విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు పై జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి : ఢిల్లీలో పవన్ కళ్యాణ్ డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహయ, సహకారాలు అందేలా చూడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరారు...

విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు పై జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి : ఢిల్లీలో పవన్ కళ్యాణ్ డిమాండ్
Follow us

|

Updated on: Feb 10, 2021 | 6:47 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహయ, సహకారాలు అందేలా చూడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర రాజకీయాలు, స్థానికంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల పైనా కేంద్రంలో ఉన్న పెద్దలను కలసి మాట్లాడామని పవన్ చెప్పారు. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితులు, దేవాలయాల పై దాడులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చించామని పవన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ వల్ల 18 వేల మంది రెగ్యులర్, 20 వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది, పరోక్షంగా మరింతమంది.. ఇలా మొత్తంగా లక్ష మంది ఉపాధి పొందుతున్నారని పవన్ చెప్పారు. అనేక మంది బలిదానాల ఫలితంగా విశాఖ ప్లాంట్ సాధించామని కేంద్రానికి వెల్లడించినట్టు పవన్ తెలిపారు. వచ్చే నెల 3, 4 తేదీలలో బీజేపీ – జనసేన ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చిస్తామని ఆయన అన్నారు. వైఎస్సార్ పార్టీ తలచుతుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవచ్చు.. కాని ఆ ప్రయత్నం చేయడం లేదని పవన్ విమర్శించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పునరాలోచించుకోవాలని కేంద్రాన్ని కోరామన్నారు పవన్. కేంద్రంలో ఉన్న పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లామని, కచ్చితంగా కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని పవన్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కొనుగోలు పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పవన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తిరుపతి ఎంపీ ఉపఎన్నిక పొత్తుపై మార్చి 3, 4 తేదీల్లో స్పష్టత వస్తుందని ఆపార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

AP Panchayat Election Results 2021: తొలిదశలో 3,244 పంచాయతీలకు గాను, 2,637 స్థానాల్లో వైసీపీ విజయం : బొత్స

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?