Russia Ukraine war: ఉక్రెయిన్ అధ్యక్షుడిని లేపేయండి.. రాపిడ్ ఆర్మీని రంగంలోకి దింపిన పుతిన్..
రష్యాకి సవాల్ విసురుతున్న జెలెన్‌స్కీని ఎలాగైనా తొలగించాలన్నది పుతిన్ కుట్ర. దీంతో ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించింది రష్యా. దాదాపు 400మంది ప్రైవేటు సైనికులను..
ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీని(President Zelenskyy) అంతమొందించడానికి రష్యా(Russia) కుట్రలు చేసింది. ఇప్పుడు కాదు.. కొన్ని నెలల ప్లానింగ్ ఇది. రష్యాకి సవాల్ విసురుతున్న జెలెన్‌స్కీని ఎలాగైనా తొలగించాలన్నది పుతిన్ కుట్ర. దీంతో ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించింది రష్యా. దాదాపు 400మంది ప్రైవేటు సైనికులను ఈ టాస్క్ కోసం ఉక్రెయిన్‌లో దించింది రష్యా. కేవలం జెలెన్‌స్కీని టార్గెట్ చేయాలన్నది వీరి టాస్క్. వాగ్నర్ గ్రూప్ పేరుతో నడిచే ఈ ప్రైవేటు సైన్యం జెలెన్‌స్కీతోపాటు.. మరో 20మంది ఎంపీలను లేపేయడానికి దిగారు. వీరిలో ఉక్రెయిన్ ప్రధానితోపాటు.. కీవ్ మేయర్ కూడా ఉన్నారు. అసలెవరీ వాగ్నర్ గ్రూప్? ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్లఅరాచకాల లిస్ట్ ఏంటి?
2014లో రష్యా స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ దిమిత్రి అట్కిన్.. ఈ ఫోర్స్ ని తయారు చేశారు. దీని ఓనర్ రష్యన్ బిజినెస్ మ్యాన్ ప్రిగోజిన్. ఇతడిని పుతిన్స్ చెఫ్ అని పిలుస్తుంటారు. పుతిన్‌కి రైట్ హ్యాండ్. అంటే ఈ వాగ్నర్ గ్రూప్ పరోక్షంగా రష్యా అధ్యక్షుడి ప్రైవేట్ సైన్యమనే చెప్పాలి.
రష్యా ఆర్మీ చేయలేని పనులను ఈ గ్రూప్‌కి అప్పగిస్తుంటారు. మిడిల్‌ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో వాగ్నర్ గ్రూప్ అనేక మారణహోమాలు సృష్టించాయి. రష్యాన్ ఆర్మీని మించిన కఠోర శిక్షణ ఈ వాగ్నర్ గ్రూప్‌కి ఇస్తారు. అన్ని రకాల పరిస్థితుల్లో పనిచేసేలా ఈ సాధన ఉంటుంది. టార్గెట్ చేజింగ్, ఎలిమినేషన్ ఈ గ్రూప్ స్పెషాలిటీ. సిరియన్ వార్‌లో యాక్టివ్‌గా పనిచేసిన అక్కడి ప్రభుత్వ వ్యతిరేక శక్తులను అంతమొందించడంలో కీలకపాత్ర పోషించాయి.
వందల మంది సిరియన్ రెబల్స్, ఐసీస్ ఉగ్రవాదులను అంతమొందించాయి ఈ సేనలు. అంతేకాదు.. డాన్‌బాస్‌లో అల్లర్లు చెలరేగడంలోనూ ఈ గ్రూప్ హస్తముంది. గతంలో ఉక్రెయిన్‌కి చెందిన రెండు మూడు విమానాలను కూల్చేశాయి. అప్పటినుంచి డాన్‌బాస్‌లో ఈ వాగ్నర్ గ్రూప్ ప్రాచుర్యం పొందింది. ఇటీవల ఉక్రెయిన్ సేనలు అనేకమంది వాగ్నర్ గ్రూప్ సైనికులను మట్టుబెట్టాయి.
అసలు ఉక్రెయిన్ అధ్యక్షుడినే లేపేస్తే.. తన ఆధిపత్యం చెలాయించుకోవచ్చని భావించిన పుతిన్.. ఈ జనవరిలో 400 మందిని ఆ దేశంలో దించాడు. ఇప్పటికే ఈ గ్రూప్ సభ్యులు కీవ్‌లో తిష్టవేశారు. మాస్కో నుంచి ఆదేశాలు వస్తే.. జెలెన్‌స్కీతోపాటు.. మరో 20మంది ఉక్రెయిన్ టాప్ నేతలను చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని జెలెన్‌స్కీ బృందం బయటపెట్టింది. జెలెన్‌స్కీకి త్రెట్ ఉందంటూ ప్రకటించాయి ఉక్రెయిన్ దళాలు.
ఇవి కూడా చదవండి: Juice Side Effects: ఆ వ్యాధి ఉన్నవారు పరగడుపున ఫ్రూట్ జ్యూస్ తాగితే ప్రమాదమే! ఈ విషయాలు తెలుసుకోండి..
Russia Ukraine War Live: రణ రంగంలో కీలక మలుపు.. ఓ వైపు చర్చలు.. మరో వైపు హెచ్చరికలు..
Health Tips: అజీర్తి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ 5 చిట్కాలతో చెక్ పెట్టండి..