Russia Ukraine War 7th Day Updates: ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్య దహనకాండ.. మూడో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్ధం!

Russia Ukraine Crisis Updates: ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పోర్ట్ సిటీ ఖెర్సన్‌ నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు పోల్‌, ఖార్కివ్‌, ఎనర్హోదర్, ఓఖ్టిర్కా, చెర్నెహివ్‌ నగరాలను దిగ్భంధించింది. భీకర పోరాటం సాగుతున్న వేళ..

Russia Ukraine War 7th Day Updates: ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్య దహనకాండ.. మూడో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్ధం!
Russia Ukraine War

|

Mar 04, 2022 | 9:47 PM


Russia Ukraine Conflict Updates: పుతిన్ ధ్వంస రచనతో ప్రపంచం హై అలర్ట్ అయ్యింది. చరిత్రలో ఇంతవరకూ ఏ దేశాధినేతా చెయ్యని దాడి పుతిన్‌ చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై అణుబాంబు వెయ్యకపోయినా, అలాంటి విధ్వంసానికే ఆరంభం పలికారు. దేశానికి 40శాతం న్యూక్లియర్‌ పవర్‌ను అందిస్తున్న జఫ్రోజియా న్యూక్లియర్ ప్లాంట్‌పై తెగబడింది రష్యా. ఆ ప్లాంట్‌పై వరుస దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే మంటల్లో చిక్కుకుంది పవర్ ప్లాంట్‌. ఇప్పుడు జెలెన్‌స్కీ రష్యాతో యుద్ధ మే చెయ్యాలా… ఉక్రెయిన్ సహా పొరుగు దేశాలనూ కాపాడేలా పవర్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాలా.. అన్నట్లుంది పరిస్థితి. ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌లో విధ్వంసం ఆగడం లేదు. కీలక పట్టణాలపై రష్యా సైన్యం పెను విధ్వంసానికి దిగుతోంది. మూడు రోజులుగా ఎలాంటి గ్యాప్‌ లేకుండా ఎటాక్‌ చేస్తోంది. 9వ రోజు సైతం భీకర విధ్వంసకాండ కొనసాగుతుండగా.. బెలారస్‌ బ్రెస్ట్‌ ప్రాంతంలో చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. రష్యా తరపున సైనికులు, ఉక్రెయిన్‌ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ప్రధాన పట్టణాలపై ఫోకస్‌ చేసిన రష్యన్‌ బలగాలు ఖార్కీవ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి.

ఉక్రెయిన్‌ కూడా ధీటుగానే స్పందిస్తోంది. రష్యా యుద్ధట్యాంకులే లక్ష్యంగా ఉక్రెయిన్‌ దాడి చేస్తోంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ ఎయిర్‌ ఎటాక్‌లో రష్యాకు చెందిన పది ట్యాంకులు ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. అటు.. ల్యాండింగ్‌ ప్రయత్నాల్లో రష్యాన్‌ మెరైన్‌ ఫోర్స్‌ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటిదాకా భూమి, ఆకాశం..ఇక సముద్రంలోనూ సమరం మొదలయ్యే ఛాన్స్‌ ఉంది. మధ్యధరా సముద్రంలో నాటో ఎయిర్‌ఫోర్స్‌ యాక్టివ్‌ అయింది. నాటో వార్‌షిప్‌కి రక్షణగా గాల్లోకి యుకె ఫైటర్‌ ఫ్లైట్స్‌ కాపలాగా ఉన్నాయి. ఐనా కూడా.. ఉక్రెయిన్‌కు చెందిన 1612 స్థావరాలను రష్యా ధ్వసం చేసినట్టు తెలుస్తోంది.

రాజధాని కీవ్‌ సమీపంలో రష్యా బలగాలపై ఉక్రెయిన్‌ దాడి చేసింది. కీవ్‌ వైపు వస్తున్న రష్యా కాన్వాయ్‌పై ఫైటర్‌ జెట్‌తో ఉక్రెయిన్‌ ఎటాక్‌కు దిగింది. రోడ్డుపై దాదాపు 64 కిలోమీటర్ల పొడవున ఉన్న రష్యా కాన్వాయ్‌ లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఇలా కీవ్‌ సమీపంలో రష్యా బలగాలకు ఉక్రెయిన్‌ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ ఫోర్స్‌ను ఇలా కంటిన్యూ చేసేందుకు నాటో అత్యవసర సమావేశం నిర్వహించింది. రష్యాకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక యుద్ధం మొదలయ్యాక జెలెస్కీ హత్యకు మూడుసార్లు విఫలయత్నం జరిగినట్టు తెలుస్తోంది.

లొంగిపోయిన తొలి నగరం.. రష్యాకు సహకరించాలని ప్రకటించిన మేయర్..

యుద్ధం మొదలైన 8 రోజుల తర్వా ఓ నగరాన్ని రష్యా సైన్యం పూర్తి స్థాయిలో లొంగదీసుకుంది. 3 లక్షల జనాభా ఉండే కీలకమైన రేవు పట్టణమైన ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యం ప్రకటన చేసింది. స్థానిక పాలనా యంత్రాంగం కూడా ఈ విషయాన్ని  ధ్రువీకరించింది. బేషరతుగా లొంగిపోయి రష్యా సైన్యానికి సహకరించాలంటూ స్థానిక ప్రజలకు ఖర్కీవ్ నగర మేయర్‌ పిలుపునిచ్చారు.


LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 04 Mar 2022 09:07 PM (IST)

  ఈ వారం రష్యాతో ఉక్రెయిన్ మూడో రౌండ్ చర్చలు

  ఉక్రెయిన్ ఈ వారం చివర్లో రష్యా అధికారులతో మూడో రౌండ్ చర్చలను ప్లాన్ చేస్తోంది. ఈ సమాచారాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సలహాదారు అందించారు. అంతకుముందు గురువారం, పోలిష్ సరిహద్దు సమీపంలో బెలారస్‌లో చర్చలకు రష్యా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సలహాదారు వ్లాదిమిర్ మెడిన్‌స్కీ మాట్లాడుతూ, “వివాదానికి రాజకీయ పరిష్కారానికి సంబంధించిన సమస్యలతో సహా ఇరుపక్షాల వైఖరి చాలా స్పష్టంగా ఉంది. పౌరుల తరలింపు కోసం సురక్షితమైన కారిడార్లను నిర్మించడానికి రష్యా – ఉక్రెయిన్ తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆయన ధృవీకరించారు. తదుపరి రౌండ్ చర్చలు – ఉక్రెయిన్ పార్లమెంటులకు లోబడి ఒప్పందాలు కుదరవచ్చని రష్యా సీనియర్ పార్లమెంటేరియన్ లియోనిడ్ స్లట్‌స్కీ అన్నారు.

 • 04 Mar 2022 08:43 PM (IST)

  12 ఇండిగో ప్రత్యేక విమానాలు

  ఉక్రెయిన్‌లోని పొరుగు దేశాల నుండి 2,600 మందికి పైగా భారతీయుల తరలింపు కోసం శుక్రవారం నుంచి ఆదివారం మధ్య 12 విమానాలను నడుపుతున్నట్లు ఏవియేషన్ కంపెనీ ఇండిగో తెలిపింది. రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ గగనతలం ఫిబ్రవరి 24 నుండి మూసివేయడం జరిగింది. అయితే, భారతీయ పౌరులను ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, స్లోవేకియా, పోలాండ్ నుండి ప్రత్యేక విమానాలలో తరలిస్తోంది. 9,200 మంది భారతీయుల తరలింపు కోసం ఫిబ్రవరి 28 – మార్చి 6 మధ్య 42 విమానాలు నడుస్తున్నట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు 6,600 కంటే ఎక్కువ మంది పౌరులు భారత్ తిరిగి రావడానికి 30 విమానాలను నడిపించామని పేర్కొంది.

 • 04 Mar 2022 06:39 PM (IST)

  ప్రత్యేక రైళ్ల కోసం ఉక్రెయిన్‌ను అభ్యర్థించాంః కేంద్రం

  భారతీయులను తరలించేందుకు ప్రత్యేక రైళ్ల కోసం ఉక్రెయిన్ అధికారులను అభ్యర్థించామని, కానీ వారు స్పందించలేదన్నారు. ఇంతలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసామని బాగ్చి తెలిపారు.

 • 04 Mar 2022 06:37 PM (IST)

  అందరినీ క్షేమంగా తీసుకువస్తాంః కేంద్రం

  ఇప్పటివరకు ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి 20,000 మంది భారతీయులను తీసుకువచ్చామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. IAF నేతృత్వంలోని C-17 విమానంతో సహా 16 విమానాలు తదుపరి 24 గంటలలో భారత పౌరులను తీసుకురానున్నట్ల విదేశాంగ ప్రతినిధి అరబిందమ్ బాగ్చి తెలిపారు. తూర్పు ఉక్రెయిన్ ప్రత్యేకించి ఖార్కివ్, పిసోచిన్‌లపై అత్యధిక శ్రద్ధ పెట్టామన్నారు. ఈ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని 5 బస్సులల్లో సరిహద్దులకు తరలిస్తున్నామని తెలిపారు. సాయంత్రం తర్వాత మరిన్ని బస్సులు పెంచుతున్నామన్నారు. పిసోచిన్‌లో 900-1000 మంది భారతీయులు, సుమీలో 700 మంది చిక్కుకున్నారు. మేము సుమీ గురించి ఆందోళన చెందుతున్నామని బాగ్చి తెలిపారు. భారతీయులందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

 • 04 Mar 2022 06:27 PM (IST)

  మరో 7 విమానాలను కోరాముః కేంద్ర మంత్రి

  బుడాపెస్ట్ నుండి, నిన్నటి వరకు 3,000 మంది భాతీయులను క్షేమంగా తీసుకురాగలిగామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. మరో 1,100 మంది ఈరోజు బయలుదేరే అవకాశం ఉందన్నారు. మేము మరో 7 విమానాలను కోరామన్నారు. హంగేరీ-జాహోనీ సరిహద్దు నుండి రేపు మరో 1,400 మందిని బుడాపెస్ట్ నుంచి ఖాళీ చేయిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

 • 04 Mar 2022 06:25 PM (IST)

  హాట్‌లైన్ నంబర్‌ జారీ చేసిన ఎంబసీ

  రొమేనియాలో ఇప్పటికీ ఖాళీ చేసిన భారతీయ పౌరుల కోసం భారత రాయబార కార్యాలయం హాట్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది.

 • 04 Mar 2022 06:23 PM (IST)

  అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడి యుద్ధ నేరంః అమెరికా

  "అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడి చేయడం యుద్ధ నేరం. యూరప్‌లోని అతిపెద్ద అణు కర్మాగారంపై పుతిన్ షెల్లింగ్ అతని భీభత్స పాలనను మరో అడుగు ముందుకు తీసుకువెళుతుంది" అని కైవ్‌లోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

 • 04 Mar 2022 06:21 PM (IST)

  కొనసాగుతున్న ఆపరేషన్ గంగ

  మార్చి 3 వరకు, మొత్తం 5,245 మంది భారతీయులను రొమేనియా నుండి భారతీయులను తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో 7,400 మందిని ప్రత్యేక విమానాల ద్వారా తీసుకురావాలని భావిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అదనంగా, శుక్రవారం 3,500 మందిని, మార్చి 5 న 3,900 మందిని తిరిగి తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

 • 04 Mar 2022 06:18 PM (IST)

  రష్యా చర్యతో ప్రపంచదేశాల్లో ఆందోళనలు

  చెర్నోబిల్‌ ఘటనను పునరావృతం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ.. పుతిన్‌ అణు ఉగ్రవాదానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. జపోరిజ్జియా అణు విద్యుత్​ కేంద్రంపై రష్యా జరిపిన దాడిని చేపట్టడాన్ని ప్రపంచ దేశాలు తప్పు పడుతున్నాయి.

 • 04 Mar 2022 06:16 PM (IST)

  సారెత్ సరిహద్దులో 300 మంది భారతీయ పౌరులు

  ఉక్రేనియన్ శరణార్థులు పెరుగుతున్నారు. విదేశీ పౌరులు ఉక్రెయిన్ నుండి వచ్చిన తర్వాత రొమేనియాలోని సారెట్ సరిహద్దు వెంబడి ఆహారం, దుస్తులు, వైద్య సామాగ్రితో ఆశ్రయాలలో సేదతీరుతున్నారు. భారతీయులతో పాటు చాలా మంది విదేశీయులు ఇక్కడ ఉన్నారని, వారి కోసం ప్రత్యేక టెంట్లు తయారు చేసినట్లు రెడ్‌క్రాస్ వాలంటీర్ తెలిపారు. గత రాత్రి 815 మంది భారతీయులు ఉండగా, ఈరోజు 300 మంది ఇప్పటికీ ఇక్కడే ఉన్నారని వెల్లడించారు.

 • 04 Mar 2022 06:12 PM (IST)

  పుతిన్​ చర్యలు యూరోప్‌కు ముప్పుః బ్రిటన్

  అణు కేంద్రంపై రష్యా దాడి నేపథ్యంలో భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్..​ పుతిన్​ చర్యలు యూరోప్‌కు ముప్పు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

 • 04 Mar 2022 06:04 PM (IST)

  డిఫెన్స్ ఎగ్జిబిషన్ 2022 వాయిదా.. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన

  గుజరాత్ రాజధాని గాంధీ నగర్‌లో ఈ నెల 10 నుండి 14 వరకు జరగాల్సిన డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ 2022ను భారత్ రక్షణ మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దీన్ని వాయిదావేసినట్లు తెలుస్తోంది.

 • 04 Mar 2022 05:52 PM (IST)

  UNHRC ఓటింగ్‌కు భారత్ దూరం

  ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఫలితంగా వెంటనే స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) ఓటింగ్‌లో భారతదేశం శుక్రవారం పాల్గొనలేదు. ఉక్రెయిన్‌లో మానవ హక్కుల పరిస్థితిపై డ్రాఫ్ట్ తీర్మానంపై 47 మంది సభ్యుల UN కౌన్సిల్‌లో ఓటు వేశారు. మోషన్ ఆమోదించడం జరిగింది. తీర్మానానికి అనుకూలంగా 32 ఓట్లు, వ్యతిరేకంగా రెండు ఓట్లు (రష్యా, ఎరిట్రియా) రాగా, భారత్, చైనా, పాకిస్థాన్, సూడాన్, వెనిజులా సహా 13 దేశాలు ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు.

 • 04 Mar 2022 04:29 PM (IST)

  ఎటువంటి రేడియోధార్మిక పదార్థం విడుదల కాలేదు

  జపోరిజియా అణు కర్మాగారాన్ని రష్యా సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుందని ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA)కి తెలిపింది. ప్లాంట్‌లోని ఆరు రియాక్టర్ల భద్రత ప్రభావితం కాలేదు. ఎటువంటి రేడియోధార్మిక పదార్థం విడుదల కాలేదని పేర్కొంది. అయితే, ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం అందిందని ఏజెన్సీ తెలిపింది.

 • 04 Mar 2022 04:03 PM (IST)

  రష్యా ఆధీనంలో ఉక్రెయిన్ ఇంధన సరఫరా

  రష్యా సైన్యం మరింత దూకుడు పెంచుతోంది. ఉక్రెయిన్ దేశ ఇంధన సరఫరాను తన ఆధీనంలోకి తీసుకుంది. మరోవైపు అణు కర్మాగారం ఇప్పటికీ సజావుగా పనిచేస్తోందని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

 • 04 Mar 2022 04:00 PM (IST)

  న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ పరిస్థితిపై స్పందించిన IAEA DG రాఫెల్

  ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్ ప్లాంట్ల సమగ్రత రాజీపడిందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ ఎం. గ్రాసిక్ మీడియా సమావేశంలో అన్నారు. ఉక్రెయిన్ మమ్మల్ని అభ్యర్థించిందన్న ఆయన.. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని రష్యా,ఉక్రెయిన్ రెండింటికీ సూచించానన్నారు. సంక్షోభం రాజకీయ అంశాలతో దీనికి సంబంధం లేదు. యుద్ధ రంగంలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా దాడులు మంచిదికాదన్నారు.

 • 04 Mar 2022 03:53 PM (IST)

  స్లోవేకియా నుండి భారత్‌కు 188 మంది విద్యార్థులు

  స్లోవేకియాలోని భారత రాయబారి వన్‌లాల్‌హుమా మాట్లాడుతూ ప్రస్తుతం 188 మంది విద్యార్థులతో విమానం బయలుదేరుతుందని, మధ్యాహ్నం 210 మంది విద్యార్థులతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం బయలుదేరుతుందని చెప్పారు. భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు.

 • 04 Mar 2022 03:47 PM (IST)

  251 యుధ్ద ట్యాంకులు, 37 హెలికాప్టర్లు కోల్పోయిన రష్యా

  ఉక్రెయిన్ సైన్యం విడుదల చేసిన సమాచారం ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా చాలా నష్టపోయింది. రష్యా ఇప్పటివరకు 9,166 మంది సైనికులు వీర మరణం పొందారు. 37 హెలికాప్టర్‌లతో పాటు 251 యుద్ధ ట్యాంకులు, 404 కార్లు, 50 ఎంఎల్‌ఆర్‌లు గల్లంతయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది.

 • 04 Mar 2022 02:57 PM (IST)

  పుతిన్‌ను అన్‌ఫ్రెండ్ చేసిన బైడెన్

  ఉక్రెయిన్‌పై రష్యా వరుస దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా పరోక్ష ధిక్కార స్వరం వినిపించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఫేస్‌బుక్‌లో అన్‌ఫ్రెండ్ చేశారు.

  Biden On Putin

  Biden On Putin

 • 04 Mar 2022 02:01 PM (IST)

  ఉక్రెయిన్ ప్రజలకు నటి మిలా $3 మిలియన్లు విరాళం

  ఉక్రెయిన్‌లో జన్మించిన నటి మిలా కునిస్ తన భర్తతో కలిసి ఉక్రెయిన్ ప్రజలకు సహాయం చేయడానికి $30 మిలియన్ల సాయాన్ని ప్రకటించారు.

 • 04 Mar 2022 01:59 PM (IST)

  కేంద్ర నిర్ణయాలను ప్రశంసించిన సుప్రీం కోర్టు..

  ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకున్న చర్యలను  అభినందిస్తున్నాము అంటూ పేర్కొంది.

 • 04 Mar 2022 01:57 PM (IST)

  ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం

  ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా తదితర అధికారులు పాల్గొన్నారు.

   

 • 04 Mar 2022 01:46 PM (IST)

  7 నిమిషాల పాటు మోగిన బెర్లిన్ కేథడ్రల్‌లో ఉక్రెయిన్ బెల్

  ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలిపేందుకు బెర్లిన్ కేథడ్రల్ (బెర్లినర్ డోమ్) గంటలు మధ్యాహ్నం ఏడు నిమిషాల పాటు మోగించాయి. ఉక్రెయిన్‌పై మాస్కో దాడి ప్రారంభించిన ఏడు రోజుల తర్వాత బెర్లిన్ కేథడ్రల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

 • 04 Mar 2022 01:44 PM (IST)

  ఇప్పుడు మేల్కొనకపోతే యూరప్ నాశనమైపోతుంది.. UK PM బోరిస్ జాన్సన్

  ఉక్రెయిన్‌లోని జపోరిజియా అణు కర్మాగారం సమీపంలో బాంబు పేలుళ్ల తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జాలెన్స్కీ US అధ్యక్షుడు జో బిడెన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. UK PM బోరిస్ జాన్సన్, జర్మన్ ఛాన్సలర్ ఒలోఫ్ షుల్ట్జ్‌తో సహా చాలా మంది నాయకులను కూడా పిలిచాము. అలాగే, ఇప్పుడు మేల్కొనకపోతే యూరప్ నాశనమైపోతుందని.. అణు కర్మాగారం పేలిపోయిందని జాలెన్స్కీ తన తాజా వీడియో సందేశంలో పేర్కొన్నాడు.

   

 • 04 Mar 2022 01:41 PM (IST)

  ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలోనూ సోను సూద్‌ పేరు..

  కరోనా లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా ఎందరికో సేవలందించిన సినీనటుడు సోను సూద్‌ పేరు ఇపుడు ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలోనూ వినిపిస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత అజయ్‌సింగ్‌ ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోలో మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన ఓ మహిళ రైలు ప్రయాణం  చేస్తూ మాట్లాడారు. 'హలో.. నా పేరు సృష్టిసింగ్‌. మేమిక్కడ రైలు ఎక్కాక 'సోనూసూద్‌' బృందం మాకు మార్గదర్శకంగా ఉంటూ ఎంతో సాయం చేస్తోంది. నా చుట్టూ ఎంతమంది విద్యార్థులు కూర్చొన్నారో చూడండి. అందరూ భారతీయులే' అని ఆమె మాట్లాడారు.

 • 04 Mar 2022 01:14 PM (IST)

  దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ వాసులు కొత్త ఆలోచన..

  రాకెట్‌ వేగంతో వస్తున్న మిస్సైల్స్‌, బుల్లెట్స్‌ కాకుండా.. తుపాకుల మోత నుంచి రక్షించుకునేందుకు ఉక్రెయిన్‌ వాసులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇళ్ల మీదకు దూసుకొచ్చే.. బుల్లెట్ల తీవ్రతను తగ్గించడంతో పాటు.. అడ్డుకునేందుకు ఇసుక బ్యాగులతో అడ్డుగోడలు నిర్మించుకుంటున్నారు. ఇలాంటి నిర్మాణాలు ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఇళ్ల మధ్యనే కాదు.. రెండు ప్రాంతాల సరిహద్దుల్లోనూ ఇలాంటి ఇసుక బ్యాంగులతోనే రక్షణ చర్యలు చేపడుతున్నారు. రెండు వైపుల వాహనాల నియంత్రణతో పాటు.. రక్షణ చర్యలకు కూడా వాడుతున్నారు.

 • 04 Mar 2022 01:01 PM (IST)

  భారతీయుల తరలింపు విషయంలో రష్యా సహకారం

  భారతీయుల తరలింపు విషయంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్స్‌ను స్వదేశానికి షిఫ్ట్‌ చేసేందుకు తన వంతు సహకారం అందిస్తోంది. ఇండియన్స్‌ని ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా తీసుకొచ్చేందుకు రష్యా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. రష్యా బోర్డర్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి షిఫ్ట్‌ చేసేందుకు 130 బస్సులను సిద్ధం చేసింది.

 • 04 Mar 2022 12:10 PM (IST)

  ఉక్రెయిన్ నుంచి 17వేల మంది తరలింపు.. సుప్రీంకు తెలిపిన కేంద్రం

  ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల వివరాలను అటార్నీ జనరల్ ధర్మాసనానికి వివరించారు. ఇప్పటి వరకు 17 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న మిగతా వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పిన ఏజీ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు.

 • 04 Mar 2022 11:41 AM (IST)

  యుద్ధం ఆపేస్తే ఆక్షలు ఎత్తివేస్తాం.. రష్యాకు అమెరికా తాయిలాలు..

  రష్యాకు ఆఫర్లు ప్రకటించింది అమెరికా. యుద్ధం నిలిపివేస్తే ఆంక్షలు ఎత్తివేస్తామంటూ అమెరికా రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ విక్టోరియా నులాండ్ ప్రకటించారు.

 • 04 Mar 2022 11:36 AM (IST)

  పేలితే యూరప్ మొత్తం నాశనం..- ఉక్రెయిన్ అధ్యక్షుడు

  న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేలితే యూరప్ మొత్తం నాశనమవుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు. అణువిద్యుత్ కేంద్రంలో జరిగిన విధ్వంసం వల్ల యూరప్ నాశనం కాకూడదని అన్నారు. జపోరిజ్జియాపై దాడి తర్వాత రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

 • 04 Mar 2022 11:34 AM (IST)

  హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరిన భారత వైమానిక దళం విమానాలు

  ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తీసుకురావడానికి ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి.  IAF C-17 విమానాలను భారత వైమానిక దళం అక్కడికి పంపించింది. గత రాత్రి, ఈ ఉదయం ఆపరేషన్ గంగా కింద హిండన్ ఎయిర్‌బేస్‌కు తిరిగి వచ్చాయి.

 • 04 Mar 2022 11:28 AM (IST)

  రష్యాను అభ్యర్థించిన అమెరికా అధ్యక్షుడు..

  అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రష్యాను కోరారు. ఉక్రెయిన్ న్యూక్లియర్ సైట్‌పై తక్షణ ప్రతిచర్యకు అనుమతి ఇవ్వండి. ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్లాంట్‌కు నష్టం వాటిల్లిన చోట వాటిని సరిచేసుకునేందుకు అనుమతించాలన్నారు.

 • 04 Mar 2022 10:07 AM (IST)

  బంకర్లలో తల దాచుకోండి.. ప్రజలను ఉక్రెయిన్‌ హెచ్చరిక

  ఉక్రెయిన్‌ ప్రజలను హెచ్చరించింది అక్కడి ప్రభుత్వం. రష్యా వైమానిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉండటంతో అంతా బంకర్లలో తల దాచుకోవాలని సూచించింది. ఇప్పటికే ఒడెస్సా, బిలాసెర్‌క్వా, వొలిన్‌ఒబ్లాస్ట్‌ ప్రాంతాల్లో రష్యా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

 • 04 Mar 2022 10:06 AM (IST)

  రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్లక్ష్యం.. ప్రమాదంలో యూరప్ దేశాలు..

  రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్లక్ష్యం కారణంగా మొత్తం యూరప్‌ అభద్రతలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్. యూరప్ భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు కలిగిస్తున్నాడని అన్నారు. పరిస్థితి మరింత దిగజారకుండా చూసేందుకు బ్రిటన్ అన్ని విధాలా ప్రయత్నిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని తాను డిమాండ్ చేస్తానని.. బ్రిటన్ తక్షణమే రష్యా సన్నిహిత మిత్రదేశాలతో ఈ సమస్యను తీసుకుంటుందని బ్రిటన్ ప్రధాని చెప్పారు.

   

 • 04 Mar 2022 09:01 AM (IST)

  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం..

  ఉక్రెయిన్‌లోని అణు కర్మాగారంలో కాల్పుల ఘటన తర్వాత బ్రిటన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. యూరోప్‌లోని అతిపెద్ద జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ , పరిసర ప్రాంతాన్ని ఉక్రెయిన్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ విషయమై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తీవ్ర ప్రమాదాన్ని హెచ్చరించింది. అదే సమయంలో, మేము పరిస్థితి గురించి ఉక్రెయిన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని .. అణు విద్యుత్ ప్లాంట్ (NPP) పై షెల్లింగ్ నివేదికల గురించి కూడా తెలుసునని IAEA తెలిపింది.

 • 04 Mar 2022 08:55 AM (IST)

  అణు రియాక్టర్లు పేలితే ఇక అంతే..

  ఉక్రెయిన్‌లోని అణు రియాక్టర్లను ఢీకొంటే తీవ్ర ప్రమాదం తప్పదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ హెచ్చరించింది. IAEA డైరెక్టర్-జనరల్ రాఫెల్ మరియానో ​​గ్రాస్సీ ఉక్రేనియన్ ప్రధాన మంత్రి డెనిస్ శ్యాగల్ , ఉక్రేనియన్ న్యూక్లియర్ రెగ్యులేటర్ , ఆపరేటర్‌తో అణు విద్యుత్ ప్లాంట్‌లోని భయంకరమైన పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. IAEA కూడా బలప్రయోగాన్ని ఆపాలని రష్యా సైన్యానికి విజ్ఞప్తి చేసింది.

 • 04 Mar 2022 08:45 AM (IST)

  జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌ను చుట్టుముట్టిన రష్యన్ సైన్యం..

  యూరప్‌లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రమైన జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ ఉన్న ప్రాంతాన్ని రష్యా సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. ఈ విషయంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ( IAEA)  ట్వీట్ చేసింది .  IAEA పరిస్థితి గురించి ఉక్రేనియన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. అణు విద్యుత్ ప్లాంట్ (NPP) పై షెల్లింగ్ లోని పరిస్థితిపై చర్చలు జరుపుతోంది. 

 • 04 Mar 2022 08:45 AM (IST)

  అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా సైన్యం కాల్పులు.. పేలితే చెర్నోబిల్ కంటే 10 రెట్లు అధిక ప్రమాదం

  యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ అయిన జపోరిజియా ఎన్‌పిపిపై రష్యా దళాలు అన్ని వైపుల నుంచి కాల్పులు జరుపుతోంది. ఈ వివరాలను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా వెల్లడించారు. ప్లాంట్ ఇప్పటికే మంటల్లో చిక్కుకుందని తెలిపారు. అది పేలినట్లయితే, అది చెర్నోబిల్ కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంటుందని హెచ్చరించారు.

 • 04 Mar 2022 08:02 AM (IST)

  కైవ్ నుంచి వస్తున్న విద్యార్థిపై కాల్పులు జరిపి.. తిరిగి కైవ్‌కు తీసుకెళ్లారు.. - కేంద్ర మంత్రి

  ఈ రోజు కైవ్ నుంచి వస్తున్న విద్యార్థిపై కాల్పులు జరిపి.. తిరిగి కైవ్‌కు తీసుకెళ్లినట్లు తెలిసిందని అన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్. పోలాండ్‌ వేదికగా జరుగుతున్న ఆపరేషన్ గంగాలో భాగంగా విద్యార్థుల తరలింపును పర్యవేక్షిస్తున్నారు కేంద్ర మంత్రి. అయితే అత్యంత వేగంగా భారతీయ విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. 

 • 04 Mar 2022 07:23 AM (IST)

  పుతిన్ వాదనను తోసిపుచ్చిన భారత్

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖార్కివ్‌లో ఉక్రెయిన్ సైన్యం మూడు వేల మందికి పైగా భారతీయ విద్యార్థులను బందీలుగా పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, పుతిన్ చేసిన ఈ వాదనను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఉక్రెయిన్ నుంచి భారతీయుల స్వదేశానికి మిషన్ కొనసాగుతోంది. అర్థరాత్రి, దాదాపు 700 మంది విద్యార్థులు వైమానిక దళం, ఎయిర్ ఇండియా విమానాల ద్వారా దేశానికి తిరిగి వచ్చారు. రేపు అంటే మార్చి 5 నాటికి మరో 15 వేల మంది పిల్లలను తరలించే యోచనలో ఉంది.

 • 04 Mar 2022 07:16 AM (IST)

  మరో కీలక రేవు పట్టణం మారిపోల్‌‌పై బాంబుల దాడి

  ఖర్కీవ్ నుంచి మరో కీలక రేవు పట్టణం మారిపోల్‌‌పై దాడిని మొదలు పెట్టింది. ఈ నగరం కూడా బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. అక్కడి పవర్ హౌస్‌లతోపాటు ఇతర మౌలిక సదుపాయాలే టార్గెట్‌గా బాంబుల వర్షం కురుస్తోంది. కరెంటు లేక నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆహారం, తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. టెలిఫోన్‌ సేవలు కూడా దాదాపుగా స్తంభించిపోయాయి.

 • 04 Mar 2022 07:12 AM (IST)

  లొంగిపోయిన తొలి నగరం.. రష్యాకు సహకరించాలని ప్రకటించిన మేయర్..

  యుద్ధం మొదలైన 8 రోజుల తర్వా ఓ నగరాన్ని రష్యా సైన్యం పూర్తి స్థాయిలో లొంగదీసుకుంది. 3 లక్షల జనాభా ఉండే కీలకమైన రేవు పట్టణమైన ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యం ప్రకటన చేసింది. స్థానిక పాలనా యంత్రాంగం కూడా ఈ విషయాన్ని  ధ్రువీకరించింది. బేషరతుగా లొంగిపోయి రష్యా సైన్యానికి సహకరించాలంటూ స్థానిక ప్రజలకు ఖర్కీవ్ నగర మేయర్‌ పిలుపునిచ్చారు.

Published On - Mar 04,2022 6:57 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu