AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నాయనో.. అగరబత్తి పొగ సిగరెట్ల కంటే డేంజర్.. క్యాన్సర్ వస్తుందంట జాగ్రత్త.. సంచలన విషయాలు..

సాంప్రదాయకంగా వివిధ మతపరమైన సాంస్కృతిక కార్యక్రమాలలో ఉపయోగించే అగరబత్తి, ధూపం లాంటివి.. సువాసనను వెదజల్లి అనుకూల వాతావరణాన్ని సృష్టించడంతోపాటు.. మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి.. అంతేకాకుండా.. ఇంట్లో మంచి సువాసన వెదజల్లేందుకు కూడా పలు రకాల సుగంధ అగరబత్తిలను వెలిగిస్తారు. అయితే.. ఈ అగరుబత్తుల సువాసన, పొగ ఆహ్లాదకరంగా మార్చడంతోపాటు ప్రశాంతతను కలిగిస్తుందని నమ్ముతారు..

ఓర్నాయనో.. అగరబత్తి పొగ సిగరెట్ల కంటే డేంజర్.. క్యాన్సర్ వస్తుందంట జాగ్రత్త.. సంచలన విషయాలు..
Agarbatti Smoke
Shaik Madar Saheb
|

Updated on: Jul 24, 2025 | 12:10 PM

Share

వర్షాకాలం ప్రారంభం కాగానే.. వివిధ పండుగలు, వేడుకలు ప్రారంభమవుతాయి. నాగ పంచమి తర్వాత, ఒకదాని తర్వాత ఒకటి పండుగలు రానున్నాయి.. అటువంటి పరిస్థితిలో, ఈ మతపరమైన ఆచారాల సమయంలో ధూపం, అగరబత్తి, సాంబ్రాణి వంటి సుగంధ ద్రవ్యాలను వెలిగిస్తారు.. సాంప్రదాయకంగా వివిధ మతపరమైన సాంస్కృతిక కార్యక్రమాలలో ఉపయోగించే అగరబత్తి, ధూపం లాంటివి.. సువాసనను వెదజల్లి అనుకూల వాతావరణాన్ని సృష్టించడంతోపాటు.. మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి.. అంతేకాకుండా.. ఇంట్లో మంచి సువాసన వెదజల్లేందుకు కూడా పలు రకాల సుగంధ అగరబత్తిలను వెలిగిస్తారు. అయితే.. ఈ అగరుబత్తుల సువాసన, పొగ ఆహ్లాదకరంగా మార్చడంతోపాటు ప్రశాంతతను కలగిస్తుందని నమ్ముతారు.. కానీ ఈ అగరబత్తిల పొగ ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. ఎందుకంటే అగరుబత్తుల పొగ సిగరెట్ పొగ కంటే హానికరమని ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీని కారణంగా మనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని.. సంచలన విషయాలను వెల్లడించింది.

ఈ పరిశోధనలో, సిగరెట్.. అగరుబత్తుల పొగ వల్ల కలిగే నష్టాలపై తులనాత్మక అధ్యయనం జరిగింది. ఈ సమయంలో, అగరుబత్తుల పొగ నమూనాలో 99 శాతం అల్ట్రాఫైన్, సూక్ష్మ కణాలు కనుగొన్నారు. ఈ విషయాలు శరీరానికి హాని కలిగిస్తాయి. ఈ పరిశోధనను సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, చైనా టొబాకో గ్వాంగ్‌డాంగ్ ఇండస్ రైల్వే కంపెనీ సంయుక్తంగా నిర్వహించాయి.

ధూపద్రవ్య పొగపై జరిగిన ఈ అధ్యయనం ప్రకారం.. ధూపం వేసిన తర్వాత, పొగతో పాటు కొన్ని సూక్ష్మ కణాలు కూడా విడుదలవుతాయి. ఈ కణాలు గాలిలో కలిసిపోతాయి. ధూపద్రవ్య కర్రల నుండి విడుదలయ్యే విష కణాలు శరీర కణాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.

క్యాన్సర్ ప్రమాదం:

అధ్యయనం ప్రకారం, ధూపం పొగలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే మూడు రకాల ప్రత్యేక పదార్థాలు ఉంటాయి. ఈ విష పదార్థాలను మ్యూటాజెనిక్, జెనోటాక్సిక్, సైటోటాక్సిక్ అంటారు. ధూపం కర్రల నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది మన ఊపిరితిత్తులలో మంట, చికాకు, వివిధ రకాల రుగ్మతలకు కారణమవుతుంది. ధూపం పొగ వాయుమార్గాలలో దురద, చికాకును కూడా కలిగిస్తుంది.

కళ్ళకు హానికరం:

పొగలో ఉండే హానికరమైన రసాయనాలు కళ్ళలో దురద, చికాకు, చర్మ అలెర్జీలు వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ పొగ వల్ల కంటి సమస్యలతోపాటు.. చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..