Mega Young Heroes: చిన్నతనం నుంచి ఏమీ మారలేదంటూ మెగా యంగ్ హీరోల సెల్ఫీ .. సోషల్ మీడియాలో వైరల్ ..

Mega Young Heroes: సినీ పరిశ్రమలో ఎవరి అండగా లేకుండా స్వయం శక్తితో ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన వేసిన రోడ్డుపై దాదాపు మెగా హీరోలు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ తో..

Mega Young Heroes: చిన్నతనం నుంచి ఏమీ మారలేదంటూ మెగా యంగ్ హీరోల సెల్ఫీ .. సోషల్ మీడియాలో వైరల్ ..
Mega Young Heroes
Follow us
Surya Kala

|

Updated on: Jun 28, 2021 | 11:32 AM

Mega Young Heroes: సినీ పరిశ్రమలో ఎవరి అండగా లేకుండా స్వయం శక్తితో ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన వేసిన రోడ్డుపై దాదాపు మెగా హీరోలు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినా తమకంటూ ఓ ప్రత్యేక శైలితో సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రోజు రోజుకీ మెగా హీరో అభిమానుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇక మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఏ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా అవి వైరల్ అవుతాయి.. తాజాగా యంగ్ హీరోలున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెగా తనయుడు  వరుణ్ తేజ్ తన కజిన్స్ తో దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

సాయి ధరమ్ తేజ్ ఓ ఫోటోనీ సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిన .. చిన్నతనం నుంచి కొన్ని ఏ మాత్రం మారలేదని ఓ క్యాప్షన్ ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ గాడ నిద్రలో ఉండగా వరుణ్ తేజ్ ఒక కన్ను తెరచి సెల్ఫీకి స్టిల్ ఇచ్చాడు. ఇక వారి ఫొటోను చూసి నిహారిక ఇన్స్టాగ్రామ్ లో పక్కున నవ్వేసినట్లు కామెంట్ చేసింది. ఇక ఆ ఫొటో క్షణాల్లోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి వారసుడిగా మొదటగా వెండి తెరపై అడుగు పెట్టింది పవన్ కళ్యాణ్. దీంతో మెగా ఫ్యామిలీ క్రేజ్ మరింత పెరిగింది. తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ , వైష్ణవ తేజ్ లు ఎంట్రీ ఇచ్చారు.. డిఫరెంట్ మూవీస్ తో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇటీవలే మెగా బ్రదర్ తనయ నీహారిక పెళ్లి నిర్వహించారు.. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు యంగ్ హీరోలు పెళ్ళికి రెడీగా ఉన్నారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ , వైష్ణవ్ తేజ్. ముగ్గురు పెళ్ళికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే సాయికి, వరుణ్ కి పెళ్ళిసంబంధాల వేటలో ఉన్నారనే వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ముగ్గురు హీరోలు చిన్నప్పటి నుంచి ఒక గ్యాంగ్ లా ఉంటారట. ఫ్యామిలీ పండగ, పంక్షన్ ఏదైనా సరే ఈ ముగ్గురు కలిసి చేసే అల్లరికి, సందడికి హద్దే ఉండదు.. ఇక వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ లు లకు నీహారిక జత కలిస్తే.. అప్పుడు అక్కడ రచ్చ రచ్చే.. అని చెప్పవచ్చు. ఇక చిన్నప్పటి నుంచి కూడా ఈ ముగ్గురు హీరోలు ఒక్కటే కంచం ఒక్కటే మంచం అనేలా పేరిగినట్లు తెలుస్తోంది.

Also Read:  ఒకప్పుడు అఖండ భారతావనిలోని ఆప్ఘనిస్థాన్ లో శివుడిపేరుతో సరస్సు..

పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?