మిలాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం.. ఫ్లైట్ ఇంజన్‌లో ఇరుక్కుని వ్యక్తి మృతి!
ఇటలీ మిలాన్ బెర్గామో ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో గ్రౌండ్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న 30 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు విమానం ఇంజిన్‌లోకి పడి మృతి చెందాడు. మంగళవారం ఉదయం 10.20 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బాధితుడు ఫ్లైట్ టేకాఫ్ అవుతున్న సమయంలో దానికి ఎదుగురా పరిగెత్తినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఇటలీ మిలాన్ బెర్గామో ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో గ్రౌండ్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న 30 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు విమానం ఇంజిన్‌లోకి పడి మృతి చెందాడు. స్థానిక మీడియా నివేదికల వివరాల ప్రకారం.. ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ వర్కర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల వయస్సు ఓ వ్యక్తి స్పెయిన్‌లోని అస్టురియాస్‌కు వెళ్లే ఎయిర్‌బస్ A319 వోలోటియా విమానం రన్‌వే నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో దానికి సమీపంగా పరిగెత్తినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో విమానం టేకాఫ్ అవుతుండగా వీచే గాలి వేగానికి అతని లాగబడి ఇంజన్‌లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమై వెంటనే విమాన ఇంజన్‌ను నిలిపి వేశారు.
We regret to confirm flight V73511 from BGY-OVD was involved in an incident at Milan-Bergamo Airport at 10:35h. One person not onboard and not affiliated with the company was seriously injured. All 154 passengers and 6 crew are safe. A new flight is scheduled for 15:55.
— Volotea (@volotea) July 8, 2025
హుటాహుటిన విమానం దగ్గరకు చేరుకొని, ఇంజిన్‌ను ఇరుక్కున్న వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. అక్కడి నుంచి హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఆరుగురు ఉద్యోగులు, ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారని ఎయిర్‌పోర్ట్ అధికారులు ఓ ఎక్స్ పోస్ట్ ద్వారా ధృవీకరించారు. ఏయిర్ పోర్టులో జరిగిన ప్రమాదం కారణంగా కొన్ని గంటలపాటు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
