తెలంగాణలో చర్చంతా కొత్త జెండా పైనే, షర్మిళ ఎవరు వదిలిన బాణమని సర్వత్రా మీమాంస.!

తెలంగాణలో చర్చంతా కొత్త జెండాపైనే. ఢిల్లీలో పెద్దలు వదిలిన బాణమని గులాబీ కత్తులు దూస్తుంటే.. రెడ్డి, సెటిలర్స్‌ ఓట్లు చీల్చడానికి..

తెలంగాణలో చర్చంతా కొత్త జెండా పైనే, షర్మిళ ఎవరు వదిలిన బాణమని సర్వత్రా మీమాంస.!
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 10, 2021 | 6:43 PM

తెలంగాణలో చర్చంతా కొత్త జెండాపైనే. ఢిల్లీలో పెద్దలు వదిలిన బాణమని గులాబీ కత్తులు దూస్తుంటే.. రెడ్డి, సెటిలర్స్‌ ఓట్లు చీల్చడానికి పింక్‌ వేసిన ప్లానింగ్‌ అంటున్నారు కాషాయదళం. రాజన్న రాజ్యం అని చెల్లెమ్మ అంటున్నా… ఇప్పటికే బీజేపీ మర్రి చెట్టుకున్న మూడు కొమ్మలకు కొత్తగా పూసిన రెమ్మ అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. జిల్లాల టూరుకు షర్మిల రెడీ అవుతుంటే.. వెనక ఉంది ఎవరా అంటూ ఆరాలు తీయడంలో ప్రధాన పార్టీలు తలమునకలవుతున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఓ అడుగు ముందుకేసి తమ పార్టీలో చేరాలంటూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

ఇలాఉంటే, రాజన్నరాజ్యం తెస్తానంటూ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన వైఎస్‌ షర్మిల స్పీడు పెంచారు. ఇప్పటికే నల్గొండ జిల్లా నేతలతో చర్చించారు. ఈ నెల 20న ఖమ్మం వెళ్లి అక్కడే అభిమానగణంతో మాటా-ముచ్చటకు సిద్ధమవుతున్నారు. త్వరలో జరిగే సాగర్‌ ఉపఎన్నిక, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఫోకస్డ్‌‌గా పక్కా ప్లానింగ్‌తో వెళుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ బలం, బలగం ఎంతుందో పరీక్షకు రెడీ అయ్యారనిపిస్తోంది.

ఆంధ్రా పార్టీ ముద్రతో తెలుగుదేశం కనుమరుగైంది. జగన్‌ తానే పార్టీ వద్దనుకున్నారు. ఇప్పుడు షర్మిల రాక వెనక కారణమేంటన్నది రచ్చ రాజేస్తుంది. ఇదంతా కమలనాథులు గీసిన స్కెచ్‌ అంటోంది TRS. అంతసీను లేదు.. ఇదంతా చేసింది పింక్‌ పార్టీనే.. సెటిలర్స్‌ ఓట్లు చీల్చడానికి వేసిన పాచికేనంటూ కాషాయ పార్టీ కౌంటర్‌ ఇస్తోంది. బీజేపీ కుట్రేనని బలంగా నమ్ముతున్నారు హస్తం నేతలు. జగన్‌, చంద్రబాబు, కేసీఆర్‌, MIM పార్టీలను నడిపిస్తున్న అమిత్‌ షా వదిలిన బాణమే షర్మిల కూడా అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని విచ్చిన్నం చేయడంతో పాటు.. కోటి మందికి పైగా ఉన్న సెటిలర్స్‌ ఓట్లు చెదరగొట్టే వ్యూహంలో భాగమేనంటున్నారు జగ్గారెడ్డి. రహస్య ఎజెండా లేకపోతే.. వైఎస్‌ ఆశయాల కోసమే అయితే కాంగ్రెస్‌ పార్టీలో చేరాలంటూ ఆఫర్‌ ఇచ్చారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇక, పార్టీ వైపుగా ఇప్పటికే షర్మిల అడుగులు పడ్డాయి. మరి ఇది ఎవరిని ముంచుతుంది. మరెవరికి వరంగా మారుతుంది.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే లాభమంటోంది TRS‌.

కాంగ్రెస్‌లో చీలిక వచ్చి.. ప్రభుత్వం వ్యతిరేక ఓటు బీజేపీకి వరంగా మారుతుందని కమలనాథులు అంటున్నారు. ఇంతకీ తెలంగాణలో వైఎస్‌ అభిమానులున్నారా? ఉంటే ఓట్లేస్తారా? అభిమానం వేరు.. ఓట్లు వేరన్నది గతంలో ఎన్నోసార్లు వచ్చిన ఎన్నికల లెక్కలు చెబుతున్నాయి. మరి ఇప్పుడు కూడా అదే రిపీట్‌ అవుతుందా.? అనేది పెద్ద ప్రశ్న.

విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు పై జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి : ఢిల్లీలో పవన్ కళ్యాణ్ డిమాండ్