AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lake Shiva Afghanistan: ఒకప్పుడు అఖండ భారతావనిలోని ఆప్ఘనిస్థాన్ లో శివుడిపేరుతో సరస్సు..

Lake Shiva Afghanistan: ఒకప్పుడు అఖండ భారతంలో ఇప్పటి పాకిస్తాన్‌,భారతదేశం , బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లు కలిసి ఉండేవి. అంటే బ్రిటిష్ కు ముందున్న భారతదేశం...

Lake Shiva Afghanistan: ఒకప్పుడు అఖండ భారతావనిలోని ఆప్ఘనిస్థాన్ లో శివుడిపేరుతో సరస్సు..
Lake Shiva In Afghanisthan
Surya Kala
|

Updated on: Jun 28, 2021 | 10:56 AM

Share

Lake Shiva Afghanistan: ఒకప్పుడు అఖండ భారతంలో ఇప్పటి పాకిస్తాన్‌,భారతదేశం , బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లు కలిసి ఉండేవి. అంటే బ్రిటిష్ కు ముందున్న భారతదేశం. బ్రిటీష్ వాళ్ళు విశాల దేశాన్ని పాలించి, కొన్ని దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి పోయారు. అప్పుడు ఈ దేశాలన్నీ సనాతన ధర్మం ఆచరించాయి. అందుకు సాక్ష్యాలుగా అనేక గుర్తులు ఉన్నాయి.

కోల్ -ఇ -శివ లేదా వొజేరొ శివ పేరుతో ఓ సరస్సు ఆఫ్ఘనిస్తాన్ లోని తజకిస్థాన్ సరిహద్దుల దగ్గర ఉంది. ఆ నదిని ఇప్పటికీ శివుడి పేరుతోనే పిలుస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ , తజకిస్థాన్ సరిహద్దుల్లో ఒకప్పుడు అంటే 1వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము వరకు సనాతన ధర్మం ఆచరించబడ్డది అదీ చాలా విస్తృతంగా. కుడ్య చిత్రాలు, ఫ్రెస్కో లు (అంటే అప్పుడే వేసిన సున్నం మీద చిత్రాలు గీయడాన్ని ఫ్రెస్కో అంటారు) అవి ఇప్పటికీ తజకిస్థాన్ , ఉబ్జెకిస్తాన్, ఇరాన్, రష్యా లోని మారు మూల ప్రాంతాలలో కనిపిస్తాయి. అయితే ఈ కుడ్య చిత్రాలు పూర్తిగా శివుడి మీద ఆధారపడి గీసినవే. పేర్లు మాత్రం అక్కడి స్థానిక భాషలో ఉంటాయి కానీ సనాతన ధర్మం ని ఆచరించారు అనే దానికి సజీవ సాక్ష్యాలని కొందరి పురాతత్వ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

తజకిస్థాన్ లో శివాలయాన్ని పాంజకెంట్ దేవాలయం గా పిలిచేవారు. ఇప్పుడున్న దేశాలు 2వేల క్రితం ఉనికిలో లేవు. వర్తక, వాణిజ్యం చేసే సొగ్దియన్ల హయాంలోనే కుడ్య చిత్రాలు గీయబడ్డాయి అలాగే శివ సరస్సు ని పేరు వాళ్ళే పెట్టారు. సొగ్దియన్లు చైనాతో కాకుండా భారత దేశంతో కూడా బలమయిన సంబంధాలని కలిగి ఉన్నారు అందుకె హిందూ ధర్మ శాంప్రాదాయాలు తో పాటు శివుడిని కూడా పూజించారు. వాళ్ళ గోడల మీద ఉన్న బొమ్మలని చూస్తే అర్ధం అవుతుంది. వేష్పార్కర్ అని శివుడిని పిలిచేవారు సొగ్దియన్లు. 10 వ శతాబ్దం నుండి ప్రారంభం అయిన ముస్లిం దండయాత్రలలో మధ్య ఆసియా తో పాటు దాదాపుగా వాళ్ళు వెళ్ళిన ప్రదేశాలలో ఉన్న గుళ్ళు,గోపురాలని నెల మట్టం చేశారు కాబట్టి అక్కడ సనాతన ధర్మ ఆనవాళ్ళు ఇప్పుడు కనిపించవు. అయితే ఇప్పికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి.

Also Read: తీపి పులుపు కలిసిన టేస్టీ టేస్టీ లెమన్ టీ తయారీ విధానం.. తులసి కలిపితే కలిగే ఆరోగ్య ఫలితాలు

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..