AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైనికుల దుస్తుల తయారీ స్వదేశంలోనే… స్వదేశీ వస్త్రంతోనే … డాక్టర్ మయాంక్ ద్వివేది…

భారత ప్రభుత్వం రక్షణ రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు స్వశక్తిని పెంపొందించుకునేలా చేస్తోంది. దాయాది దేశాలను సరిహద్దుల్లో ఎదుర్కొవడంతో పాటు ఆయా దేశాల నుంచి ఇన్నాళ్లు పొందిన సేవలకు స్వస్తి చెబుతోంది.

సైనికుల దుస్తుల తయారీ స్వదేశంలోనే... స్వదేశీ వస్త్రంతోనే ... డాక్టర్ మయాంక్ ద్వివేది...
Rajeev Rayala
|

Updated on: Nov 26, 2020 | 7:22 PM

Share

Indian fabric to replace Chinese foreign clothing for making military uniforms చైనా, పాకిస్తాన్ పట్ల మోడీ సర్కారు అవలంభిస్తున్న తీరు భారత రక్షణ రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మార్పు భారత రక్షణ రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు స్వశక్తిని పెంపొందించుకునేలా చేస్తోంది. దాయాది దేశాలను సరిహద్దుల్లో ఎదుర్కొవడంతో పాటు ఆయా దేశాల నుంచి ఇన్నాళ్లు పొందిన సేవలకు స్వస్తి చెబుతోంది.

స్వయంగా సైనికుల దుస్తుల తయారీ…

ఇటీవల కాలంలో లద్దాఖ్లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాను పూర్తిగా భారత్ పక్కన పెడుతోంది. చైనాతో ఆర్థిక మూలాలను దెబ్బదీసేందుకు సిద్ధం అయింది. ఆ క్రమంలోనే చైనా మొబైల్ యాప్స్ ను బ్యాన్ చేసింది. ఇన్నాళ్లు చైనా తయారు చేసిన సైనిక దుస్తువులనే భారత రక్షణ రంగంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులు ధరించేవారు. ఇప్పుడు చైనా తయారు చేసే దుస్తులకు ప్రత్యామ్నాయంగా స్వదేశీయంగా సైనికుల దుస్తుల తయారీ చర్యలు తీసుకోవడం ద్వారా చైనాకు గట్టిగానే జవాబివ్వనుంది.

ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగానే…

ఇన్నాళ్లు చైనా తయారు చేసిన సైనిక దుస్తులనే వాడేవాళ్లమని, త్వరలో దేశీయంగా, స్వదేశీ వస్తువులతో సైనిక దుస్తులు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డీ ఆర్ డీ ఓ లోని డైరక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్టర్ఫేస్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ డైరెక్టర్ డా. మయాంక్ ద్వివేది అన్నారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని సూచించిన ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగానే భారత సైనికులు ఉపయోగించే దుస్తులను స్వదేశీయంగా తయారు చేసేందుకు యత్నిస్తున్నామని తెలిపారు.

దేశీయంగా లభించే వస్ర్త సామగ్రితోనే యూనిఫాంలు తయారు చేసేందుకు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండస్ర్టీస్ తో సెప్టెంబర్ 17న చర్చలు జరిపినట్లు తెలిపారు. సైనికుల దుస్తుల తయారీతో స్థానిక యువతకు ఉపాధి లభించనట్లు అవుతుందని అన్నారు. సైనికుల దుస్తుల తయారీకి 200 కంపెనీలు ముందుకు వచ్చినట్లు తెలిపారు. సూరత్, అహ్మదాబాద్ కు చెందిన పలు సంస్థలు సైతం సైనికుల దుస్తుల తయారీకి సుముఖతను వ్యక్తం చేసినట్లు ప్రకటించారు.

1.5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం

దేశంలోని అన్ని విభాగాల్లో పని చేస్తున్న సైనికుల దుస్తుల తయారీకి ఏటా 1.5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరమవుతుందని డా. మయాంక్ ద్వివేది అన్నారు. దాంట్లో 55 లక్ష మీటర్ల ఫ్యాబ్రిక్ వస్త్రం ఉంటుందని వివరించారు. దేశీయంగా లభించే వస్త్రంతోనే త్వరలో సైనిక దుస్తుల తయారీకి చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. దేశంలోని పలు టెక్స్ టైల్ కంపెనీలు గ్లాస్ ఫ్యాబ్రిక్, కార్బన్ ఫ్యాబ్రిక్, అరమిడ్ ఫ్యాబ్రిక్, సెరమిక్ ఫ్యాబ్రిక్ తయారీ పట్ల సుముఖత వ్యక్తం చేశాయని, తద్వారా ఫ్యాబ్రిక్ తో సైనికుల బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్స్ తయారీకి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. నైలాన్ 6, 6 యార్న్, లైక్రా ఫ్యాబ్రిక్, పాలీస్టర్ తో సైనికుల దుస్తులను తయారు చేయారు చేయించనున్నామని ప్రకటించారు. సైనికులు ధరించేందుకు, వస్తువులు మోసేందుకు అనుకూలమైన యూనిఫాం లను తయారు చేస్తామని తెలిపారు.