వారి భూముల జోలికొచ్చారో ఖబర్దార్‌.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

అటు అగ్రవర్ణాలపై, ఇటు అధికారులపై తనదైన శైలిలో కామెంట్స్‌ చేసే మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు..

వారి భూముల జోలికొచ్చారో ఖబర్దార్‌.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
Follow us
K Sammaiah

|

Updated on: Feb 10, 2021 | 5:15 PM

అటు అగ్రవర్ణాలపై, ఇటు అధికారులపై తనదైన శైలిలో కామెంట్స్‌ చేసే మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన అటవీ శాఖ అధికారులను కడిగి పారేశారు. మహబూబాబాబ్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో అటవీశాఖ సిబ్బందికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ సవాల్‌ విసిరారు. పేదల పోడు భూముల్లో కందకాలు తీస్తే ఖబర్దార్ అని హెచ్చరికలు జారీ చేశారు.

పేదల పోడు భూముల విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని శంకర్‌ నాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోపం ఎలాఉంటుందో చూడాలనుకుంటే కందకాలు తియ్యండి అని సవాల్‌ విసిరారు. నలభై యేళ్ళ నుండీ సాగు చేసుకుంటున్న భూముల జోలికీ ఎందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులను రెచ్చగొడితే, తగిన పాఠం చెబుతారని శంకర్‌ నాయక్‌ హచ్చరించారు. గతంలో అడవులను అమ్ముకున్నది ఫారెస్ట్ అధికారులే.. పర్యావరణాన్ని నాశనం చేసింది ఫారెస్ట్ అధికారులే అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. సభలో అందరి ముందు ఫారెస్ట్ అధికారులను కడిగిపారేసిన శంకర్ నాయక్ కామెంట్స్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

Read more:

13 ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన.. కొత్త లిఫ్టులతో ఏయే నియోజకవర్గాలకు నీరందుతుందంటే..

షర్మిలా.. తప్పు చేస్తున్నావు.. కథ, డైలాగ్, స్క్రీన్‌ప్లేను లీక్ చేసిన జగ్గారెడ్డి