AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫ్ఘనిస్తాన్ పై చర్చకు మూడు దేశాలకు రష్యా ఆహ్వానం.. ఇండియాకు మొండిచెయ్యి

తాలిబన్లు, ఆఫ్ఘన్ దళాల మధ్య పోరుతో రోజురోజుకూ ఉద్రిక్తమవుతున్న ఆఫ్గనిస్తాన్ లో శాంతి నెలకొనేలా చూసేందుకు, ఉభయ పక్షాల మధ్య రాజీ కుదిరేలా చూడడానికి రష్యా చడీచప్పుడు లేకుండా రంగంలోకి దిగింది.

ఆఫ్ఘనిస్తాన్ పై చర్చకు మూడు దేశాలకు రష్యా ఆహ్వానం.. ఇండియాకు మొండిచెయ్యి
Vladimir Putin
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Aug 05, 2021 | 6:11 PM

Share

తాలిబన్లు, ఆఫ్ఘన్ దళాల మధ్య పోరుతో రోజురోజుకూ ఉద్రిక్తమవుతున్న ఆఫ్గనిస్తాన్ లో శాంతి నెలకొనేలా చూసేందుకు, ఉభయ పక్షాల మధ్య రాజీ కుదిరేలా చూడడానికి రష్యా చడీచప్పుడు లేకుండా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా అమెరికా, చైనా., పాకిస్తాన్ దేశాలకు ఆహ్వానం పంపింది. కానీ ఇండియాకు మాత్రం ఈ ఆహ్వానం అందలేదు. ఈ నెల 11 న ఖతార్ లో ఈ దేశాల మధ్య ఆఫ్ఘన్ పరిస్థితిపై చర్చలు జరగనున్నాయి. ఆ దేశంలో శాంతి పునరుద్ధరణకు ‘మాస్కో ఫార్మాట్’ తరహాలో చర్చలు జరపాలని కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్ లో పరిస్థితి మెరుగుదలకు ఇండియాతో బాటు ఇతర దేశాలతోనూ సంప్రదింపులు కొనసాగిస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ గత నెలలో తాష్కెంట్ లో తెలిపారు. దీంతో రానున్న సమావేశాల్లో ఇండియాను కూడా చేరుస్తారన్న ఊహాగానాలు తలెత్తాయి. కానీ తాజా పరిణామాలను బట్టి చూస్తే కీలకమైన ఈ అంశంపై పుతిన్..అమెరికా, చైనా. పాకిస్థాన్ దేశాలను మాత్రం ఆహ్వానించడం, ఇండియాను పక్కన బెట్టడం విడ్డూరంగా కనిపిస్తోంది.

నిజానికి ఆఫ్గనిస్తాన్ దేశానికి ఇండియా ఎంతగానో సహకరిస్తోంది. ఈ దేశంలో వేలాది ఆఫ్ఘన్ విద్యార్థులు చదువుకుంటున్నారు.వారికి భారత ప్రభుత్వం స్కాలర్ షిప్ లను మంజూరు చేస్తోంది. అవసరమైతే తాలిబాన్లపై పోరులో ఆఫ్ఘన్ దళాలకు సాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. అలాంటిది రష్యా మన దేశాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని, అయితే ఆ దేశం తన వైఖరి మార్చుకోగలదని ఆశిస్తున్నామని విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Covid Cases: పెరిగిపోతున్న డెల్టా వేరియంట్ కేసులతో చైనా విలవిల.. జనాభాలో దాదాపు సగం మందికి !

Viral Video : పాముకి ఎలుకను తినిపిస్తున్న వ్యక్తి ..! వీడియో చూస్తే షాక్ అవుతారు..