Telugu News World Rticles have revealed that Russian President Putin's health has deteriorated
Putin: మరింతగా క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం.. నిలబడలేక, వణుకుతూ.. వీడియో వైరల్
రష్యా - ఉక్రెయిన్(Russia - Ukraine) యుద్ధం నేపథ్యంలో అందరి దృష్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ పై పడింది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వివిధ కథనాలు కూడా వచ్చాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు....
రష్యా – ఉక్రెయిన్(Russia – Ukraine) యుద్ధం నేపథ్యంలో అందరి దృష్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ పై పడింది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వివిధ కథనాలు కూడా వచ్చాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వస్తుండటంతో ఆయనకు ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆయన ఎక్కువ రోజులు బతికి ఉండలేరని ఇప్పటికే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్(Putin) తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని, రక్త క్యాన్సర్‌తో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని గత నెలలో వార్తలు వచ్చాయి. తాజాగా క్రెమ్లిన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. నిలబడలేక ఇబ్బంది పడుతున్నట్లు, వణుకుతున్నట్లు (షేక్) కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా(Video Viral) మారింది. రష్యాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తి ఒకరు పుతిన్ ఆరోగ్యంపై స్పందిస్తూ.. పుతిన్ రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గత నెలలోనే తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆయన ప్రత్యేకంగా ఓ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది.
Putin’s legs shaking, he looks unsteady on his feet, fueling more speculation about his health. Video was taken Sunday. pic.twitter.com/TIVfK30tAp
రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స చేయించుకునేందుకు నిరంతరం వైద్యుల సమక్షంలోనే ఉంటున్నారని గతంలో బ్రిటిష్ గూఢచారి అన్నారు. వైద్యం కోసం ఆయన తరచుగా సమవేశాలకు రాకపోవడం, వచ్చినా మధ్యలో విరామం తీసుకోవడం వంటివి చేస్తారని చెప్పారు. అయితే.. పుతిన్ అనారోగ్యం గురించి కచ్చితమైన వివరాలు ఇంకా తెలియలేదని ఆయన వెల్లడించారు. “పుతిన్(Putin) తీవ్ర అనారోగ్యంలో బాధపడుతున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఎంత వరకు ఆయన ఆరోగ్యం క్షీణించింది అనే విషయాలు తెలియరాలేదు. ఆయన అనారోగ్యం రష్యా పాలనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని” బ్రిటీష్ గూఢచారి వెల్లడించారు.