Parenting Tips: మీ పిల్లలు ఎక్కువ సమయం టీవీ చూస్తున్నారా ? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
పిల్లలు (Childrens) ఎక్కువ సమయం టీవీ చూడడం ఆరోగ్యానికి ప్రమాదకరమని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం రోజుల్లో పిల్లలు టీవీ (TV) చూడడం మరింత పెరిగిపోయింది
పిల్లలు (Childrens) ఎక్కువ సమయం టీవీ చూడడం ఆరోగ్యానికి ప్రమాదకరమని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం రోజుల్లో పిల్లలు టీవీ (TV) చూడడం మరింత పెరిగిపోయింది. నిత్యం గంటలు గంటలు టీవీ ముందే కూర్చోవడం.. సరైన ఆహారం తినకపోవడం వలన వారు అలసిపోయినట్లుగా కనిపిస్తుంటారు. ఇక కరోనా వైరస్ ప్రభావం.. ఇప్పుడు పిల్లలందరూ.. ఆన్ లైన్ క్లాసెస్ వింటున్నారు. ఓవైపు ఆన్ లైన్ క్లాసులు.. మరోవైపు గంటల సమయం టీవీలు చూడడం వలన వారి కంటిపై ఎక్కువగా ఒత్తిడి ఏర్పడుతుంది. అంతేకాకుండా.. పలు రకాల అనారోగ్య సమస్యలు పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తాయి. పిల్లలను టీవీలను దూరంగా ఉంచాలని ఎంతగా ట్రై చేసిన వీలు కావడం లేదని.. ప్రస్తుత రోజుల్లో వారిని టీవీ, ఫోన్ వంటి వస్తువులకు దూరంగా ఉంచడం చాలా కష్టంతో కూడుకున్న పని అంటూ తల్లిదండ్రుల వాదన. అయితే పిల్లలు ఎక్కువగా టీవీ చూస్తున్నప్పుడు వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా.
మీ పిల్లలు గంటలు గంటలు టీవీ ముందు కూర్చుంటే.. వారి కళ్లతోపాటు.. మెదడుపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే దాదాపు ఒక గంట టీవీ చూస్తే ఆ తర్వాత వారు వేరే పనిలో నిమగ్నమయ్యేలా చేయండి. గంట తర్వాత టీవీ నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. అలాగే.. పిల్లలు టీవీ స్క్రీన్కు చాలా దగ్గరగా కూర్చుని టీవీ చూస్తే.. వారి కళ్లపై ప్రభావం చూపుతుంది. దీంతో డ్రై ఐ సమస్య కూడా కనిపిస్తుంది. అందుకే టీవీ చూస్తున్నప్పుడు మీ పిల్లలు స్క్రీన్కు దూరంగా ఉండేలా చేయండి.
ఇవే కాకుండా. పిల్లలు చాలాసార్లు బెడ్ పై పడుకుని.. తప్పుగా కూర్చుని టీవీ చూస్తుంటారు. దీంతో వెన్నునొప్పి, మెడ, భుజం నొప్పి సమస్యలు వస్తాయి. అందుకే వారు నేరుగా కుర్చీపై కూర్చోని టీవీ చూసేలా చేయండి. అలాగే.. వారు కూర్చున్నప్పుడు వెనకాల ఒక దిండు లేదా టవల్ పెట్టండి.. దీనివలన టీవీ చూస్తూ ఎక్కువసేపు కూర్చోవడం వలన వెన్నునొప్పి సమస్య రాకుండా ఉంటుంది. అలాగే ప్రతి గంట గంటకు టీవీ ఆఫ్ చేయాలి. గంట తర్వాత పిల్లలను టీవీ చూడకుండా చేయాలి. టీవీ చూసేటప్పుడు సమయం చాలా ముఖ్యం. ఎక్కువ సమయం పిల్లలు స్క్రీన్ ముందు ఉండడం వలన కంటి సమస్యలు వస్తాయి. టీవీ చూసిన తర్వాత మీ పిల్లలకు శారీరక శ్రమ కల్పించండి.. గేమ్స్ ఆడడం.. రన్నింగ్, వాకింగ్ చేయడం నేర్పించాలి. అలాగే టీవీ చూస్తున్నప్పుడు పిల్లలు ఉన్న గదిలోని లైట్స్ ఆఫ్ చేయకూడదు. ఇలా చేయడం వలన కేవలం టీవీ స్క్రీన్ పిల్లల కంటిపై నేరుగా పడుతుంది. అలగే ఆహారం తింటూ పిల్లలు టీవీ అస్సలు చూడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి.
Also Read: Samantha: సమంతకు దూకుడెక్కువ.. షాకింగ్ విషయాలను చెప్పిన ట్రైనర్ జునైద్..
Srivalli Song: శ్రీవల్లీ సాంగ్ బెంగాలీ వెర్షన్ విన్నారా ?.. అదిరిపోయిందిగా..
Ajith: వలిమై తర్వాత స్టైల్ మార్చిన అజిత్.. న్యూలుక్ అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్..
Bhagya shree : ప్రభాస్ వాటిని బాగా మెయింటేన్ చేస్తాడు.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన బాలీవుడ్ నటి