ముద్దు సీన్‌పై స్పందించిన తృణముల్ ఎంపీ మ‌హువా మొయిత్రి.. అందులో తప్పేముందని ప్రశ్నించిన ఎంపీ..

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ తరచూ వివాదాలలో చిక్కుకుంటోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఏ సూటెబుల్ బాయ్ సిరీస్‌లో గుడిలో ముద్దు సన్నివేశంపై హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముద్దు సీన్‌పై స్పందించిన తృణముల్ ఎంపీ మ‌హువా మొయిత్రి.. అందులో తప్పేముందని ప్రశ్నించిన ఎంపీ..
Follow us
uppula Raju

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 26, 2020 | 6:48 PM

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ తరచూ వివాదాలలో చిక్కుకుంటోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఏ సూటెబుల్ బాయ్ సిరీస్‌లో గుడిలో ముద్దు సన్నివేశంపై హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మద్యప్రదేశ్‌లో కేసు కూడా నమోదు చేశారు. లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. హిందూ సంప్రదాయాలను, ఆచారాలను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. వెంటనే ఆ దృశ్యాల్ని తొలగించాలని భారతీయ యువమోర్చా నాయకులు డిమాండ్ చేశారు.

అయితే తాజాగా నెట్‌ప్లిక్స్ సంస్థకు తృణ‌మూల్ ఎంపీ మ‌హువా మొయిత్రి మద్దతు తెలిపింది. అందులో తప్పేముందని ప్రశ్నించింది? ఖ‌జుర‌హో ఫోటోను త‌న ట్వీట్‌లో పోస్టు చేస్తూ గుడిపై ఉన్న ఆ ముద్దు గుడి లోపల ఉంటే తప్పేంటని కడిగేసింది. గుడిపైన అంత పెద్దగా ఉన్న బూతు బొమ్మల కంటే ఇదే పెద్ద తప్పుగా కనిపిస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యప్రదేశ్‌లో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోందని కామెంట్ చేసింది. ప్రతి చిన్న విషయానికి బీజేపీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని మండిపడింది. ఇప్పటికైనా నాయకులు పద్దతి మార్చుకోవాలని సూచించింది. కాగా బీజేవైఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవా పోలీసులు నెట్‌ప్లిక్స్ కాంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షేర్గిల్, డైరెక్టర్ అంబికా ఖురానాపై కేసు నమోదు చేశారు. అయితే ఆరు భాగాలుగా ఉన్న ఏ సూటెబుల్ బాయ్ సిరీస్‌‌ను మీరా‌నాయక్ డైరెక్ట్ చేశారు.