AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: బ్రెజిల్‌లో ప్రధాని మోదీ పర్యటన.. 144 గుర్రాలతో అపూర్వ స్వాగతం..

ఐదు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు. బ్రిక్స్‌ సమావేశం తర్వాత బ్రెజిల్‌ రాజధాని అయిన బ్రెజిలియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆదేశ అధ్యక్షుడి అధికార నివాసమైన అల్వోరాడా ప్యాలెస్‌లో 114 గుర్రాల ఊరేగింపుతో ఘన స్వాగతం లభించింది. భారతదేశం-బ్రెజిల్ సంబంధాలను మరింతగా బలోపేతం చేసే లక్ష్యంతో 57 సంత్సరాల తర్వాత బ్రెజిల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు.

PM Modi: బ్రెజిల్‌లో ప్రధాని మోదీ పర్యటన.. 144 గుర్రాలతో అపూర్వ స్వాగతం..
PM Modi in Brasília
Anand T
|

Updated on: Jul 08, 2025 | 9:47 PM

Share

బ్రెజిల్‌ అధ్యక్షుడు పిలుపు మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రెజిలియా రాజధాని నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తమ దేశానికి వచ్చిన ప్రధాని మోదీకి 114 గుర్రాల ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు. జూలై 6 నుండి 7 వరకు రియో ​డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం తర్వాత, అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రెజిల్‌ను సందర్శిస్తున్నారు. భారతదేశం-బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, బ్రిక్స్ ఫ్రేమ్‌వర్క్ కింద బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ పర్యటన కొత్త ప్రోత్సాహాన్ని సూచిస్తుందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో, ఉరుగ్వే నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, డిజిటల్ చెల్లింపులు, సాంప్రదాయ వైద్యం, స్థిరమైన అభివృద్ధితో సహా విస్తృత శ్రేణి రంగాలపై వారితో ప్రధాని మోదీ చర్చించారు. ఆయుర్వేదం, విపత్తు సంసిద్ధత, యూపీఐ పేమెంట్స్ టెక్నాలజీ , సామర్థ్య నిర్మాణంలో సహకారాన్ని విస్తరించాలని ఇరువురు నాయకుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రంగాలు రెండు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య సమ్మిళిత అభివృద్ధి, సాంకేతిక సహకారం కోసం ఉమ్మడి దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

చారిత్రాత్మక సందర్శన..

1968 తర్వాత మొదటిసారిగా ఒక భారత ప్రధాన మంత్రి బ్రెజిల్‌కు ద్వైపాక్షిక రాష్ట్ర పర్యటన చేపట్టారు. ప్రధాని మోదీ హాజరు భారతదేశం-బ్రెజిల్ సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, లాటిన్ అమెరికా అంతటా వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను కూడా ఉట్టిపడుతుంది. ఈ పర్యటన రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి, సాంస్కృతిక మార్పిడిలో విస్తృత సహకారానికి మార్గం సుగమం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.