AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన టీడీపీ అధినేత.. చంద్రబాబు ఏమన్నారంటే..

ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. గ్రామ పంచాయతీ ఫలితాలు వైసీపీ..

తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన టీడీపీ అధినేత.. చంద్రబాబు ఏమన్నారంటే..
K Sammaiah
|

Updated on: Feb 10, 2021 | 5:41 PM

Share

ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. గ్రామ పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది అని అన్నారు చంద్రబాబు. ఎన్నికల్లో నిజమైన హీరోలు ప్రజలేనని, ఎన్ని విధాలుగా హింసించినా ఎదురొడ్డి పోరాడారని చెప్పారు.

ప్రజల గుండెల్లోనుంచి టీడీపీని ఎవరూ తీసివేయలేరని మరోసారి తేలిపోయిందని చంద్రబాబు చెప్పారు. వైసీపీ నేతలు గాలిమాటలు మాట్లాడుతున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. టీడీపీకి 38.74 శాతం పోలింగ్‌ నమోదైందిని తెలిపారు. అరాచకాలు చేసేవారు ఫలితాలను చూసైనా మారాలని హితవు పలికారు.

వైసీపీ 20 నెలల పాలనలో అన్నీ ఉల్లంఘనలేనని, ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించి బెదిరిస్తోందని ఆరోపించారు. ఎస్‌ఈసీ చెబితే వినొద్దని మంత్రి పెద్దిరెడ్డి ఉద్యోగులకు చెబుతారా అంటూ ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలకు టీడీపీ వ్యతిరేకమని చంద్రబాబు అన్నారు. అఖిల భారత సర్వీసు అధికారులను సైతం వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏ తప్పూ చేయని టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు పెట్టారని విమర్శించారు.

Read more:

వారి భూముల జోలికొచ్చారో ఖబర్దార్‌.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు