AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Maldives: మాల్దీవులకు భారత్‌ రూ.4,850 కోట్ల రుణం… రెండు దేశాల మధ్య చారిత్రక ఒప్పందం

మాల్దీవులతో చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు ప్రధాని మోదీ. ఇండియా ఔట్‌ అన్న నోటి తోనే ప్రధాని మోదీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజు. ప్రధాని మోదీ పర్యటనలో కీలక ఒప్పందాలు జరిగాయి. భారత్‌-మాల్దీవుల మధ్య ఎల్లప్పుడు...

India-Maldives: మాల్దీవులకు భారత్‌ రూ.4,850 కోట్ల రుణం... రెండు దేశాల మధ్య చారిత్రక ఒప్పందం
India Loan To Maldives
K Sammaiah
|

Updated on: Jul 26, 2025 | 7:59 AM

Share

మాల్దీవులతో చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు ప్రధాని మోదీ. ఇండియా ఔట్‌ అన్న నోటి తోనే ప్రధాని మోదీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజు. ప్రధాని మోదీ పర్యటనలో కీలక ఒప్పందాలు జరిగాయి. భారత్‌-మాల్దీవుల మధ్య ఎల్లప్పుడు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు ప్రధాని మోదీ. 60 ఏళ్ల నుంచి రెండు దేశాల మధ్య స్నేహం ఉందన్నారు. మాల్దీవులకు రూ. 4850 కోట్ల సాయాన్ని ప్రకటించారు. 72 సైనిక వాహనాలను బహుమతిగా ఇచ్చారు. ఏక్‌ పేడ్‌ కే నామ్‌ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు చెట్లు నాటారు.

మాల్దీవుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ మొయిజుతో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. వ్యాపారం, రక్షణ, మౌలికసదుపాయాల లాంటివి ఇందులో ఉన్నాయి. చర్చల తర్వాత ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మొయిజు సమక్షంలో రెండు దేశాల మధ్య ఒప్పందాల మార్పిడి జరిగింది. మాల్దీవుల రక్షణ శాఖకు భారత ప్రభుత్వం వాహనాలు అందించింది. ఇందులో 8 బస్సులు, 10 పికప్‌ వాహనాలు ఉన్నాయి.

భారత్‌-మాల్దీవుల మధ్య రాజకీయ సంబంధాలకు 60 ఏళ్లు పూర్తయ్యింది. చరిత్ర కంటే పురాతనమైన , సముద్రం కంటే లోతైన బంధం రెండు దేశాల మధ్య ఉంది. ఈ రోజు కుదిరిన ఒప్పందం మనం పొరుగు దేశాలమే కాదు… తోటి ప్రయాణికులమని నిరూపించింది. మాల్దీవులకు భారత్‌ అతిదగ్గరలో ఉన్న సరిహద్దు దేశం. మాల్దీవులు భారత్‌ నెబర్‌హుడ్‌ పాలసీలో కీలకపాత్ర పోషిస్తుంది అని మోదీ అన్నారు.

అంతకు ముందు మాల్దీవుల రాజధాని మాలే విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అక్కడి రిపబ్లిక్‌ స్క్వేర్‌లో ప్రధాని మోదీ మాల్దీవుల సైనికులు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. 21 తుపాకులతో సెల్యూట్‌ సమర్పించారు. మాల్దీవుల రక్షణ శాఖ కార్యాలయ భవనంపై ప్రధాని మోదీ ఫొటో ఏర్పాటు చేశారు. మాల్దీవులలతో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి.