- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips in telugu These Vastu Tips Will Help You Get Married Soon
Vastu Tips: వివాహానికి అడ్డంకులు వస్తుంటే.. ఈ వాస్తు చిట్కాలు ప్రయత్నించండి.. త్వరలో వివాహ యోగం కలుగుతుంది
Vastu Tips: వివాహం విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటే.. ఒకొక్కసారి వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు. దీంతో కొన్ని వాస్తు నివారణల చిట్కాలను ప్రయత్నించవచ్చు. దీంతో వివాహంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చేబుతోంది.
Updated on: Mar 04, 2022 | 11:05 AM

మీకు త్వరలో వివాహం కావాలంటే. నిద్రించే మంచం కింద ఏ ఇనుప వస్తువును పెట్టకండి.. ఇలా ఇనుప వస్తువులను పెట్టుకుని నిద్రపోకండి. అంతేకాదు గదిని శుభ్రంగా ఉంచండి..దీంతో సానుకూల శక్తి గదిలో ప్రసారమవుతుంది.

ముఖ్యంగా బెడ్ రూమ్ ఎప్పుడూ నైరుతి దిశలో ఉండకూడదు. ఇలా ఉంటే వివాహం ఆలస్యం కావడానికి కారణం కావచ్చు. వాస్తు ప్రకారం, నిద్రించే గది వాయువ్య దిశలో ఉండాలి. వివాహం చేసుకోబోయే అబ్బాయిలు, అమ్మాయిలు ఉత్తరం వైపు పాదాలు ఉంచి నిద్రించడం శ్రేయస్కరం.

మీ బెడ్ రూమ్ లో గోడ రంగు కూడా జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కనుక చిన్న మార్పు మీ జీవితంలో సానుకూల శక్తిని తీసుకురాగలదు. గోడలకు పాస్టెల్ పింక్ షేడ్స్‌లో పెయింట్ చేసుకోండి. అయితే నలుపు లేదా గోధుమ రంగు పెయింట్ , లేదా వాల్‌పేపర్‌లకు దూరంగా ఉండండి.

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో దూలం కింద పడుకోకూడదు. ఇలా నిద్రపోవడం వలన ఆ వ్యక్తి మానసిక ఒత్తిడికి గురవుతారు. ముఖ్యంగా ఇంటిలోని దూలం కింద ఉంచిన మంచంపై పడుకునే వ్యక్తి... వివాహంలో అడ్డంకులు, ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఎల్లప్పుడూ బాత్రూమ్ తలపులు మూసి ఉంచండి. బాత్రూమ్ ని ఉపయోగించిన అనంతరం బాత్రూమ్ తలుపును తెరిచి ఉంచవద్దు. ముఖ్యంగా ఇంట్లో బాత్రూమ్ మీ గదిలో ఉంటే.. తలుపును ఎప్పుడూ తెరిచి ఉంచవద్దు. Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)





























