Juice Side Effects: ఆ వ్యాధి ఉన్నవారు పరగడుపున ఫ్రూట్ జ్యూస్ తాగితే ప్రమాదమే! ఈ విషయాలు తెలుసుకోండి..

పండ్లలో పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. రోజుకో పండు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతుంటారు...

Juice Side Effects: ఆ వ్యాధి ఉన్నవారు పరగడుపున ఫ్రూట్ జ్యూస్ తాగితే ప్రమాదమే! ఈ విషయాలు తెలుసుకోండి..
Fruit Juice
Follow us

|

Updated on: Feb 28, 2022 | 12:36 PM

పండ్లలో పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. రోజుకో పండు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. మనలో చాలామంది కూడా బ్రేక్‌ ఫాస్ట్‌లో పండ్లను తింటుంటారు. అయితే కొంతమందికి మాత్రం పండ్లను జ్యూస్ చేసుకుని తాగడం అలవాటు. ఇలా తాగడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఎనర్జీ వస్తుందని అనుకుంటారు. ఉదయాన్నే మనం తీసుకునే ఆహరం.. పౌష్టికాహారం అయ్యి ఉండాలి. ఎందుకంటే అది ఆ రోజు మొత్తం మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. పోషకాలు కూడిన ఆహారాన్ని ఎంత ఎక్కువ తింటే.. అంత ఎనర్జీ ఉంటుంది. ఇదిలా ఉంటే.. కొంతమందికి ఖాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్ తాగడం అలవాటు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు అంటున్నారు.

ఉదయం ఖాళీ కడుపుతో చల్లటి ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాకుండా.. మలబద్దకం, ఎసిడిటీ లాంటి కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అలాగే శ్లేష్మ పొరలు దెబ్బతిని.. జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉందట. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం వేళ ఫ్రూట్ జ్యూస్‌లకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా పుల్లని పండ్ల జ్యూస్‌లు పరగడుపున అస్సలు తాగకూడదని అంటున్నారు. ఒకవేళ పొరపాటున ఉదయాన్నే జ్యూస్ తాగితే.. ఆ తర్వాత గంట వరకు ఏమి తినకూడదు. జ్యూస్ తాగిన వెంటనే ఏదైనా ఆహారం తింటే వాంతులు, విరేచనాలు, వికారం, కడుపులో తిప్పడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఆహారం తిన్న తర్వాత జ్యూస్ తాగడం మంచిది.

(గమనిక: అందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.)

Also Read: ఈ ఫోటోలో స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అందాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది!

Latest Articles