Russia-Ukraine War: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా.. ఈ విమానం ప్రత్యేకత ఏమిటి..?
Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య సయోధ్య కుదరదనేంతగా పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌లో రష్యా చేసిన విధ్వంసంలో ప్రపంచంలోనే..
Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య సయోధ్య కుదరదనేంతగా పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌లో రష్యా చేసిన విధ్వంసంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం కూడా ఉంది. రష్యా (Russia) సైన్యం ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఆంటోనోవ్ AN-225 మ్రియా (Antonov AN 225 Mriya)ను ధ్వంసం చేసిందని ఉక్రెయిన్ (Ukraine) విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎక్కడ తయారు చేయబడిందో తెలుసుకుందాం.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. 290 అడుగుల రెక్కల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతి పెద్ద విమానాన్ని 1980లో కీవ్‌లోని ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో కంపెనీ తయారు చేసింది. దీని తయారీ లక్ష్యం సరుకుల రవాణా. దీనిని సైనికులు కొంతకాలం ఉపయోగించారు. తరువాత ఇది అనేక దేశాలకు సహాయ సామగ్రిని పంపడానికి ఉపయోగించారు. ఈ విమానం 640 టన్నుల బరువును ఎత్తగలదు. ఇది మొదటిసారిగా 1988లో ప్రయాణించింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం పొరుగు దేశాలలో విపత్తు సమయంలో ఆహార పదార్థాలను పంపిణీ చేయడానికి ఉపయోగించబడింది. కరోనా మహమ్మారి ప్రారంభ దశలో, వైరస్ బారిన పడిన అనేక దేశాలకు మందులు, వైద్య పరికరాలను పంపిణీ చేయడానికి దీనిని ఉపయోగించారు.
ఈ విమానంపై రష్యా ఎందుకు దాడి చేసిందోననే సందేహాలు కలుగవచ్చు. నాలుగైదు రోజులుగా రష్యా ఉక్రెయిన్‌లోని ప్రతి రహస్య స్థావరాన్ని ధ్వంసం చేయడంలో ముందుంది. అందుకే ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసే పనిలో రష్యా బిజీగా ఉంది. ఉక్రెయిన్‌లోని హాస్టోమెల్ ఎయిర్‌ఫీల్డ్‌ను రష్యా స్వాధీనం చేసుకుంది. అక్కడ మరమ్మతుల కోసం ఏఎన్-225ను ఏర్పాటు చేశారు. దీంతో రష్యా సైనికులు ఈ విమానంపై దాడి చేసి ధ్వంసం చేశారు. AN-225 మరియా ఉక్రెయిన్ బలానికి చిహ్నం కాబట్టి రష్యా ఈ విమానాన్ని ధ్వంసం చేసింది. ఈ విమానం ధ్వంసమైన తర్వాత ఈ విమానం నిలిపి ఉంచిన ప్రదేశంలో ఉపగ్రహ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ విమానం పోయినా, దేశంలో విధ్వంసం జరిగినా.. ఓడిపోబోమని, మళ్లీ కొత్త దేశాన్ని నిర్మిస్తామని ఉక్రెయిన్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి: