2021లో ఐపీవోకి వెళ్లబోతోన్న టాప్ 10 కంపెనీలు, భారీ స్థాయిలో పెట్టుబడుల సమీకరణకు అడుగులు

10 Major Upcoming IPOs : 2021వ సంవత్సరం భారతీయ మార్కెట్లకు కొత్త ఊపు, ఉత్సాహాన్నిచ్చే సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. 2020వ ఏడాది మొత్తం కరోనా...

2021లో ఐపీవోకి వెళ్లబోతోన్న టాప్ 10 కంపెనీలు, భారీ స్థాయిలో పెట్టుబడుల సమీకరణకు అడుగులు
share market today
Follow us

|

Updated on: Feb 10, 2021 | 9:18 PM

10 Major Upcoming IPOs : 2021వ సంవత్సరం భారతీయ మార్కెట్లకు కొత్త ఊపు, ఉత్సాహాన్నిచ్చే సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. 2020వ ఏడాది మొత్తం కరోనా మహమ్మారి పుణ్యమాని లాక్ డౌన్ లకు పరిమితమైపోగా, 2021వ సంత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో మార్కెట్లు కళకళలాడబోతున్నాయి. ఈ క్రమంలో అనేక సంస్థలు భారతీయ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ లేదా ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వస్తున్నాయి. తద్వారా భారీ స్థాయిలో పెట్టుబడులు సమీకరించాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది ఐపీవోలకు వచ్చే కొన్ని ముఖ్యమైన కంపెనీల గురించి చూద్దాం.

1. ఎల్ఐసి : ప్రముఖ భారత ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఈ ఏడాది ఐపీవోకి వెళ్లబోతోంది. 2021 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ఐపీవోకు వెళుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్ఐసి ఐపీవో ఇష్యూ పరిమాణంలో 10% వరకు ఉంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు. తద్వారా 80,000 కోట్ల మేర నిధులు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

2. కల్యాణ్ జ్యువెలర్స్ : ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యువెలర్స్ తన ఐపీవో ద్వారా సుమారు రూ . 1,750 కోట్లు సేకరించాలని యోచిస్తోంది. 1000 కోట్ల మేర తాజా ఈక్విటీ ఇష్యూను ఇవ్వడానికి ఐపీవోకు వెళుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో సదరు సంస్థ 9,814 కోట్ల నుండి 10,181 కోట్ల ఆపరేటింగ్ అమ్మకాలను నమోదు చేసింది.

3. బజాజ్ ఎనర్జీ : బజాజ్ ఎనర్జీ సంస్థ యొక్క ఐపీవో పరిమాణం సుమారు 5,450 కోట్లు. అందులో రూ. 5,150 కోట్లు తాజా ఇష్యూ అవుతుంది. ఇష్యూ తేదీని ఇంకా ప్రకటించలేదు. షిషిర్ బజాజ్, మినాక్షి బజాజ్, కుషాగ్రా బజాజ్ ఇంకా, అపూర్వా బజాజ్ దీనికి ప్రమోటర్స్ గా ఉన్నాయి. బజాజ్ ఎనర్జీ ఉత్తర ప్రదేశ్ లోని ప్రైవేట్ రంగంలో ఉన్న అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఒకటి.

4. జోమాటో : ఫుడ్ డెలివరీ స్టార్టప్ సంస్థ జోమాటో 2021 మొదటి భాగంలో ఐపీవో కు వెళ్లాలని భావిస్తోంది. డెలివరీ పరిశ్రమలో మరింత ముందుకు వెళ్లేందుకు జోమాటో ఉబెర్ ఈట్స్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

5. బార్బెక్యూ నేషన్ : బార్బెక్యూ నేషన్ త్వరలో ఐపీవోతో ముందుకు రానుంది. తద్వారా సుమారు రూ .1000 నుంచి 1200 కోట్ల మేర పెట్టుబడులు సమకూర్చుకోడానికి సెబీ మార్కెట్ రెగ్యులేటర్ ఆమోదం ఉన్నందున, సుమారు రూ. 275 కోట్లుకు తాజా ఇష్యూ అవుతుంది. సయాజీ హోటల్స్, సయాజీ హౌస్ కీపింగ్ సర్వీసెస్, కయూమ్ ధనాని, రౌఫ్ ధనాని, ఇంకా సుచిత్రా ధనాని బార్బెక్యూ నేషన్ కు ప్రమోటర్స్ గా ఉన్నారు.

6. ఇ-లాజిస్టిక్స్ : సర్వీస్ ప్రొవైడర్ అయిన ఈ సంస్థ మార్కెట్ వాటాలో 20 శాతానికి పైగా కలిగి ఉంది. వివిధ రౌండ్లలో 780 మిలియన్లను సేకరించింది. సంస్థ 85 కి పైగా కేంద్రాలను కలిగి ఉంది. ఇప్పటి వరకు 750 మిలియన్ ఆర్డర్లు ఇచ్చిందీ సంస్థ.

7. పేటీఎం : 2010 లో నెలకొల్పిన ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం ఈ సంవత్సరం ఐపీవోకి వెళుతోంది. సాఫ్ట్‌ బ్యాంక్, యాంట్ ఫైనాన్షియల్స్, టి రో ప్రైస్, ఇంకా డిస్కవరీ క్యాపిటల్ పేటీఎంకు ప్రధాన పెట్టుబడిదారులు. 40% వాటాతో యాంట్ ఫైనాన్షియల్స్ ఇందులో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉన్నారు. పేటీఎం 150-200 మిలియన్ల మేర రోజువారీ వినియోగదారులను కలిగి ఉంది.

8. ఓలా : ప్రముఖ క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ ఓలా ఈ సంవత్సరం బోర్స్‌ల జాబితాలో ఉండాలని యోచిస్తోంది. టైగర్ గ్లోబల్, టెన్సెంట్ తో పాటు మరికొందరు దీనికి ప్రమోటర్స్ గా ఉన్నారు. భారతీయ మార్కెట్లలో 55% మార్కెట్ వాటా ఓలా సొంతం చేసుకుంది.

9. బై జూస్ : భారతదేశపు ప్రముఖ ఎడ్యుకేషనల్ వెబ్ సైట్ ఇది. కరోనా మహమ్మారి సమయంలో ఈ సంస్థ తన ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీనికి లైట్‌స్పీడ్, ఇంకా సీక్వోయా ప్రమోటర్స్ గా ఉన్నారు. 70 మిలియన్ల వినియోగదారులను ఈ సంస్థ కలిగి ఉంది.

10. పాలసీబజార్ : 2008లో ఏర్పాటు చేయబడిన పాలసీ బజార్ ఈ ఏడాది ఐపీవోకి వెళ్లాలని చూస్తోంది. తద్వరా పెట్టుబడులు సేకరించాలని యోచిస్తోంది. దాదాపు 250 మిలియన్ల పెట్టుబడులు సమీకరించాలని పాలసీ బజార్ యోచిస్తోంది. 90 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో, పాలసీబజార్ భారతదేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ భీమా సంస్థగా పేరుపొందింది.

ఇది కూడా చదవండి : కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మ్రోగనున్న ఎన్నికల నగారా.!