Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pak Foreign Minister: కరోనా నిబంధనలు పక్కకు పెట్టి.. మాస్క్ తోనే కేక్ తినడానికి పాక్ మంత్రి ఆరాటం…వైరల్ వీడియో

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి మళ్ళీ తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఈ సారి నోటి మాటతో కాదు.. తిండి విషయంలో కక్కుర్తి పడుతూ.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యారు. పాకిస్థాన్ లో కరోనా ఓ రేంజ్ లో..

Pak Foreign Minister: కరోనా నిబంధనలు పక్కకు పెట్టి.. మాస్క్ తోనే కేక్ తినడానికి పాక్ మంత్రి ఆరాటం...వైరల్ వీడియో
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2021 | 6:40 PM

Pak Foreign Minister:  పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి మళ్ళీ తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఈ సారి నోటి మాటతో కాదు.. తిండి విషయంలో కక్కుర్తి పడుతూ.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యారు. పాకిస్థాన్ లో కరోనా ఓ రేంజ్ లో విజృంభిస్తోంది. దీంతో అక్కడ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే

మంత్రి మహ్మద్ కరోనా నిబంధనలు పాటించకుండా ఆ రూల్స్ ను బ్రేక్ చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆ పాక్ మంత్రి గారి చేసిన బిత్తిరి పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే..భారత్‌పై విషాన్ని చిమ్మి వార్తల్లో నిలిచే పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ ఈసారి ఓ బిత్తిరి చర్య సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.

పాక్ లోని ముల్టానాలో రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లిన ఖురేషీ అక్కడ ఓ పెద్ద కేక్ ను కట్ చేశారు. కరోనా నిబంధనల్ని మరచి.. కేక్‌ కావాలా తీసుకొండని మంత్రి అక్కడున్న జనానికి సూచించారు. అంటే అక్కడున్నవారు కేక్ కోసం ఎగబడ్డారు. సామజిక దూరం పాటించలేదు. ఒక్కరికి మాస్క్ లు కూడా లేవు. అయితే మాస్క్ ధరించిన ఖురేషీ కూడా కేక్ కోసం ఎగబడ్డారు.. తన నోటికి మాస్క్ ఉందని మరచి కేక్ తినడానికి ఆరాటపడ్డాడు. మంత్రిగారు కేక్ తినే వీడియో పాక్‌ జర్నలిస్ట్‌ నాయ్‌లా ఇనాయత్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.

Also Read:

 క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? బిల్లు కరెక్ట్ సమయానికి కడుతున్నారా..? కట్టకపోతే నష్టాలు తెలుసుకుందాం..!

తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన టీడీపీ అధినేత.. చంద్రబాబు ఏమన్నారంటే..