AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ పై పోరులో మీకు సాయం చేస్తాం, ప్రధాని మోదీకి పాకిస్తాన్ ధార్మిక ఫౌండేషన్ లేఖ

భారత్ లో కోవిడ్ కేసులు పెరిగిపోయి అల్లలాడుతుండడంపట్ల పాకిస్థాన్ లోని ప్రముఖ మానవ హక్కుల వాది ఫైసల్  ఈధీ చలించిపోయారు. కరోనా వైరస్ పై మీరు జరుపుతున్న పోరాటానికి తాము సాయపడతామని, సహకరిస్తామని ఆయన అంటున్నారు.

కోవిడ్ పై పోరులో మీకు సాయం చేస్తాం, ప్రధాని మోదీకి పాకిస్తాన్ ధార్మిక ఫౌండేషన్ లేఖ
Pakistan's Edhi Foundation Offers India Assistance To Fight Covid 19
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 23, 2021 | 5:02 PM

Share

భారత్ లో కోవిడ్ కేసులు పెరిగిపోయి అల్లలాడుతుండడంపట్ల పాకిస్థాన్ లోని ప్రముఖ మానవ హక్కుల వాది ఫైసల్  ఈధీ చలించిపోయారు. కరోనా వైరస్ పై మీరు జరుపుతున్న పోరాటానికి తాము సాయపడతామని, సహకరిస్తామని ఆయన అంటున్నారు. ఈ మేరకు తన  ఈధీ ఫౌండేషన్ పేరిట ఆయన మోదీకి లేఖ రాశారు. 50 అంబులెన్స్ లు, మా వలంటీర్లతో  మీ ఇండియాకు వస్తామని, తమకు అనుమతినివ్వాలని ఈ ఫౌండేషన్ చైర్మన్  కూడా అయిన ఆయన ఈ లేఖలో కోరారు. మీ దేశంలో కరోనా బీభత్సం తెలిసి ఎంతో విచారిస్తున్నామని, అనేకమంది మరణించడం, ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి పోవడం తమను కలచివేసిందని ఆయన అన్నారు. మీ దేశంలో ప్రవేశించేందుకు కేవలం పర్మిషన్ ఇవ్వండి.. మా డాక్టర్లు, మెడికల్ టెక్నీషియన్లు, మా ఆఫీస్ స్టాఫ్, చివరకు డ్రైవర్లు కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఈధీ  తెలిపారు. మీ నుంచి తాము ఎలాంటి సాయం కోరడం లేదని, తమ స్టాఫ్ కు ఆహారం, ఇంధనం వంటి అవసరాలను తామే సమకూర్చుకుంటామని ఆయన పేర్కొన్నారు.

పాకిస్థాన్ లో ఈయనకు అతి పెద్ద చారిటబుల్ అంబులెన్స్ నెట్ వర్క్ ఉంది. గతంలో ఫైసల్ ఈధీ  ఫౌండేషన్.. పాకిస్థాన్ సహా ఇండియాలో కూడా పలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టింది. తమ  దేశంలో 15 ఏళ్లుగా చిక్కుబడిన భారతీయ బధిర, మూగ యువతి గీతను ఇండియాకు చేర్చడంలో ఈ ఫౌండేషన్ సాయపడింది. ప్రధాని మోదీకి ఈధీ రాసిన లేఖ పట్ల పాక్ లోని అనేకమంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  మరి… ఈ లేఖపై మోదీ ఎలా స్పందిస్తారన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆపుతావా.. రెండు ‘చెంపదెబ్బలు’ కొట్టాలా? తన తల్లికి ఆక్సిజన్ కావాలని అడిగిన వ్యక్తితో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్!

Dhulipalla : దూళిపాళ్ల అరెస్టుతో ఏపీలో పొలిటికల్ ఫైట్ షురూ.. అనంతపురం నుంచి సిక్కోలు దాకా ఒకటే రచ్చ

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్