AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసం.. ప్రాణం పోయిన తగ్గేదీలేదంటున్న జెలెన్‌స్కీ

యుద్ధాలు.. ఘర్షణలు.. అనూహ్య పరిస్థితులు ఎదురైనప్పుడు మధ్యలో నగిలిపోయేది సామాన్య ప్రజలే. ఉక్రెయిన్‌లో ఇప్పుడదే జరుగుతోంది. రష్యా భీకర యుద్ధంతో మారణహోమంతో పాటు ఎటు చూసినా ఆస్తుల విధ్వంసమే కనిపిస్తోంది.

Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసం.. ప్రాణం పోయిన తగ్గేదీలేదంటున్న జెలెన్‌స్కీ
Ukraine War 12
Balaraju Goud
|

Updated on: Feb 27, 2022 | 1:30 PM

Share

Russia-Ukraine war: యుద్ధాలు.. ఘర్షణలు.. అనూహ్య పరిస్థితులు ఎదురైనప్పుడు మధ్యలో నగిలిపోయేది సామాన్య ప్రజలే. ఉక్రెయిన్‌(Ukraine)లో ఇప్పుడదే జరుగుతోంది. రష్యా(Russia) భీకర యుద్ధంతో మారణహోమంతో పాటు ఎటు చూసినా ఆస్తుల విధ్వంసమే కనిపిస్తోంది. ఉక్రెయిన్‌లో ఏ వైపు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రధాన నగరాలే టార్గెట్‌గా రష్యా సైన్యం మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. దీంతో ప్రభుత్వ భవనాలు, ప్రజల ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ఆస్తుల విధ్వంసం ఊహించని విధంగా పెరిగిపోతోంది. అందమైన నగరాలు అందవిహీనంగా మారిపోతున్నాయి.

నాలుగోరోజు యుద్ధం కొనసాగిస్తున్న రష్యా.. ఉక్రెయిన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ ముందుకెళ్తోంది. మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్స్‌, కమాండ్‌ పోస్టులు, కమ్యూనికేషన్‌-రాడార్‌ సెంటర్లను ధ్వంసం చేస్తోంది. దీంతో ఎక్కడ చూసినా మంటలే కనిపిస్తున్నాయి. కీవ్‌లో ప్రజలంతా అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లు, సబ్‌ వే స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. అందులోంచి బయటకు రావొద్దని పదే పదే లోకల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కీవ్‌లో చాలా చోట్ల ఇంకా సైరన్లు మోగుతున్నాయి. హోటళ్లు, అపార్ట్‌మెంట్‌లలో ఉన్న వాళ్లను బేస్‌మెంట్‌ షెల్టర్లకు తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున ఉక్రెనియన్లు రుమేనియా, హంగరీలకు వలస పోతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.

ఉక్రెయిన్ బలం ఎంత? రష్యా ఆయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్ బలం దిగదుడుపే. అయినా పుతిన్ సేనలను ధీటుగా ఎదుర్కొంటున్నాయి ఉక్రెయిన్ బలగాలు. సైనికులు, ప్రజలు అందుబాటులో ఉన్న ఆయుధాలతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కమ్ముకొస్తున్న రష్యా సైన్యాన్ని నిలువరించడానికి ఆత్మాహుతికీ సిద్ధపడుతున్నారు. లొంగిపోవడానికి బదులు పోరాడుతూ మాతృభూమి రక్షణలో ప్రాణాలు వదులుతున్నారు. నేలకూలిన రష్యన్‌ యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, పేలిపోయిన యుద్ధట్యాంకులు ఉక్రెయిన్‌ ప్రతిఘటనకు అద్దంపడుతున్నాయి.

అమెరికా సైనిక సాయం యుద్ధం మహాయుద్ధమవుతోంది. ఇప్పటివరకూ ఉక్రెయిన్ ఒంటరి అనుకుంది గానీ.. లేదు మేమున్నామంటూ ఓ మాటసాయం చేసిన దేశాలు ఇప్పుడు కదనరంగం వైపు కదులుతున్నట్లే కనిపిస్తోంది. ప్రత్యేకించి ఉక్రెయిన్‌ను మొదటి నుంచీ వెనుకేసుకొస్తున్న ఆమెరికా.. ఇప్పుడు బలగాలను సపోర్ట్‌గా పంపుతోంది. అందుకు సంబంధించిన విజువల్స్‌ ఉక్రెయిన్ సమీపంలోనే లాటివా దేశంలో కనిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ హెలీకాప్టర్స్‌ పదుల సంఖ్యలో ల్యాండ్ అయ్యాయి. ఉక్రెయిన్‌కు అండగా అమెరికా 4,500 కోట్ల రూపాయల సైనిక సాయం ప్రకటించింది. తక్షణ సాయం కింద 35 కోట్ల డాలర్లు రిలీజ్ చేసింది. ఉక్రెయిన్‌కు యాంటీ ట్యాంక్‌ మిసైల్‌ జావలెన్‌ శ్రేణి ఇప్పటికే లాటివాలో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి బెలారస్ మీదుగా ఉక్రెయిన్‌కి చేరుకోనున్నాయి. సాయానికి మేము సైతం అంటూ జర్మనీ కూడా ముందుకొచ్చింది. 1000 యాంటీ ట్యాంకు రాకెట్లతో పాటు 500 స్టింజర్‌ క్షిపణులను పంపిస్తోంది.

ఆయుధాలు, ఔషధాలు అందిస్తున్న జర్మనీ జర్మనీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలు సహా ఇతర వస్తువులను నేరుగా ఉక్రెయిన్‌కు పంపుతామని జర్మనీ ప్రకటించింది. రష్యా కోసం ‘స్విఫ్ట్’ గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టమ్ కొన్ని పరిమితులకు జర్మనీ కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. కాగా, రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడానికి తమ దేశం సిద్ధమవుతోందని జర్మనీ అధికారులు తెలిపారు. ఆ దేశ రవాణా మంత్రి వోల్కర్ విస్సింగ్ అటువంటి చర్యను సమర్ధించారు మరియు దీనికి అన్ని సన్నాహాలు చేయాలని ఆదేశించారు. జర్మనీ ఛాన్సలర్ కార్యాలయం శనివారం నాడు ఉక్రెయిన్‌కు 1,000 ట్యాంక్ వ్యతిరేక ఆయుధాలను, 500 ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను “సాధ్యమైనంత త్వరగా” పంపనున్నట్లు ప్రకటించింది. అటు ఆస్ట్రేలియా తన నాటో భాగస్వాముల ద్వారా ఉక్రెయిన్‌కు మారణాయుధాలను సరఫరా చేస్తుందని ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ తెలిపారు.

రష్యా యుద్ధం చేస్తోంది. కానీ సొంత ఇలాఖాలోనే నిరసన వ్యక్తమవుతోంది. యుద్దం వద్దంటూ కొన్ని ప్రాంతాల్లో రష్యన్లు ర్యాలీలు చేస్తున్నారు. మరోవైపు న్యూయార్క్‌లో యుద్దం ఆపాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

Read Also…

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసం.. ఇంటర్‌నెట్‌ సేవలకు బ్రేక్.. అండగా నిలిచిన ఎలన్‌మస్క్‌

Russia Ukraine War: రష్యాకు చైనా బహిరంగ మద్దతు.. ఇద్దరి సాన్నిహిత్యం భారత్‌కు లాభమా? నష్టమా?