- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips follow these vastu rules during taking food for success and peace in home in telugu
Vastu Tips: ఇంట్లో అభివృద్ధి, ఆనందం కోసం ఆహారం తినేటప్పుడు ఈ నియమాలను పాటించండి..
Vastu Tips: ఇంట్లో సంతోషం, శాంతి, సౌభాగ్యాల నెలకొలని.. తాము అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొంతమంది ఎంత కృషి చేసినా.. తగిన ఫలితం దక్కదు. దీనికి కారణం వాస్తు దోషం ఉండవచ్చు. ఈరోజు ఇంట్లో సంతోషం, అభివృద్ధి కోసం భోజనం చేసేటప్పుడు ఎలాంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Updated on: Mar 05, 2022 | 10:40 AM

తూర్పు దిశ: తూర్పు దిశగా ముఖం పెట్టుకుని ఆహారం తీసుకుంటే శారీరక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. అంతేకాదు ఎవరైనా ఒత్తిడిని అంటే మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటే.. అటువంటి వ్యక్తులు ఉపశమనం పొందుతారు. వాస్తు ప్రకారం.. తూర్పు దిశలో ఆహారం తీసుకోవడం ద్వారా, శరీరం, మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. మానసిక ఆనందం ఉంటుంది. అందుకనే ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారిని తూర్పు ముఖంగా తినమని పెద్దలు చెబుతుంటారు. అంతేకాదు ఔషధాలను సేవించే సమయంలో కూడా తూర్పు ముఖం పెట్టుకుంటారు.

ఉత్తర దిశ: ఈ దిక్కున ముఖం పెట్టుకుని ఆహారాన్ని తినడం వల్ల సంపదలు చేకూరుతాయి. అంతేకాదు ఎవరైనా డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నా.. నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లయితే,ఇలా ఆహారం తినడం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ వాస్తు నియమాన్ని పాటించడం వల్ల చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగి వ్యాపారంలో విజయం లభిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలు ఉత్తరాభిముఖంగా భోజనం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది వారి మనస్సును ప్రశాంతపరుస్తుంది. అంతేకాదు తమ చదువుపై దృష్టి పెట్టగలుగుతారని పెద్దలు చెబుతారు.

పశ్చిమ దిశ: తూర్పు , ఉత్తరం వైపు కాకుండా, పడమర ముఖంగా విందు చేస్తే, అది కూడా చాలా శుభప్రదమని చెబుతారు. ఉద్యోగాలు చేసే వారు ఇలా చేస్తే ప్రమోషన్, ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే క్రియేటివ్ రంగంలో పనిచేసే వారు కూడా పడమర ముఖంగా ఆహారం తీసుకోవాలి. ఈ పద్ధతిని అవలంబించడం ద్వారా, వారు తమ రంగంలో కొత్త అవకాశాలను పొందుతారు.

నేలమీద ఆహారం తినడం మంచిది. ప్రతి ఒక్కరూ తినే ఆహారాన్ని గౌరవించాలి. అందుకనే ఆహారం తినే సమయంలో నేలపై కూర్చొని తినాలని గ్రంధాలలో చెప్పారు. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా తినే ఆహారం పద్దతిలో కూడా మార్పులు వచ్చాయి. నెల మీదనుంచి .. డైనింగ్ టేబుల్ కు మారిన పద్దతి ఇప్పుడు బెడ్‌పైకి చేరింది. ప్రస్తుతం మంచం మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. వాస్తు ప్రకారం.. ఇది ఆ శుభం..ఇలా తినడం వలన ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు పడతారు. పూర్వకాలంలో ప్రజలు నేలపై కూర్చొని ఆహారాన్ని తినేవారు. ఇది చాలా పవిత్రమైనదిగా ఇప్పటికీ పరిగణించబడుతుంది Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.).





























