AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత వ్యాక్సిన్ డీల్ లో బ్రెజిల్ అధ్యక్షుని ‘గోల్ మాల్’…! అవినీతి జరిగిందా ..? అన్నీ అనుమానాలే !

భారత వ్యాక్సిన్ డీల్ లో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో అవినీతికి పాల్పడ్డారా..? ఆయన పాత్ర షేడీ (అనుమానాస్పదం) గా ఉందా..? అంటే దాదాపు అవుననే సమాధానం వస్తోంది.

భారత వ్యాక్సిన్ డీల్ లో బ్రెజిల్ అధ్యక్షుని 'గోల్ మాల్'...! అవినీతి జరిగిందా ..? అన్నీ అనుమానాలే !
Jair Bolsonaro
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 28, 2021 | 12:58 PM

Share

భారత వ్యాక్సిన్ డీల్ లో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో అవినీతికి పాల్పడ్డారా..? ఆయన పాత్ర షేడీ (అనుమానాస్పదం) గా ఉందా..? అంటే దాదాపు అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు ఉదాహరణగా భారత్ బయో టెక్ వారి కొవాగ్జిన్ వ్యాక్సిన్ విషయమే తీసుకుంటే.. అసలు సరఫరాయే కాని ఈ టీకామందుకు ఆయన గారి ఆధ్వర్యంలో ఉందని చెప్పుకుంటున్న ఓ డొల్ల కంపెనీ లక్షల డాలర్ల ఇన్ వాయిస్ పెట్టిందట. సింగపూర్ లోని మెడిసన్ బయో టెక్ అనే ఈ షెల్ సంస్థ..ఈ టీకామందుకోసం 45 మిలియన్ డాలర్ల బిల్లింగ్ (బిల్లు) వేసింది. బ్రెజిలియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని మెడికల్ ఇంపోర్ట్స్ విభాగం హెడ్ లూయీస్ రికార్డో మిరండా డెస్క్ కి గత మార్చి 18 న ఈ మేరకు ఓ రిక్వెస్ట్ అందింది. నిజానికి కోవిద్-19 పై నిపుణుల సలహాలు, సూచనలను పెడచెవిన పెట్టె జైర్ మహాశయుడు….పైగా ఎక్కువ నాణ్యత కలిగినా తక్కువ ధరకు లభించే వ్యాక్సిన్ ను నిరాకరించే ఈయన…ఈ వ్యవహారంలో (డీల్ లో ) మరీ ఇంత ‘ఆసక్తి’ చూపడం అనుమానంగానే ఉందన్న అభిప్రాయాలు వినవచ్చాయి. కోవాగ్జిన్ కోసం బ్రెజిల్ ప్రభుత్వం 300 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును కుదుర్చుకుంటే అసలు ఈ డొల్ల సంస్థ దాని గురించి ప్రస్తావించనే లేదట..

పైగా ఇన్-వాయిస్ పెట్టడమేమిటని మిరండా సందేహించాడు. ఇందులో ఏదో మతలబు ఉందని భావించాడు. ఈ డీల్ వ్యవహారంపై ఇన్వెస్టిగేట్ చేస్తున్న సెనేట్ పానెల్ ముందు గత శుక్రవారం వాంగ్మూలం ఇస్తూ ఇదే విషయాన్ని చెప్పాడు. కోవాగ్జిన్ టీకామందే బ్రెజిల్ కి రాని అంశాన్ని కూడా పేర్కొన్నాడు. ఇంతేకాదు.. భారత్ బయో టెక్ తమ వ్యాక్సిన్ కి డోసు 1.34 డాలర్ కోట్ చేస్తే..బ్రెజిల్ …డోసు 15 డాలర్లకు కొంటామని ఆఫర్ ఇచ్చిందట..ఈ వ్యవహారమంతా జైర్ బోల్సనారో కి ముందే తెలుసునని కూడా వెల్లడైంది. కానీ కామ్ గా ఉండిపోయాడు. ఈ యవ్వారంలో ఆయనను నిందితునిగా పేర్కొనేందుకు సెనేట్ కమిషన్ శ్రీకారం చుట్టింది. అధ్యక్షుని ప్రత్యర్థులు బుధ, శనివారాల్లో ఆయనకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: DRDO Drug 2-DG: కోవిడ్ బాధితుల‌కు గుడ్ న్యూస్‌.. బ‌హిరంగ మార్కెట్లోకి 2డీజీ డ్రాగ్‌.. ధ‌ర ఎంతో తెలుసా.?

ఉగ్రవాదుల ఘాతుకం…….జమ్మూ కాశ్మీర్ లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దంపతుల కాల్చివేత ! కుమార్తె కూడా మృతి ?