Pakistan Airways: లావు తగ్గమని నోటీసులు ఇచ్చిన ఉద్యోగ సంస్థ.. బరువు తగ్గలేదంటూ ఉద్యోగాల తొలగింపు
Pakistan Airways: ప్రపంచంలో ఎవరైనా సన్నగా నాజూకుగా ఉండాలని.. కోరుకుంటారు. అలా సన్నగా ఉన్నారు.. చలాకీగా ఉంటూ.. త్వరగా పనులు చేస్తారని భావిస్తారు.. ముఖ్యంగా కొన్ని ఉద్యోగాలకు..
Pakistan Airways: ప్రపంచంలో ఎవరైనా సన్నగా నాజూకుగా ఉండాలని.. కోరుకుంటారు. అలా సన్నగా ఉన్నారు.. చలాకీగా ఉంటూ.. త్వరగా పనులు చేస్తారని భావిస్తారు.. ముఖ్యంగా కొన్ని ఉద్యోగాలకు ముద్దుగా బొద్దుగా ఉండేవారు వద్దు.. నాజూకుగా ఫిట్ గా ఉన్నవారే కావాలని ప్రకటన కూడా ఇస్తారు. అయితే జపాన్ లో మాత్రం భారీ కాయం 100 కేజీల బరువు ఉన్నవారికి ఉద్యోగం అంటూ ఓ సంస్థ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసింది. అయితే అందుకు అపోజిట్ గా ఉద్యోగం లోచేరిన తర్వాత లావు అయ్యారంటూ.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది ఓ సంస్థ.. ఈ సంఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే..
ఉద్యోగంలో చేరిన తర్వాత లావుగా అయ్యారంటూ పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ 140 మందిని విధుల నుంచి తొలగించింది. ఇప్పటికే వీరికి చాలా సార్లు లావు తగ్గించుకోమని చాలా సార్లు నోటీసులు ఇచ్చామని.. ఐనప్పటీకే వారు వినకపోవడంతో వారిని విధుల నుంచి తొలగించింది. ఈ 100 మంది జులై నెలకు సంబందించి ఫ్లైట్ డ్యూటి రోస్టర్ లిస్ట్ నుంచి తీసివేసింది. దీంతో 140 మంది సిబ్బంది పాక్ ఎయిర్‌లైన్ తీరుపై మండిపడుతున్నారు. మరికొందరు ఎయిర్‌లైన్స్ ఉద్యోగాలు చేసే వారు తప్పనిసరిగా నాజూగ్గా కనిపించాలి. లేదంటే వేటు తప్పదని అంటున్నారు.
Also Read: చిన్నతనం నుంచి ఏమీ మారలేదంటూ మెగా యంగ్ హీరోల సెల్ఫీ .. సోషల్ మీడియాలో వైరల్ ..