వద్దు.. మెదడు డేంజర్ లో పడనున్నదని అర్ధం.. జాగ్రత్తగా సుమా..

శరీరం మనకు కొన్ని సంకేతాల ద్వారా ఆరోగ్యంలో ఏదో తేడా ఉందని హెచ్చరిస్తుంది. అదే విషయంగా శరీరం ఇచ్చే కొన్ని సంకేతాలను ఇస్తుంటే మెదడుకి సంబంధించిన ఏదో సమస్య ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవాలట. అంతేకాదు ఈ సంకేతాలను విస్మరించడం ఖరీదైనదిగా నిరూపించబడుతుంది. ప్రారంభంలో మెదడు రుగ్మత విషయంలో చాలా చిన్న సంకేతాలు (బ్రెయిన్ డిజార్డర్ సంకేతాలు) కనిపిస్తాయి. అయితే వీటిని పెద్దగా పట్టించుకోకుండా విస్మరిస్తారు. భవిష్యత్తులో మెదడు సమస్య తీవ్రమైన రూపాన్ని తీసుకోవచ్చు. ఈ రోజు మెదడు ముందుగా ఇచ్చే సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

Brain disorder: శరీరం 5 సంకేతాలిస్తుంటే నిర్లక్షం వద్దు.. మెదడు డేంజర్ లో పడనున్నదని అర్ధం.. జాగ్రత్తగా సుమా..
Brain Health Warning Signs
Surya Kala
|

Updated on: Jul 24, 2025 | 11:05 AM

Share

మనం మన మెదడుకి సంబంధిత సమస్యలపై పెద్దగా శ్రద్ధ పెట్టం. ఇంకా చెప్పాలంటే అలక్ష్యం చేస్తాం. అయితే ఏదైనా మెదడు సంబంధిత సమస్య తలెత్తినప్పుడు.. మన శరీరం మనకు సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే అది ప్రాంతంతకం కావచ్చు. ఎందుకంటే మెదడు రుగ్మత లక్షణాలు ప్రారంభంలో చాలా తక్కువగా కనిపిస్తాయి. దీని కారణంగా వాటిని విస్మరిస్తారు. తరువాత అవి తీవ్రమైన రూపాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు మెదడు రుగ్మతని తెలిపే సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం.

చిన్న చిన్న విషయాలను నిరంతరం మర్చిపోవడం తాళం చెవి, మొబైల్ పెట్టిన చోటు మరచిపోవడం లేదా ఏదైనా ముఖ్యమైన పనిని తరచుగా మర్చిపోవడం సాధారణమే కావచ్చు. అయితే ఈ సమస్య పదే పదే రావడం ప్రారంభిస్తే.. అది ఆందోళన కలిగించే విషయం. ఇది అల్జీమర్స్ లేదా చిత్తవైకల్యం వంటి వ్యాధుల ప్రారంభ సంకేతం కావచ్చు. ఇటీవల జరిగిన సంఘటనలను గుర్తుంచుకోలేక పోయినా.. అవి ఏమిటి అని పదే పదే ప్రశ్న తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

బ్రెయిన్ ఫాగ్ బ్రెయిన్ ఫాగ్ అనేది ఒక వ్యక్తి దృష్టి కేంద్రీకరించడంలో ఆలోచించడంలో లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడే పరిస్థితి. ఇది థైరాయిడ్, నిరాశ, నిద్ర లేకపోవడం లేదా పోషకాహార లోపం వల్ల కావచ్చు. మీరు నిరంతరం బరువెక్కినట్లు అనిపించినా, పని చేయాలని అనిపించకపోయినా లేదా ఆలోచించడంలో ఇబ్బంది పడుతుంటే.. ఇవి కూడా మెదడు సంబంధిత సమస్యకు సంకేతాలు కూడా కావచ్చు.

ఇవి కూడా చదవండి

నిరంతర తలనొప్పి తలనొప్పి ఒక సాధారణ సమస్య. అయితే తల నొప్పితో తరచుగా ఇబ్బంది పడుతున్నా, తలనొప్పి తీవ్రంగా ఉన్నా.. అది మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ లేదా అధిక రక్తపోటుకు సంకేతం కావచ్చు . తలనొప్పితో పాటు వాంతులు, దృష్టి మసకబారడం లేదా మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

తలతిరగడం లేదా సమతుల్యత కోల్పోవడం తలతిరగడం లేదా సమతుల్యత కోల్పోవడం, లోపలి చెవి సమస్య నాడీ సంబంధిత రుగ్మత లేదా స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే తలతిరుగుతున్నట్లు అనిపిస్తే లేదా నడుస్తున్నప్పుడు అస్థిరంగా అనిపించినా అది మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS) లేదా పార్కిన్సన్స్ వ్యాధి లక్షణం కూడా కావచ్చు. కనుక వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంది.

మసక దృష్టి ఆకస్మిక అస్పష్టమైన దృష్టి లేదా దృష్టిలో మార్పులు మైగ్రేన్, డయాబెటిస్ లేదా మెదడు కణితితో సంబంధం కలిగి ఉండవచ్చు. కొన్నిసార్లు ఇది ఆప్టిక్ నరాల నష్టాన్ని కూడా సూచిస్తుంది. నిరంతరం అస్పష్టమైన దృష్టి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

మెదడు రుగ్మతకి సంబంధించిన ఈ లక్షణాలు కొన్నిసార్లు చిన్నవిగా అనిపించవచ్చు. అయితే వాటిని విస్మరించకూడదు. మీకు లేదా మీ కుటుంబంలో ఎవకైనా ఈ లక్షణాలలో వేటినైనా అనుభవిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. సకాలంలో రోగ నిర్ధారణ చేసి.. అందుకు తగిన చికిత్స తీసుకుంటే.. సమస్య తీవ్రంగా మారకుండా నిరోధించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)