AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid: కరోనా బాధితులకు ముందే ముసలితనం వస్తుందా?… సంచలనం రేపుతున్న లెటెస్ట్‌ అధ్యయనం

ఒక్కసారి కరోనా సోకితే శరీరంలో దీర్ఘకాలం ఉంటుందా? ఇటీవల యువకుల్లో హాఠాత్తుగా సంభవించే గుండెపోటు మరణాలకు గతంలో సోకిన కరోనా వైరస్సే కారణమా? కరోనా తగ్గినా కూడా వైరస్‌ మాత్రం శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లడం లేదా? ఇలాంటి అనుమానాలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిపుణులు మాత్రం ఆ అనుమానాలను...

Covid: కరోనా బాధితులకు ముందే ముసలితనం వస్తుందా?... సంచలనం రేపుతున్న లెటెస్ట్‌ అధ్యయనం
Covid
K Sammaiah
|

Updated on: Jul 26, 2025 | 7:37 AM

Share

ఒక్కసారి కరోనా సోకితే శరీరంలో దీర్ఘకాలం ఉంటుందా? ఇటీవల యువకుల్లో హాఠాత్తుగా సంభవించే గుండెపోటు మరణాలకు గతంలో సోకిన కరోనా వైరస్సే కారణమా? కరోనా తగ్గినా కూడా వైరస్‌ మాత్రం శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లడం లేదా? ఇలాంటి అనుమానాలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిపుణులు మాత్రం ఆ అనుమానాలను కొట్టిపడేస్తున్నారు. అయితే ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం మాత్రం విస్తుపోయే రిపోర్ట్స్‌ వెల్లడించింది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ ఏ స్థాయిలో ఉందన్న విషయంతో ప్రమేయం లేకుండా కరోనా బారిన పడిన వ్యక్తుల మెదళ్లు వేగంగా ముసలితనానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆ రిపోర్ట్స్‌ సారాంశం.

కరోనా బారిన పడిన వ్యక్తుల మెదళ్లు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వార్ధక్యంతో ఉన్నాయని ఒక అధ్యయనంలో గుర్తించారు. కరోనా సోకిన 432 మంది వ్యక్తుల మెదడు స్కాన్‌లు మహమ్మారికి ముందు, తర్వాత ఈ అధ్యయనం కోసం తీసుకున్నారు. 996 మంది ఆరోగ్యవంతుల స్కాన్‌లనూ పరిశీలించారు. వీరితో పోలిస్తే వ్యాధిబారిన పడినవారి మెదళ్లు ఐదున్నర నెలలు ఎక్కువగా వృద్ధాప్యానికి గురైనట్టు గుర్తించారు.

కరోనా బాధితులు ఏకాంతంలో గడపాల్సిరావడం, అనిశ్చిత పరిస్థితి ఎదుర్కోవాల్సిరావడం ఇందుకు కారణాలు కావచ్చని నిపుణులు అంటున్నారు. మహమ్మారికి గురైన వయోవృద్ధులు, పురుషులు, నిరుద్యోగులు, తక్కువ ఆదాయం కలిగినవారు, తగినంతగా చదువుకోనివారు, ఇతర బలహీన నేపథ్యం కలిగినవారి మెదళ్లలో కీలక మార్పులు సంభవించినట్లు అధ్యయనంలో కనుగొన్నారు.

మెదడు వృద్దాప్యానికి చేరువైనప్పుడు వ్యక్తుల ఆలోచనలు మసకబారడం, సమాచార విశ్లేషణ, సేకరణ, అవగాహన శక్తి కోల్పోవడం, ఏకాగ్రత సన్నగిల్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు వెల్లడించారు. కరోనా సోకినవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా గుర్తించినట్లు అధ్యయనం రిపోర్టులో వెల్లడించారు.

Follow Us
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది