AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: యుద్ధరంగంలోకి ఉక్రెయిన్ తొలి మహిళ.. అసలు నిజం ఇదేనా..!

దేశాధినేత‌గా ఎదిగేవ‌ర‌కు వెన్నంటి ఉంది. ఇప్పుడు భ‌ర్త చావోరేవో అన్న రీతిలో రణ క్షేత్రంలో దూకితే తానుకూడా సై అంది. ప్రాణాల‌కు తెగించి మ‌రీ త‌న వెంటే ఉంటాన‌ని అంటోంది. ఇలాంటి స్టోరీలు ఇప్పుడు ఉక్రెయిన్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

Fact Check: యుద్ధరంగంలోకి ఉక్రెయిన్ తొలి మహిళ.. అసలు నిజం ఇదేనా..!
Fact Check Lady Soldier Rif
Sanjay Kasula
|

Updated on: Mar 04, 2022 | 1:16 PM

Share

Ukraine first lady Olena Zelenska: రాజ‌భోగాలు అనుభ‌వించినా.. కార‌డ‌విలో జీవించినా క‌ట్టుకున్న‌వాడి వెంటే ఆమె. అందుకే భ‌ర్త క‌మెడియ‌న్‌గా(comedian) ఉన్న‌ప్పుడు ఆయ‌నకు వెన్నంటి ఉంది. యాక్టింగ్ మానేసి రాజ‌కీయాల్లోకి వెళ్తానంటే త‌న‌కు ఇష్టం లేకున్నా భ‌ర్త‌ను సపోర్ట్ చేసింది. దేశాధినేత‌గా ఎదిగేవ‌ర‌కు వెన్నంటి ఉంది. ఇప్పుడు భ‌ర్త చావోరేవో అన్న రీతిలో రణ క్షేత్రంలో దూకితే తానుకూడా సై అంది. ప్రాణాల‌కు తెగించి మ‌రీ త‌న వెంటే ఉంటాన‌ని అంటోంది. ఇలాంటి స్టోరీలు ఇప్పుడు ఉక్రెయిన్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు అక్కడి యువతను ఆయుధాలు పట్టుకుని యుద్ధ రంగంలో రష్యా సైన్యంపై తెగించి పోరాడేందుకు సిద్ధం చేశాయి. ఇప్పుడు ఉక్రెయిన్ దేశంలోనే సరిహద్దులు దాటేసింది ఓ వైరల్ ఫోటో స్టోరీ.

మారణాయుధాలు పట్టుకుని ఆర్మీ డ్రెస్‌లో తెగించి కొట్లాడేందుకు రెడీ అవుతున్న ఓ అందాల సుందరి ఫోటో ఇప్పుడు దేశ దేశాలను దాటేస్తోంది. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు ఆ దేశ అధ్యక్షుడి ప్రియమణి, ఉక్రెయిన్ తొలి మహిళ. రష్యాకు లొంగేదేలే అంటూ యుద్ధం చేసేందుకుక రెడీ అంటోంది. రండి చూసుకుందాం అంటూ అక్కడి యువతలో ఉత్సాహం నింపుతోంది. ఈ ఫోటో చూసిన ఉక్రెయిన్ యువత తెగ సంబరపడియింది.

ఓ వైపు దేశ అధ్యక్షుడు సైనికులతో కలిసి పోరాడుతున్న ఫోటోలు షేర్ అవుతుంటే మరో వైపు దేశ తొలి మహిళ అంటూ మరో ఫోటో ఒకటి వైరల్ అవుంతోంది. అయితే వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో వరల్ అవుతున్న ఫోటోలు ఇక్కడ చూడవచ్చు..

భర్త వెంటే భార్య అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న స్టోరీలను ఇక్కడ చూడచ్చు..

అయితే, స్టాక్ ఫోటోను పరిశీలించింది ఫ్యాక్ట్ చెక్ టీమ్. ఈ చిత్రంలో ఉన్నది మాత్రం ఉక్రేనియన్ ఆర్మీకి చెందిన ఓ సైనికురాలివిగా గుర్తించారు. అయితే ఇందులో ఉన్న నిజం ఏంటో తెల్చేందుకు టీవీ9 ఫ్యాక్ట్ చెక్ టీమ్ రంగంలోకి దిగాయి. ఆ ఫోటోను గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో పరిశీలించింది. అందులో నిజం లేదంటూ తేల్చేసింది. ఈ ఫోటోలో ఉన్న లేడీ ఉక్రెయిన్ తొలి మహిళ కాదంటూ చెప్పింది.

Istock , Alamy ఈ ఫోటోలను తీసినట్లుగా తెలుస్తోంది. కైవ్ కు చెందిన వోలోడిమిర్ జఖారోవ్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలు అని తేలింది. ఈ చిత్రం 2021లో ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తీసిన ఫోటోలు అని తేలింది. ఈ ఫోటోలో ఉన్న యువతి ఉక్రేనియన్ సైనికురాలిగా గుర్తించింది. ఈ కథనాన్ని టీవీ9 ఫ్యాక్ట్ చెక్ టీమ్ గుర్తించింది. ఇందులోని వాస్తవాలను చెక్ చేసింది.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War: అణు విద్యుత్తు కేంద్రంపై బాంబుల వర్షం.. వీడియోను విడుదల చేసిన ఉక్రెయిన్..

Russia Ukraine War Live Updates: న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ను టార్గెట్ చేసిన రష్యా.. ఆందోలనలో యూరప్ దేశాలు..