AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Sugar: ద్రాక్ష తినడం వల్ల డయాబెటిస్‌ ఉన్నవారిలో చక్కెర పెరుగుతుందా..? నిజం ఏమిటో తెలుసుకోండి..

మధుమేహం(Diabetes) అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. కొన్ని పండ్లలో చక్కెర శాతం ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం అని ప్రజలు తరచుగా నమ్ముతారు. అయితే, కొన్ని విషయాలను దృష్టిలో..

Blood Sugar: ద్రాక్ష తినడం వల్ల డయాబెటిస్‌ ఉన్నవారిలో చక్కెర పెరుగుతుందా..? నిజం ఏమిటో తెలుసుకోండి..
Blood Sugar Can Eating Grap
Sanjay Kasula
|

Updated on: Mar 04, 2022 | 7:55 AM

Share

మధుమేహం(Diabetes) అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. కొన్ని పండ్లలో చక్కెర శాతం ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం అని ప్రజలు తరచుగా నమ్ముతారు. అయితే, కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని పండ్లను ఆస్వాదించవచ్చు. ద్రాక్ష(Grapes) చాలా అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ద్రాక్షలో విటమిన్లు సి, కె, బి6 ఉన్నాయి. అలాగే థయామిన్, రైబోఫ్లావిన్, పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ కె రక్తాన్ని చిక్కగా చేస్తుంది. అయితే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ మూలం. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ద్రాక్షను తినకూడదని అనుకుంటారు. ఎందుకంటే ఇందులో గ్లైకోమెటిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ నల్ల ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉందని, అవి చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నల్ల ద్రాక్ష శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుందని అనేక పరిశోధనలలో నిరూపించబడింది. దీని కారణంగా శరీరం దాని పెరిగిన చక్కెరను జీర్ణం చేయడం ప్రారంభిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అయితే, ద్రాక్షను తినేటప్పుడు ఒక రోజులో ఎక్కువ నల్ల ద్రాక్షను తినకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.. ఎందుకంటే నల్ల ద్రాక్షను అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది.

బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం.. మొత్తం పండ్లు, యాపిల్స్, బ్లూబెర్రీస్, ద్రాక్షలను తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఇది కాకుండా, రెస్వెరాట్రాల్ అనేది ఒక రసాయన సమ్మేళనం.. ఇది భోజనం తర్వాత శరీరం చక్కెరను నియంత్రిస్తుంది. ద్రాక్షలో రెస్వెరాట్రాల్ ఉంటుంది. తద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

నల్ల ద్రాక్షలో ఉండే లుటిన్, జియాక్సంతిన్ అనే కెరోటినాయిడ్ మూలకాలు మధుమేహం కారణంగా కంటి సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తాయని మీకు తెలియజేద్దాం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నల్ల ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. కళ్ళు లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live Updates: ఉగ్రరూపు దాల్చిన యుద్ధం.. రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్‌ నగరం