India-Russia: మరోసారి భారత్ అండగా నిలిచిన రష్యా.. UNO వేదికగా మద్దతు పలికిన ఫారెన్ మినిస్టర్..
India-Russia: భారత్‌కు మరోసారి బాసటగా నిలిచింది రష్యా. భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు రష్యా ఫారెన్ ఎఫైర్స్ మినిస్టర్ లావ్రోవ్.

India-Russia: భారత్‌కు మరోసారి బాసటగా నిలిచింది రష్యా. భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు రష్యా ఫారెన్ ఎఫైర్స్ మినిస్టర్ లావ్రోవ్. అవును, రష్యా – భారత్ మధ్య ధృడమైన ద్వైపాక్షిక బంధం మరోసారి నిరూపితమైంది. ఐక్యరాజ్యసమితి వేదికగా.. రష్యా ఫారెన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్ భారత్‌కు అండగా నిలిచారు. భద్రాతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. భారత్‌తోపాటు బ్రెజిల్‌కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా అన్నిరంగాల్లో దూసుకుపోతున్న భారత్, బ్రెజిల్‌కు భద్రతామండలిలో చోటుదక్కించుకునే అన్ని అర్హతలున్నాయన్నారు లావ్రోవ్. భారత్‌కు తమ మద్దతునే బాహటంగా ప్రకటించారు.
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సభలో ప్రసంగించిన లావ్రోవ్.. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పిస్తే భద్రతామండలిలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రముఖ పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. భద్రతామండలిలో ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. మండలిలో ప్రస్తుతం తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న భారత్‌కు.. శాశ్వత హోదానే తమ లక్ష్యమని లావ్రోవ్ తేల్చిచెప్పారు. పాశ్చాత్య దేశాలకు మండలిలో ప్రాతినిధ్యంపైనా స్పందించారు. వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ.. అమెరికాకే మద్దతు పలుకుతాయన్న లావ్రోస్.. వాటికి ప్రాతినిధ్యం పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. భద్రతామండలిలో ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. రెండేళ్లకోసారి 10 తాత్కాలిక సభ్య దేశాలను ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ద్వారా ఎన్నుకుంటారు. ఈ గడువు రానున్న డిసెంబరుతో ముగియనుంది. ఈ సారైనా.. భారత్ మండలిలో శాశ్వత సభ్యత్వం దొరుకుతుందా అన్నది ఉత్కంఠగా మారింది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
