Work From Home: వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌కు దిగ్గజ సెర్చింజన్‌ సంస్థ స్వస్తి.. త్వరలోనే ఉద్యోగులు ఆఫీసుకు రావాలని సూచన

Work From Home: రెండేళ్ల క్రితం.. చైనా(China)లో పుట్టిన .. కరోనా వైరస్(Corona Virus) ప్రపంచ దేశాలను ఓ రేంజ్ లో వణికించింది. కోవిడ్(Covid 19) వ్యాప్తి నివారణ చర్యలో భాగంగా అనేక సంస్థలు.. తమ ఉద్యోగులకు విధులను..

Work From Home: వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌కు దిగ్గజ సెర్చింజన్‌ సంస్థ స్వస్తి.. త్వరలోనే ఉద్యోగులు ఆఫీసుకు రావాలని సూచన
Google
Follow us
Surya Kala

|

Updated on: Mar 04, 2022 | 11:31 AM

Work From Home: రెండేళ్ల క్రితం.. చైనా(China)లో పుట్టిన .. కరోనా వైరస్(Corona Virus) ప్రపంచ దేశాలను ఓ రేంజ్ లో వణికించింది. కోవిడ్(Covid 19) వ్యాప్తి నివారణ చర్యలో భాగంగా అనేక సంస్థలు.. తమ ఉద్యోగులకు విధులను ఇంటినుంచి నిర్వహించే అవకాశం కల్పించింది. అయితే గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదించింది. అంతేకాదు.. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా దాదాపు పూర్తి అయింది. దీంతో చాలా సంస్థలు మళ్ళీ తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రమ్మనమని పిలుస్తున్నాయి. తాజాగా సెర్చింజన్ దిగ్గజ సంస్థ గూగుల్‌(Google) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన తమ ఉద్యోగులను ఏప్రిల్‌ 4 నుంచి ఆఫీసులకు రావాలిందిగా కోరింది. వాలంటరీ వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌కు దిగ్గజ సెర్చింజన్‌ సంస్థ స్వస్తి పలికింది. ఈ మేరకు తమ సంస్థకు చెందిన ఉద్యోగులకు మెయిల్స్ పంపిస్తున్నారు.. ఇదే విషయంపై గూగుల్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ కేసీ స్పందిస్తూ.. బే ఏరియా సహా పలు అమెరికన్‌ లోని అనేక ప్రాంతాల ఉద్యోగులను ఏప్రిల్ 4 నుంచి ఆఫీసుకు రమ్మనమని చెప్పినట్లు పేర్కొన్నారు. అంతేకాదు గత రెండు సంవత్సరాలుగా తమ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఇంటినుంచి విధులను నిర్వర్తిస్తున్నారని.. అయితే కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బే ఏరియా సహా పలు లొకేషన్స్‌లో తమ ఎంప్లాయిస్ ను హైబ్రిడ్‌ వర్క్‌ వీక్‌ పద్ధతిలోఆఫీసులకు రప్పిస్తామని చెప్పారు.

అయితే ఆఫీసుకు వచ్చే ఉద్యోగులకు కొన్ని సూచనలు కూడా చేశారు. విధులకు వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.. వ్యాక్సిన్ తీసుకొని వారు.. త్వరగా తీసుకోలేని.. తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని డేవిడ్‌ రాడ్‌క్లిఫ్‌ ఉద్యోగులకు పంపిన మెయిల్ లో స్పష్టం చేశారు.

అంతేకాదు తమ సంస్థలోని ఫిట్‌నెస్‌ సెంటర్లు, షటిల్‌ సర్వీసులు, పాంట్రీలు వంటి ప్రదేశాలను కూడా తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.  అయితే  ప్రస్తుతం అమెరికాకు చెందిన గూగుల్ ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్    నిబంధనలు క్యాన్సిల్ చేస్తున్నామని.. చెప్పారు.

Also Read:  వివాహానికి అడ్డంకులు వస్తుంటే.. ఈ వాస్తు చిట్కాలు ప్రయత్నించండి.. త్వరలో వివాహ యోగం కలుగుతుంది