Russia Ukraine War: అణు విద్యుత్తు కేంద్రంపై బాంబుల వర్షం.. వీడియోను విడుదల చేసిన ఉక్రెయిన్..

Russia Ukraine War: అణు విద్యుత్తు కేంద్రంపై బాంబుల వర్షం.. వీడియోను విడుదల చేసిన ఉక్రెయిన్..
Attacked Nuclear Plant

Attacked on Nuclear Plant: ఉక్రెయిన్​పై గత ఎనిమిది రోజులుగా క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా.. ఇప్పుడు అక్కడి అణు విద్యుత్తు కేంద్రమే లక్ష్యంగా దాడులు చేపడుతోంది.

Sanjay Kasula

|

Mar 04, 2022 | 11:18 AM

ఉక్రెయిన్​పై(Ukraine) గత ఎనిమిది రోజులుగా క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా..(Russia) ఇప్పుడు అక్కడి అణు విద్యుత్తు కేంద్రమే(Nuclear Power Plant ) లక్ష్యంగా దాడులు చేపడుతోంది. ప్రపంచంలో భయానక ఘటనగా మారుతున్న జప్రోజియా న్యూక్లియర్‌ ప్లాంట్‌( Zaporizhzhia nuclear power plant ) దాడి ఉక్రెయిన్‌లోని ఎనర్‌హోదర్‌లో ఉంది. జప్రోజియా అణు విద్యుత్ కేంద్రం ఐరోపాలో ఖండంలోనే అతి పెద్ద అణు విద్యుత్ ప్లాంట్. ప్రపంచంలోనూ 10 అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌లలో ఇది ఒకటి. అయితే.. ఇప్పుడు మాత్రం నాలుగు యూనిట్లు మాత్రమే పని చేస్తున్నాయి. మిగిలిన రెండు యూనిట్లను మూసి వేశారు. ఈ ప్లాంట్ ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని ఎనర్‌హోదర్ సిటీకి సమీపంలో ఉన్న.. డ్నీపర్ నదిపై కఖోవ్కా రిజర్వాయర్ సమీపంలో నిర్మించారు. మొత్తం 6 న్యూక్లియర్‌ రియాక్టర్లు.. ఒక్కొకటి 950 మిలియన్‌ వాట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తిని చేస్తాయి. ఇక్కడ మొత్తం 5వేల 7వందల మిలియన్‌ వాట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రొడ్యూష్‌ అవుతుంది. మొదటి ఐదు రియాక్టర్‌లను 1985-1989 మధ్య ప్రారంభించగా.. 1996లో ఆరవ రియాక్టర్‌ను ఉత్పత్తిలోకి తీసుకొచ్చారు.

ఇక్కడే ఉక్రెయిన్‌కు కావాల్సిన 50 శాతం పవర్‌ ప్రొడ్యూస్‌ జరిగుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఉక్రెయిన్‌ అవసరాల్లో 5వ వంతు విద్యుత్‌ను జప్రోజియా న్యూక్లియర్‌ ప్లాంటే తీర్చుతుంది. 2017లో మొదటి సారి ఈ ప్లాంట్‌లోని 3వ రియాక్టర్‌ను ఆధునీకరించారు. మరో ఐదింటిని 2021లో రిపేర్‌ చేసి.. వీటి లైఫ్‌ను 10 సంవత్సరాలకు పెంచారు.

ఈ ప్లాంట్‌పై మొదటి నుంచి శత్రువుల దాడి హెచ్చరికల్లోనే ఉంది. పలు మార్లు ఈ ప్లాంట్‌ పేల్చివేతకు కుట్రలు జరిగాయి. మే 2014లో, రైట్ సెక్టార్ ప్రతినిధులుగా చెప్పుకునే 40 మంది మిలిటెంట్లు.. ఈప్లాంట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక్కడ ఉన్న హై సెక్యూరిటీ అలర్ట్‌తో ఆ ముప్పు తప్పింది. 2014లో జరిగిన డాన్‌బాస్‌ వార్‌లో కూడా ఇది హై అలర్ట్‌ జోనే ఉంది.

దాడులు జరిగే ప్రదేశానికి అతి సమీపంలో ఉండడంతో దీనిపై అటాక్‌ జరిగే ప్రమాదం ఉందని. 2014 ఆగస్టు 31న గ్రీన్‌పీస్‌ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 2014 డిసెంబర్‌ 3న ఇక్కడ పెద్ద ప్రమాదం తప్పతింది. పవర్‌ ఐట్‌లెట్‌ సిస్టమ్‌లో షార్ట్‌ సర్య్కూట్‌ జరిగింది. దీంతో ప్లాంట్‌ ఉత్పత్తిని మొత్తం నిలిపి వేశారు. కొద్ది రోజుల పాటు ఉత్పత్తికి దూరం ఉంచారు.

ఉక్రెయిన్​పై గత వారం రోజులుగా క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా.. ఇప్పుడు అక్కడి అణు విద్యుత్తు కేంద్రమే లక్ష్యంగా దాడులు చేపడుతోంది. ఐరోపాలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్​గా పేర్కొనే ఎనర్హోదర్​ నగరంలోని జపోరిజ్జియా కేంద్రంపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆ ప్రాంతంలో మంటలు చెలరేగి పరిస్థితి ఆందోళకరంగా మారింది. రష్యన్ సేనలు దాడులు ఆపకపోతే పెను విధ్వంసం తప్పదని అణు విద్యుత్తు కేంద్రం ప్రతినిధి హెచ్చరించారు.

రష్యన్​ సేనలు న్యూక్లియర్​ ప్లాంట్​పై దాడి చేయడం వల్ల అక్కడ మంటలు చెలరేగాయి. దాడి జరిగిన ప్రాంతంలోని రియాక్టర్​ ప్రస్తుతం వినియోగంలో లేకున్నా అందులో అణు ఇంధనం ఉంది. దాడులు ఆపకపోతే అది పేలి పెను విధ్వంసం జరిగే అవకాశం ఉంది.”

చెర్నోబిల్​ కంటే 10 రెట్లు..

జపోరిజ్జియా ఎన్​పీపీ పేలినట్లయితే జరిగే నష్టం చెర్నోబిల్​ పేలుడు కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుందని హెచ్చరించారు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా. అణు విద్యుత్తు కేంద్రంపై దాడులకు సంబంధించిన వీడియోను.. ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ కార్యాలయం సలహాదారు ట్వీట్​ చేశారు. ఉక్రెయిన్​లోని 25 శాతం విద్యుత్తు.. ఈ అణు విద్యుత్తు కేంద్రం ద్వారా అందుతోంది.

ఇవి కూడా చదవండి: Blood Sugar: ద్రాక్ష తినడం వల్ల డయాబెటిస్‌ ఉన్నవారిలో చక్కెర పెరుగుతుందా..? నిజం ఏమిటో తెలుసుకోండి..

Russia Ukraine War Live Updates: ఉగ్రరూపు దాల్చిన యుద్ధం.. రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్‌ నగరం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu