AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Adani Row: ‘స్టాప్‌ అదానీ’ స్లోగన్‌తో సోషల్ మీడియా షేక్.. భారీ నిరసన ప్రదర్శనకు లంకేయుల ప్లాన్స్..!

Sri Lanka Adani Row: 'స్టాప్‌ అదానీ'.. ఇప్పుడీ పదం శ్రీలంకలో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ స్లోగన్‌. ఈ నినాదంతోనే ఇవాళ భారీ నిరసనలకు ప్లాన్‌ చేశారు లంకేయులు.

Sri Lanka Adani Row: ‘స్టాప్‌ అదానీ’ స్లోగన్‌తో సోషల్ మీడియా షేక్.. భారీ నిరసన ప్రదర్శనకు లంకేయుల ప్లాన్స్..!
Stop Adani
Shiva Prajapati
|

Updated on: Jun 16, 2022 | 6:25 AM

Share

Sri Lanka Adani Row: ‘స్టాప్‌ అదానీ’.. ఇప్పుడీ పదం శ్రీలంకలో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ స్లోగన్‌. ఈ నినాదంతోనే ఇవాళ భారీ నిరసనలకు ప్లాన్‌ చేశారు లంకేయులు. భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ గ్రూప్‌పై శ్రీలంకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టేందుకు ప్లానింగ్‌ జరుగుతోంది. లంకలో సోషల్‌ మీడియా అంతా ఈ నిరసన పిలుపులు, వాటి ప్లానింగ్‌తో మోతెక్కుతోంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి తేవడంతో విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను అదానీకి కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో అదానీ గ్రూప్‌పై లంకలో నిరసనలు మొదలయ్యాయి.

సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ చైర్మన్‌ MMC ఫెర్నాండోతో ఈ వివాదం రాజుకుంది. విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్‌గా అదానీకి ఇవ్వాలని మోదీ ఒత్తిడి చేస్తున్నట్టు రాజపక్స తనతో చెప్పారని ఫెర్నాండో బయటపెట్టారు. పార్లమెంటరీ కమిటీ ముందు ఫెర్నాండో ఈ విషయం చెప్పారు. ఫెర్నాండో ఆరోపణలను ప్రెసిడెంట్‌ రాజపక్స తీవ్రంగా ఖండించారు. తర్వాత రోజు ఫెర్నాండో కూడా మాట మార్చారు. తన పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పటికే ఫెర్నాండో వ్యాఖ్యలు నిప్పు రాజేశాయి. అసలే లంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ఈ వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేసింది అదానీ గ్రూప్‌. పొరుగు దేశమనే, శ్రీలంక ప్రజల అవసరాలు తీర్చాలనే అక్కడ పెట్టుబడి పెట్టాలని అనుకున్నామని అదానీ గ్రూప్‌ ప్రతినిధి చెప్పారు. మరోవైపు, లంకలో నిరసనకారులు వాళ్ల ప్లానింగ్‌లో వాళ్లు ఉన్నారు. ‘స్టాప్‌ అదానీ’ పేరిట నిరసన ఉద్యమానికి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కొలంబోలోని మేజిస్టిక్‌ సిటీ వద్దకు తరలి రావాలని సోషల్‌ మీడియాలో పిలుపునిచ్చారు.