Ukraine Crisis: ఐదో రోజు కొనసాగుతున్న ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం.. కీలకమైన టాప్-10 అంశాలు ఇవే..
Russia - Ukraine War News: ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరింది. ఉక్రెయిన్‌లోని నగరాలపై పట్టు కోసం రష్యా ప్రయత్నిస్తోంది.
Russia – Ukraine War News: ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరింది. ఉక్రెయిన్‌లోని నగరాలపై పట్టు కోసం రష్యా ప్రయత్నిస్తోంది. ఖర్కీవ్, ఖేర్సన్, చెర్నిహివ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యాకు ఉక్రెయిన్ దళాలు ధీటుగా బదులిస్తున్నాయి. నివాస ప్రాంతాలపై కూడా రష్యా సైన్యం దాడులు చేస్తోంది. హోస్టామెల్ ఎయిర్‌పోర్ట్‌పై రష్యా దాడి చేసింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా మిత్ర దేశాల సన్నద్ధమవుతున్నాయి.
4వ రోజు నుంచి 5వ రోజు (ఆదివారం, సోమవారం) మధ్య జరిగిన టాప్ 10 డెవలప్‌మెంట్స్ ఓసారి చూద్దాం
- బెలారస్ వేదికగా రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ ఓకే.. చర్చలు జరుగుతాయో లేదోగానీ… రష్యా చెబుతున్న శాంతి మంత్రానికి ఉక్రెయిన్ కూడా ఓకే అంది. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ ద్వారా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీకి రాయబారం పంపింది రష్యా. బెలారస్‌లో చర్చిద్దాం రమ్మంది. ఉక్రెయిన్ కూడా ఓకే అందిగానీ.. చర్చలు బెలారస్‌లో కాదు.. ఉక్రెయిన్ -బెలారస్ బోర్డర్‌లోని ప్రిప్యాత్ నది సమీపంలో మొదలుపెడదామంటూ కండిషన్ పెట్టింది.
- అణ్వాస్త్రాలు సిద్ధం చేస్తున్న రష్యా .. ఇదో కీలకపరిణామం. చర్చలకు రమ్మంటూనే తమ దేశ రక్షణశాఖకు ఓ ప్రమాదకర ఆదేశాన్నిచ్చారు పుతిన్. న్యూక్లియర్ వార్ హెడ్స్‌ను సిద్ధం చెయాలని పురమాయించారు.
- ప్రపంచం హై అలర్ట్.. అణు విధ్వంసానికి పుతిన్ నిజంగానే అడుగు ముందుకేస్తారా? ఆయన ఇచ్చిన ఆదేశాలతో ప్రపంచదేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. బాధ్యతారాహిత్యంగా పుతిన్ ప్రవర్తించడాన్ని తప్పుబట్టాయి. రష్యా ఎలాగో ఉక్రెయిన్ కూడా అలాగే సర్వసత్తాక దేశం. అలాంటి దేశాన్ని ఆక్రమించుకోడానికి అణ్వాయుధాలు వంటి పదజాలం వాడడమే అత్యంత హేయమైన మాటలుగా చెబుతున్నారు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్.
- కోర్టుకెక్కిన ఉక్రెయిన్.. 21వ శతాబ్దపు వార్ క్రిమినల్ పుతిన్… అంటూ అభివర్ణిస్తోంది ఉక్రెయిన్. ఆయన తీరును ఎండగట్టేందుకు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అశ్రయించింది.
- రష్యా ఫ్లైట్స్‌కు నో ఎంట్రీ.. రష్యాపై ఆంక్షలు బిగుస్తున్నాయి. ఒకటీ రెండు కాదు.. యూరోప్ సహా అనేక దేశాల్లో సోవియట్ ఫ్లైట్ల ల్యాండింగ్‌ను నిరాకరిస్తున్నాయి. రష్యా ఫ్లైట్స్‌కు నో చెప్పిన దేశాల్లో బ్రిటన్, అమెరికా సహా యూరోప్‌లోని ఆస్ట్రియా, ఆస్టోనియా, బల్గేరియా, ఫ్రాన్స్, ది చెక్ రిపబ్లిక్, లాటివియా, ఇటలీ, లుథియానా, స్లొవేనియా, జర్మనీ, పోలెండ్, రొమేనియా, ఫిన్లాండ్, బెల్జియం, మాల్టా, లక్సెంబర్గ్, డెన్మార్, స్వీడన్ దేశాలు కూడా రష్యా ఫ్లైట్లకు నో ఎంట్రీ అనౌన్స్‌మెంట్స్ ఇచ్చేశాయి.
- ఖార్కివ్‌లో పోటాపోటీ యద్దం.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తర్వాత పెద్దనగరం ఖార్కివ్. దాన్ని ఆక్రమించుకోడానికి చేసుకోడానికి రష్యా బలగాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాన్ని ఉక్రెయిన్ బలగాలు తిప్పికొడుతున్నాయి. రష్యన్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటాం తప్ప ఖార్కివ్‌లో కాలుపెట్టనివ్వం అంటూ చెప్పుకొచ్చారు ఆ ప్రాంత గవర్ర్ ఓలే.
- కీవ్.. అండర్ కంట్రోల్.. కీవ్‌ను రష్యా ఆక్రమించేసుకుందన్న మాటలను తప్పుబట్టారు ఆ ప్రాంత మేయర్ వైటలీ. కీవ్‌లోకి రష్యా బలగాలు మొన్న ఎంటరైంది నిజమే అయినా తరిమికొట్టేశామని, ఇప్పుడు రష్యా ట్రూప్స్ అక్కడ లేవని చెబుతున్నారు. ఎవైరనా ఉన్నారేమో అని గాలింపు నిరంతరం కొనసాగుతోంది అన్నారు వైటలీ.
- బంకుల్లో కోటా.. కారుకు 10లీటర్లు.. ఉక్రెయిన్‌లోని పెట్రోల్ బంకుల్లో ఆంక్షలు మొదలయ్యాయి. ఇంధనం ఉత్పత్తి చేసే ఆదేశంలోనే నిల్వలు పడిపోయాయి. మరో నెలకు సరిపడా మాత్రమే ప్రస్తుతం దేశంలో ఇంధన నిల్వలు ఉన్నాయి. ఆర్మీకి ఇంధన అవసరాలు పెద్ద ఎత్తున ఉండడంతో పౌరుల ఇంధన వాడకంపై ఆంక్షలు పెట్టింది ఉక్రెయిన్. వ్యక్తిగత కార్లకు 10లీటర్లకు మించి ఎక్స్‌ట్రా ఫ్యూయిల్ నింపే పరిస్థితిలేదు. దేశవ్యాప్తంగా క్రెమెన్‌చుగ్‌లో ఉన్న రిఫైనరీ మాత్రమే పనిచేస్తోంది. అందులోనూ 15శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది.
- రష్యాలో నిరసనలు.. అరెస్ట్‌లు.. పుతిన్‌కి వ్యతిరేకంగా రష్యాలోనే నిరసనలు మిన్నంటుతున్నాయి. వేలు లక్షలుగా పౌరులు వీధుల్లోకి వచ్చి యుద్ధం ఆపాలంటూ నినాదాలు చేస్తున్నారు. నిన్న ఒక్కరాత్రే దాదాపు 2వేల మందిని నిరసనకారులను అరెస్ట్ చేశారు రష్యన్ పోలీసులు.
- మోదీ హైలెవల్ మీటింగ్.. ఉక్రెయిన్-రష్యా మధ్య పరిస్థితులపై అంచనా కోసం హైలెవల్ మీటింగ్ నిర్వహించారు భారత్ ప్రధాని మోదీ. పరిస్థితులు దిగజారితే తీసుకోవాల్సిన స్టాండ్‌పై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఇతర అధికారులతో చర్చించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 900మంది విద్యార్థులను ఇప్పటికి వెనక్కి తీసుకొచ్చిన భారత్.. మిగతా వాళ్ల తరలింపునూ వేగం చెయ్యాలని ఆదేశించారు మోదీ.
Also Read..
Ukraine Crisis: ఉక్రెయిన్‌లో మనవాళ్ల దుస్థితి కలవరపెడుతోంది.. వీడియోను ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ